ఏ రాక్షసుని హస్తంలో రామలక్ష్మణులు చిక్కుకున్నారు!

సీతను అపహరించుటానికి రావణుడు ఎవరి సహాయ కోరాడు?
మారీచుడు

సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?
బంగారులేడి

సీతను తీసుకుపోతున్న రావణునితో యుద్ధం చేసిన పక్షి ఎవరు?
జటాయువు

సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో ఉంది?
మతంగ వనం, పంపానదీ

సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తంలో చిక్కుకున్నారు?
కబంధుని

రామలక్ష్మణుల గురించి తెలుసుకునేందుకు వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపాడు?
హనుమంతుడు

సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివశించారు?
ఋష్యమూక పర్వతం

రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?
అగ్ని సాక్షిగా

వాలి సుగ్రీవుల రాజ్యము పేరేంటి?
కిష్కింధ

వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేంటి?
మాయావి

వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడింది?
మతంగముని

రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షాలు భేదించాడు?
ఏడు