అయోధ్య రామమందిరం గురించి తెలుసుకోవాల్సిన విషయాలివే!

అయోధ్య రామాలయాన్ని 70 ఎకరాల్లో నిర్మించారు

తూర్పు దిశన ఉండే సింహద్వారం నుంచి 32 మెట్లు ఎక్కి ఆలయంలోకి ప్రవేశించాలి

ఈ ఆలయ నిర్మాణానికి 2587 ప్రాంతాల మట్టి ఉపయోగించారు

5 ఆకర్షణీయమైన మండపాలు - డాన్స్ మండపం, రంగ మండపం, సభా మండపం, కీర్తన మండపం, ప్రార్థనా మండపం

ఈ ఆలయం నాగర శైలిలో నిర్మించారు. డిజైన్ స్ట్రక్చర్ ఆధారంగా దేశంలోనే అతి పెద్ద ఆలయం

ఈ ఆలయం పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు

ఈ ఆలయం నిర్మాణంలో ఇనుము ఉపయోగించలేదు

ఈ రామాలయం మూడంతస్తుల విస్తీర్ణంలో ఉంది. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు

ఆలయంలో మొత్తం 392 స్తంభాలు, 46 ద్వారాలు ఉన్నాయి

గర్భగుడిలోని బంగారు ద్వారం ఎత్తు సుమారు 12 అడుగులు, వెడల్పు 8 అడుగులు

ఆలయంలోని మొత్తం 46 ద్వారాల్లో 42 ద్వారాలకు 100 కిలోల బంగారం పూత ఉంది

ఆలయంలో పొందుపరిచిన టైమ్ క్యాప్సూల్‌లో.. ఆలయం, రాముడు, అయోధ్యకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచారు