అన్వేషించండి

Ayodhya Ram Mandir: హోమాలు, యజ్ఞయాగాలు ఎందుకు - వాటివల్ల ఏం ఉపయోగం!

ఆధ్యాత్మికంగా పెద్ద క్రతువు ప్రారంభించినప్పుడు యజ్ఞయాగాలు, హోమాలు నిర్వహిస్తారు. ఇంతకీ యజ్ఞయాగాదులు ఎందుకు చేయాలి? వాటివల్ల ఏం ఉపయోగం...వీటి నిర్వహణ వెనుకున్న ఆంతర్యం ఏంటి...

Ayodhya Ram Mandir :  అయోధ్య రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన సంప్రదాయ క్రతువులు మొదలయ్యాయి . ఇందులో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  దశవిధ స్నానం, విష్ణుపూజ, గోపూజ, ఊరేగింపు, కలశాలతో జలాభిషేకం, వాస్తు పూజలు, హోమాలు, యజ్ఞ యాగాలు జరుగుతాయి. ఇంతకీ యజ్ఞ యాగాదాలు వల్ల ఎవరికి ఉపయోగం...దేవుడికా - మనకా!..

‘సహయజ్ఞాః ప్రజాః సృష్టా పురోవాచ ప్రజాపతిః
అనేన ప్రసవిష్యధ్వమ్‌ ఏషవో స్తిష్ట కామధుక్‌

‘యజ్ఞం’ గొప్పతనాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలిపాడు. ‘యజ్ఞం ద్వారా మీరు వృద్ధి చెందండి. యజ్ఞమే మీ కోర్కెలను తీర్చి ఇష్టసుఖాలనిస్తుంది’ అన్నాడు. మనం తినే అన్నం వర్షం వల్ల కలిగితే, వర్షం యజ్ఞం వల్ల కురుస్తుంది. యజ్ఞం సర్వశ్రేష్ఠ కర్మ. యజ్ఞంలోనే పరమేశ్వరుడు ప్రతిష్ఠితుడై ఉన్నాడు. పరమేశ్వరుని ద్వారా సృష్టి, స్థితి, లయల రూపంలో నిరంతరం యజ్ఞం జరుగుతూనే ఉంది. 

Also Read: అయోధ్య అంటే ఏంటి - ఆ పేరెలా వచ్చింది, విశిష్టత ఏంటి! 

‘యజ్ఞో వై విష్ణుః’
భగవంతుడు యజ్ఞరూపుడు. ఇక్కడ రూపశబ్దానికి లక్షణమని అర్థం. యజ్ఞరూపుడనగానే పరమేశ్వరునికి రూపం ఉందని అనుకోవలసిన పనిలేదు. సృష్టికి రూపం ఉంది. దీన్నే ‘రూపజగత్తు’ అంటారు. ఈ జగత్తు జీవకోటికి ఉపకారాన్ని కలిగిస్తుంది. పరమేశ్వరుని ద్వారానే జగత్తు ఆ పనిచేస్తుంది. కనుకనే, పరమేశ్వరుణ్ణి ‘యజ్ఞరూపుడు, యజ్ఞసదృశుడు’ అంటున్నారు.

దేవతలకు అందించే ఆహారం
అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి యాగం, రాజసూయ యాగం,  సర్పయాగం, విశ్వజిత్ యాగం..ఇలా పురాణకాలం నుంచి రకరకాల యజ్ఞాలు చేశారనే మాట వినే ఉంటారు. ఏ యజ్ఞం చేసినా అంతిమ లక్ష్యం దేవతలను మెప్పించడమే. యజ్ఞంలో అగ్నిలో వేసినవన్నీ దేవతలందరికి చేరుతాయని విశ్వాసం. ఇతిహాసాల్లో కర్దమ ప్రజాపతి కుమారుడు ఇలుడు అశ్వమేధం నిర్వహించి పురుషత్వాన్ని తిరిగి పొందాడు. శ్రీరాముడు రావణ సంహారం తరువాత అయోధ్యకు పట్టాభిషిక్తుడై అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు. మహాభారతంలో జనమేజయుడు సర్పయాగం నిర్వహించాడు.

Also Read: 100 ప్రాంతాల మట్టి, 7 కోట్ల వ్యయం - అయోధ్యలో వెలగనున్న అతి పెద్ద దీపం ప్రత్యేకతలివే!

యజ్ఞాలు 6 రకాలు

ద్రవ్యయజ్ఞం
ద్రవ్యాన్ని న్యాయంగా, ధర్మంగా ఆర్జించాలి. ఆర్జించిన ధనం ధర్మకార్యాలకు వెచ్చించాలని చేసే యజ్ఞమే ద్రవ్యయజ్ఞం

తాపయజ్ఞం
జ్ఞానాగ్నితో ఆత్మను తపింపచేసి, పునీతం, తేజోవంతం చేయడమే పవిత్రమైన తాపయజ్ఞం

స్వాధ్యాయయజ్ఞం
ఏ విద్యనైనా సరే, కేవలం అధ్యయనం చేయటమే కాదు, అర్థం చేసుకుని లోకకల్యాణానికి వినియోగించడమే స్వాధ్యాయయజ్ఞం

Also Read: అయోధ్యలో రామమందిరంతో పాటూ ఇవన్నీ సందర్శించాల్సిన ప్రదేశాలే!

యోగయజ్ఞం
యమ, నియమాదులతో మనస్సుపై పట్టు సాధించి, మానసిక శక్తి సంపాదించటమే యోగయజ్ఞం 

జ్ఞానయజ్ఞం
మనిషి తానెవరు? ఎందుకు పుట్టాడు? ఏం చేయాలని ఆలోచించి, తపించి ఆత్మదర్శనానుభవం పొందాలి. అదే జ్ఞానయజ్ఞం

సంశితయజ్ఞం
తనలో కామక్రోధమద మాత్సర్యాలను జయించి, నియమబద్ధంగా కర్మాచరణ చేయడమే సంశితయజ్ఞం

పాక యజ్ఞాలు,హవిర్యాగాలు, సోమ సంస్థలు..ఇవి కూడా యజ్ఞాల్లో మరో మూడు రకాలని చెబుతారు. యజ్ఞం చేసేటప్పుడు నెయ్యి, పాలు, ధాన్యం, ఆవు పేడ పిడకలు, జిల్లేడు, మొదుగ, దర్బలు, గరిక , ఆరోగ్యాన్ని ఇచ్చే పలు వృక్షాల కట్టెలు వేస్తారు. ఇవన్నీ దేవుడి కోసం మాత్రమే కాదు....

యాగాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

  • యజ్ఞగుండం ద్వారా వచ్చే పొగ వాతావరణంలో పేరుకుపోయిన కాలుష్యాన్ని పోగొట్టి గాలిలో స్వచ్ఛతని పెంచుతుంది
  •  అతివృష్టి, అనావృష్టి సమస్యలు రావు...యజ్ఞాల కారణంగా వర్షాలు కురుస్తాయి
  • యజ్ఞం నిర్వహించే వ్యక్తికి మాత్రమే కాదు...ఆ చుట్టుపక్కల నివాసం ఉండేవారు, ఆ చుట్టుపక్కల పరిసరాలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి
  • యజ్ఞ యాగాదులు నిర్వహించే ప్రదేశాలలో అంటు వ్యాధులు వ్యాపించవు..అనారోగ్యం దరిచేరదు
  • గాలిలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి
  • హోమాల్లోని భస్మంతో ఔషధాలు తయారుచేయొచ్చు..ఆ భస్మాన్ని పంట భూముల్లో చల్లితే ఎరువుగా ఉపయోగపడుతుంది

యజ్ఞం దేవుడికోసం కాదు మనకోసం అన్నది గుర్తించాలంటారు వేదపండితులు. గాలి కూడా కొనుక్కుంటున్న ఈ రోజుల్లో వాతావరణంలో పేరుకుపోతున్న కాలుష్యాన్ని కొంచెమైనా నియంత్రించి గాలిని ఫిల్టర్ చేసుకోవడం ఎంతో అవసరం. అంటే పేరు దేవుడిది..ఫలితం మనదన్నమాట.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
PM Modi US Tour: జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
Lagacharla Incident: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Embed widget