రామాయణం : సీత ఎవరికి జన్మించింది!

సీత ఎవరికి జన్మించింది?
నాగటి చాలున తగిలి భూదేవి గర్భం నుంచి జనకుడి దగ్గరకు చేరింది

శివధనుస్సును ఎవరు తయారు చేశారు?
విశ్వకర్మ

పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేంటి?
వైష్ణవ ధనుస్సు

దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?
మంధర

కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడు ఎక్కడున్నాడు?
గిరివ్రజపురం, మేనమామ ఇంట్లో

రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?
శృంగిబేరపురం

సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించారు?
గారచెట్టు

శ్రీరాముని వనవాసానికి చిత్రకూట తగినదని సూచించిన ముని ఎవరు?
భారద్వాజ ముని

పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?
మాల్యవతీ నది

దశరథుని శవాన్ని భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?
తైలద్రోణంలో Images Credit: Pinterest