అన్వేషించండి

Ayodhya Ram Mandir: 100 ప్రాంతాల మట్టి, 7 కోట్ల వ్యయం - అయోధ్యలో వెలగనున్న అతి పెద్ద దీపం ప్రత్యేకతలివే!

Ayodhya Ram Mandir : 100 ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టితో అయోధ్యలో.. ప్రపంచంలోనే అతిపెద్ద దీపం సిద్ధమవుతోంది. రామచంద్రుడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు 3 రోజుల ముందు ఈ దీపం వెలిగించనున్నారు...

Ayodhya Ram Mandir :  రామ జన్మభూమి అయోధ్యలో  శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు సన్నాహాలు చివరి దశలో ఉన్నాయి. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రతిష్టాపన కార్యక్రమం జనవరి 22న జరగబోతున్నప్పటికీ వారం ముందునుంచే సందడి మొదలుకానుంది. ఇందులో భాగంగా విగ్రహ పత్రిష్టాపనకు మూడు రోజుల ముందు ప్రపంచంలోనే అతిపెద్ద దీపం అయోధ్యలో వెలిగించనున్నారు....

Also Read: అయోధ్య అంటే ఏంటి - ఆ పేరెలా వచ్చింది, విశిష్టత ఏంటి! 
 
రూ.7 కోట్ల బడ్జెట్
28 మీటర్ల పొడవు - వెడల్పు ఉన్న ఈ దీపాన్ని వెలిగించేందుకు 21 క్వింటాళ్ళ నూనె అవసరమవుతోంది. ఈ దీపం ఘనతను గిన్నిస్ బుక్ లోకి ఎక్కించే సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రతువుకు దశరథ్ దీప్‌గా నామకరణం చేసిన ఆలయ ట్రస్ట్, దీపపాత్ర తయారీకి 100 పుణ్యక్షేత్రాల్లోని మట్టితో పాటు నదులు, సముద్రాల నుంచి పుణ్య జలాలు సేకరించారు. పాకిస్థాన్‌కు చెందిన హీంగ్లాజ్ నుంచి, నేపాల్‌లోని జనక్‌పూర్ నుంచి కూడా మట్టిని తెప్పించారు. పురాణాలను అధ్యయనం చేసి...త్రేతాయుగం నాటి దీపం ఆకారాన్ని సిద్ధం చేస్తోన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రమిద తయారీ కోసం 108 మంది కళాకారులు శ్రమిస్తుండగా...7 కోట్ల బడ్జెట్ వెచ్చిస్తున్నారు. దీపం వత్తి తయారీకి 1.25 క్వింటాళ్ళ పత్తిని కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. దీపం తయారీకి వినియోగించే అధునాతన యంత్రం కోల్‌కతా నుంచి తెప్పించారు.

Also Read: అయోధ్య 'రామయ్య' విగ్రహం ఇదే - 'రామ్ లల్లా'ను చెక్కిన శిల్పి ఎవరో తెలుసా.?

తులసివాడి
త్రేతాయుగంలో శ్రీరాముడు తన కుటుంబంతో కలిసి తులసివాడిలో పూజలు చేసేవాడని చెబుతారు. సరయూ ఒడ్డున స్నానమాచరించి ఆ తర్వాత తులసివాడిలో పూజలు నిర్వహించేవాడు. అందుకే ఆ ప్రదేశాన్ని రామ్ ఘాట్ అని అంటారు. ప్రభుత్వ పత్రాల్లో కూడా ఈ పేరుతోనే ఉంది. ఈ ప్రదేశంలోనే అతిపెద్ద దీపాన్ని వెలిగించనున్నారు...

Also Read: సంక్రాంతి వచ్చేస్తోంది - మీకు పట్టిన శనిని ఇలా వదిలించేసుకోండి!

జనవరి 16 నుంచి 22 వరకూ అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ పూర్తి షెడ్యూల్‌ ఇదే

  • జనవరి 15 మకర సంక్రాంతిలో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది
  • జనవరి 16 శ్రీరాముని విగ్రహానికి ప్రతిష్ఠాపన ఆచారాలు మొదలవుతాయి
  • జనవరి 17 విగ్రహాల ఊరేగింపుతో పాటూ సరయు నదినుంచి నీటిని కలశాలతో తీసుకెళ్తారు
  • జనవరి 18 మండప ప్రవేశ పూజ, వాస్తు పూజ, వరుణ పూజ, విఘ్నహర్త గణేశ పూజ, మార్తిక పూజ వంటి ఆచారాలతో పవిత్రోత్సవం ప్రారంభమవుతుంది.
  • జనవరి 19 రామమందిరంలో యజ్ఞ అగ్నిగుండం స్థాపన జరుగుతుంది
  • జనవరి 20 వివిధ నదుల నుంచి సేకరించిన నీటిని కలిగి ఉన్న 81 కలశాలతో రామమందిరం గర్భగుడిని పవిత్రం చేస్తారు..వాస్తు శాంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు
  • జనవరి 21 యజ్ఞం సందర్భంగా.. ప్రత్యేక పూజలు హవనాల మధ్య శ్రీరామ చంద్రుడికి 125 కలశాలతో దివ్య స్నానం
  • జనవరి 22 ప్రధాన ఘట్టమైన ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. మృగశిర నక్షత్రం సందర్భంగా మధ్యాహ్న సమయంలో శ్రీరామునికి ప్రత్యేక పూజలు చేస్తారు
  • ప్రాణ ప్రతిష్ఠా ముహూర్తం - జనవరి 22 మధ్యాహ్నం  12:29 నుంచి  12:30:32 PM వరకు...

టాప్ హెడ్ లైన్స్

Guru Gochar 2026: నిద్రలేవగానే మొబైల్ చూసే అలవాటుందా? మీపై గురుగ్రహం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
నిద్రలేవగానే మొబైల్ చూసే అలవాటుందా? మీపై గురుగ్రహం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
Chandra Grahan 2026: చంద్ర గ్రహణం రోజు రక్షా బంధన్! పూజ చేసేందుకు సమయం, నియమాలు తెలుసుకోండి!
చంద్ర గ్రహణం రోజు రక్షా బంధన్! పూజ చేసేందుకు సమయం, నియమాలు తెలుసుకోండి!
బుధవారం ఏ దేవుడిని పూజించాలి?చదవాల్సిన శ్లోకాలు, పూజా విధానం, నైవేద్యం తెలుసుకోండి!
బుధవారం ఏ దేవుడిని పూజించాలి?చదవాల్సిన శ్లోకాలు, పూజా విధానం, నైవేద్యం తెలుసుకోండి!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!

వీడియోలు

Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget