లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేంటి!

హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?
నూరు యోజనములు

లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరు?
లంబ పర్వతం

సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతుడికి ఏమిచ్చాడు?
తన (రామ) పేరు చెక్కి ఉన్న ఉంగరం

హనుమంతుడు సహా వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?
స్వయంప్రభ

హనుమంతుడి తల్లి అంజన అసలు పేరు?
పుంజికస్థల

ఆంజనేయుడు సముద్రాన్ని లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరు?
మహేంద్రపర్వతం

వాయుపుత్రుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?
మైనాకుడు

హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేంటి?
సురస

అంజనీ సుతుడి నీడను ఆకర్షించి తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేంటి?
సింహిక

హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?
అశోక వనం

Thanks for Reading. UP NEXT

ఏ రాక్షసుని హస్తంలో రామలక్ష్మణులు చిక్కుకున్నారు!

View next story