రామాయణంలో ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసా!

బ్రహ్మదేవుని ఆవలింత నుంచి పుట్టిన వానరుడెవరు?
జాంబవంతుడు

వాలి ఎవరి అంశతో జన్మించాడు?
దేవేంద్రుడు ( ఇంద్రుడు)

వాయుదేవుడి వలన జన్మించిన వానరుడెవరు?
హనుమంతుడు ( ఆంజనేయుడు)

రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేంటి?
లక్ష్మణ, శత్రుఘ్నులు కవలలు- తల్లి సుమిత్ర

రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణం చేసిన మహర్షి ఎవరు?
వశిష్ఠుడు

విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చేసరికి రాముడి వయస్సు?
12 సంవత్సరములు

విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?
మారీచ, సుబాహులు

రాముడికి అలసట, ఆకలి లేకుండా ఉండేందుకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేంటి?
బల-అతిబల

విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?
సిద్ధాశ్రమం

గంగను భూమికి తీసుకొచ్చేందుకు తపస్సు చేసిందెవరు?
భగీరథుడు

జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?
శతానందుడు Images Credit: Pinterest