Ugadi Panchangam 2026: ఉగాది 2026 పరాభవ నామ సంవత్సరం తులా రాశి ఉగాది ఫలితాలు! వద్దన్నా అదృష్టం మిమ్మల్ని వదలదు!
Parabhava Nama Samvatsara Panchangam: శ్రీ పరాభవ నామసంవత్సరంలో తులా రాశివారికి ఎలాంటి ఫలితాలున్నాయి? ఏ గ్రహం అనుకూలం? ఏ గ్రహం ప్రతికూలం? 2026 - 2027 వార్షిక ఫలితం ఇక్కడ తెలుసుకోండి

Tula Rashi Parabhava Nama Samvatsaram Phalitalu 2026 2027
తులా రాశి
చిత్త 3,4 పాదాలు, స్వాతి , విశాఖ 1,2,3, పాదాలుట
ఆదాయం - 5 వ్యయం 14 రాజపూజ్యం 6 అవమానం 3
పరాభవ నామ సంవత్సరంలో తులా రాశివారికి గురుడు శుభస్థానంలో ఉన్నాడు. కేతువు కూడా శుభస్థానంలో సంచరిస్తున్నాడు. కుజుడు అష్టమం, రాహువు అర్థాష్టమంలో ఉన్నారు. అయితే ధనం, కుటుంబం, సంపత్తుకి కారకుడైన గురుడు 9,10 స్థానాల్లో సంచారం మీకు కలిసొస్తుంది. గురుబలం వల్ల దైవబలం మీకు హెచ్చుగా ఉంటుంది. ఏపనిలోనైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులు పూర్తవుతాయి, శత్రుబాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఏ వృత్తివ్యాపారాల్లో ఉన్నా రాణిస్తారు. గతేడాదివరకూ ఎదుర్కొన్న ఒడిదొడుకుల నుంచి బయటపడతారు. రానిబాకీలు వసూలవుతాయి. నూతన గృహ నిర్మించేందుకు ప్లాన్ చేస్తారు. అవమానాలు, అపనిందలు పడాల్సి వచ్చినా అవి మీపై ఎలాంటి ప్రభావం చూపవు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది
పరాభవ నామ సంవత్సరం తులా రాశి ఉద్యోగులకు
ఈ రాశి ఉద్యోగులకు యోగకాలం. గ్రహ సంచారం బాగుండంతో ప్రమోషన్ తో కూడిన బదిలీలు. అధికారుల అనుగ్రహం. కోర్టుకేసులున్న వార్కి కూడా అనుకూలంగా తీర్పులు వస్తాయి. వాహన మార్పులుంటాయి. ప్రభుత్వాద్యోగులకు అనుకూలత ఉంటుంది. నిరుద్యోగులు ఈ సంవత్సరం ఉద్యోగం పొందగలరు.
తులా రాశి వ్యవసాయదారులకు
ఈ రాశి వ్యవసాయదారులకు పరాభవ నామ సంవత్సరంలో రెండు పంటలు లాభిస్తాయి. పంట దిగుబడి బావుంటుంది. ఎవాంటి ఒడిదొడుకులు ఉండవు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. రొయ్యలు, చేపల చెరువులు వారు లాభపడతారు. కోళ్లఫారం వారికి మంచి లాభాలొస్తాయి
తులా రాశి వ్యాపారులకు
ఈ రాశి వ్యాపారులకు పరాభవ నామ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. జాయింటు వ్యాపారులకు భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. మంచి లాభాలు ఆర్జిస్తారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. హోల్సేల్ - రిటైల్ వ్యాపారులకు మంచి లభాలొస్తాయి. బంగారం, వెండి వ్యాపారస్థులకు అనుకూలం. రియల్ ఎస్టేటు వ్యాపారులకు అనుకూలమే. కాంట్రాక్టు పనులు చేయువారికి మంచి జరుగుతుంది
తులా రాశి విద్యార్థులకు
పరాభవ నామ సంవత్సరంలో తులా రాశి విద్యార్థులు చదువులో వెలుగుతారు. గురుబలం ఉండడంతో చదువుపై శ్రద్ధ, ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంజనీరింగ్, మెడిసిన్, లాసెట్, ఐసెట్, అసెట్ లాంటి ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు, కోరుకున్న కళాశాలలో సీట్లు పొందుతారు. ఈ రాశి క్రీడాకారులకు ఈ ఏడాది అనుకూలమే
తులా రాశి ఉద్యోగులకు రాజకీయ నాయకులకు
ఈ రాశి రాజకీయ నాయకులకు మహోన్నత కాలంగా ఉంటుంది. ప్రజలలో మంచి ఆదరణ, పేరుప్రఖ్యాతులుపొందగలరు. పార్టీలోనూ, హైకమాండ్లోనూ మీకు మంచి పేరు ఉంటుంది. ఏదో ఒక నామినేటెడ్ పదవిలభిస్తుంది. ఎన్నికలలోపోటీ చేసిన మీదే విజయం.శత్రువులను మీతెలివితేటలతో, ఎత్తులతో అణచివేయగలరు.
తులా రాశి కళాకారులకు
పరాభవ నామ సంవత్సరం మీకు గురబలం వల్ల యోగదాయకం అనే చెప్పాలి. టి.వి సినిమా రంగంలో గాయనీ,గాయకులు, నటీ నటులకు , సాంకేతిక నిపుణులకు మంచి ఫలితాలుంటాయి. ప్రభుత్వం, ప్రవేటుసంస్థల నుంచి అవార్డులు, రివార్డులు అందుకుంటారు. అవకాశాలు మెరుగుపడతాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది
తులా రాశి స్త్రీలకు
ఈ రాశి స్త్రీలకు గ్రహాల బలం బావుండడంతో మాటకు ఎదురుండదు. కుటుంబంలో మీ విలువ పెరుగుకుంది. విలువైన ఆభరణాలు లభించును. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడతాయి. కుటుంబంలో సంతోషం, సంతానం వల్ల ఆనందం, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి అధికారుల మన్ననలు ప్రమోషన్లు లభిస్తాయి. గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ జరుగుతుంది. ఈ రాశి అవివాహితులకు వివాహం జరుగుతుంది
శ్రీ పరాభవ నామ సంవత్సరం తులా రాశివారికి యోగదాయకంగా ఉంటుంది. మీ తెలివితేటలు, శక్తిసామర్ధ్యాలు, మిమ్మల్ని రక్షిస్తాయి. మీ గౌరవం పెరుగుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

















