అన్వేషించండి

Ayodhya: అయోధ్యలో రామమందిరంతో పాటూ ఇవన్నీ సందర్శించాల్సిన ప్రదేశాలే!

శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రతిష్టాపనకు అయోధ్య వెళుతున్నారా..అంతదూరం వెళ్లిన తర్వాత రామయ్యను మాత్రమే చూసి వచ్చేయకండి.. ఇంకా అయోధ్యలో సందర్శించాల్సిన చాలా ప్రదేశాలున్నాయి..

Best Places to Visit in Ayodhya: ఈ నెల 22న అత్యంత ప్రతిష్టాత్మకంగా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఈ అపురూపమైన వేడుకకు రామజన్మభూమి  ముస్తాబవుతోంది. ఈ సమయంలో భారీగా భక్తులు అయోధ్యకు తరలివెళుతున్నారు. రామమందిరంలో కొలువుతీరనున్న శ్రారాముడిన కళ్లారా దర్శించి తరించేందుకు పోటీపడతారు. అయితే కేవలం రామమందిరం మాత్రమే కాదు అయోధ్యలో సందర్శించాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు మరికొన్ని ఉన్నాయి..అవేంటో చూద్దాం..

గుప్తర్ ఘాట్..

ఇది రామజన్మభూమికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రకృతి  అందాల మధ్య సరయూ నది ఆరో ఘాట్ ఇది. శ్రీరాముడు తన సర్వోన్నత నివాసానికి ఈ ఘాట్ నుంచే వెళ్లాడంటోంది వాల్మీకి రామాయణం.

మణి పర్వత్

అయోధ్యలోని కామి గంజ్ ప్రాంతంలో ఉన్న మణి పర్వత్ కి ఓ ప్రాముఖ్యత ఉంది. రామ రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు ఆంజనేయుడు సంజీవని పర్వతం తీసుకొచ్చాడు. ఆ సమయంలో పర్వతంలో కొంత భాగం ఇక్కడ పడిందని చెబుతారు.

Also Read: 100 ప్రాంతాల మట్టి, 7 కోట్ల వ్యయం - అయోధ్యలో వెలగనున్న అతి పెద్ద దీపం ప్రత్యేకతలివే!

నాగేశ్వరనాథ్ ఆలయం

శ్రీరాముడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్టించించిన ఆలయమే నాగేశ్వరనాథ్ ఆలయం. ఈ ఆలయంలోని శివలింగానికి భక్తులు సరయూనది నుంచి నీటిని తీసుకువచ్చి అభిషేకం చేస్తారు.

హనుమాన్ గర్హి

శ్రీరాముడి గొప్ప భక్తులు హనుమంతుడు. ఆ భక్తులు వెలసిన ఆలయమే హనుమాన్ గర్హి. అయోధ్యకు రక్షకుడిగా భావించే వాయుపుత్రుడిని తప్పనిసరిగా దర్శించుకోవాలంటారు పండితులు

కనక భవన్

అయోధ్యలో ఉన్న ఈ భవన్ అధ్భుతమైన శిల్పకళా వైభవానికి సంకేతం. దశరథుడు తన మూడో భార్య కైకేయికి బహుమతిగా ఇచ్చిన రాజభవనం అని చెబుతారు. కైకైయి ఈ భవనాన్ని సీతాదేవికి ఇచ్చిందంటారు. ఇందులో సీతారాముల విగ్రహాలుంటాయి. 

Also Read: అయోధ్య అంటే ఏంటి - ఆ పేరెలా వచ్చింది, విశిష్టత ఏంటి! 

దేవకాళి దేవాలయం

అయోధ్య సమీపం ఫైజాబాద్ లో ఉంది దేవకాళి దేవాలయం. ఈ ఆలయంలో గిరిజా దేవి కొలువై ఉంటుంది. వివాహం అనంతరం అయోధ్యకు వచ్చినప్పుడు సీతాదేవి తనవెంట తీసుకొచ్చిన విగ్రహం ఇది అని..స్వయంగా దశరథ మహారాజు ఆలయాన్ని నిర్మించి ఆ విగ్రహాన్ని ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి.

సీతా కి రసోయి

అయోధ్య వెళ్ళేవారు సీతా కి రసోయి పేరు తప్పకుండా వింటారు. ఇది సీతాదేవి వంటగది. ఇప్పుడిది దేవాలయంగా రూపాంతరం చెందింది. నాటికాలం వంటపాత్రలు, వంట సామగ్రిని ఇక్కడ చూడొచ్చు. 

రామ్ కథా పార్క్

అయోధ్యలో రామ్ కథా పార్కు ఒక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ రామ మందిరానికి సంబంధించి సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రార్ధనా సమావేశాలు, అనేక ఇతర కార్యక్రమాలు ఉంటాయి. ఈ ప్రదేశం కూడా చూడదగినది.

Also Read: సంక్రాంతి వచ్చేస్తోంది - మీకు పట్టిన శనిని ఇలా వదిలించేసుకోండి!

అయోధ్య రాజ మందిరం 

అయోధ్యలో రాజమందిరం కూడా చూడాల్సిన ప్రదేశం. నాటి కాలం విగ్రహాలు, దేవళ్లు - దేవతలకు సంబంధించిన ఎన్నో విగ్రహాలు ఇక్కడ ఉంటాయి. 

అయోధ్య ఘాట్  

అయోధ్య ఘాట్ లో బోట్ రైడ్ అద్భుతం. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో సరయు నదిలో బోట్ ప్రయాణం మంచి ఆనందాన్నిస్తుంది. 

గులాబ్ బారీ

నవాబులు అయోధ్యలో నిర్మించిన అందమైన భవనాలలో ముఖ్యమైనవి గులాబ్ బారీ, మోతీ మహల్, బహు బేగం సమాధి . వీటిలో గులాబ్ బారిలో శిల్పకళ చూపుతిప్పుకోనివ్వదు. 

టాప్ హెడ్ లైన్స్

13-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
13-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
Solar Eclipse 2026: మొబైల్, టీవీలో ప్రత్యక్ష సూర్యగ్రహణాన్ని చూసినా నియమాలు పాటించాలా? తర్వాత స్నానం చేయలా?
మొబైల్, టీవీలో ప్రత్యక్ష సూర్యగ్రహణాన్ని చూసినా నియమాలు పాటించాలా? తర్వాత స్నానం చేయలా?
Solar Eclipse 2026: సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?
ఆగష్టు 12న సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?
Pisces Half Year Horoscope: మీన రాశి 2026 జూలై to డిసెంబర్ మీ జీవిత గమనం మారుతుందా?
మీన రాశి 2026 జూలై to డిసెంబర్ మీ జీవిత గమనం మారుతుందా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
Embed widget