Sri Sambara Polamamba Jatara 2025: శ్రీ శంబర పోలమాంబ జాతర 2025 - సిరిమానోత్సవం గురించి ఈ విషయాలు తెలుసా!
Sambara Polamamba Jatara 2025: ప్రతి పల్లెలోను ఓ గ్రామ దేవత పేరిట పార్వతీదేవిని పూజిస్తారు. తెలంగాణలో సమ్మక్కసారక్కలా ఉత్తరాంధ్రలో విజయనగరం పైడిమాంబ, శంబర పోలిమాంబ జాతర జరిపిస్తారు...
![Sri Sambara Polamamba Jatara 2025: శ్రీ శంబర పోలమాంబ జాతర 2025 - సిరిమానోత్సవం గురించి ఈ విషయాలు తెలుసా! Andhra Pradesh Sri Sambara Polamamba Jatara history know in telugu Sri Sambara Polamamba Jatara 2025: శ్రీ శంబర పోలమాంబ జాతర 2025 - సిరిమానోత్సవం గురించి ఈ విషయాలు తెలుసా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/fcbda5105dd087b85431deb3a2ce9b531738145200855217_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sri Sambara Polamamba Jatara 2025: శంబర పూర్వం దండకారణ్య ప్రాంతంగా ఉండేది. శంబాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. మహా పరాక్రమవంతుడు, మాయావి అయిన శంబాసురుడి పరిపాలనలో ప్రజలు, మునులు చిత్రహింసలు అను భవించేవారు. రాక్షసరాజు బారినుంచి రక్షించమని అప్పటి ప్రజలు, తపస్సంపన్నులు శక్తిస్వరూపిణిని వేడుకోవడంతో ఆమె పోలేరేశ్వరిగా అవతార మెత్తి శంబాసుర రాక్షసుడుని సంహరించి సుఖశాంతులు కలుగజేసింది. అప్పటినుంచి పోలేశ్వరి పోలమాంబగ ప్రాచుర్యం పొంది ఈ ప్రాంత ఆరాధ్య దైవంగా పూజలందుకుంటోంది. శంబాసుర రాక్షసరాజు పరిపాలించండంతో ఈ ప్రాంతానికి శంబర అనిపేరువచ్చింది.
Also Read: మాఘ మాసం మొదలు .. వివాహాది శుభాకార్యాలకు ముహూర్తాలు ఎప్పటి నుంచి ఎప్పటివరకు!
అమ్మవారి జననం
సుమారు 400సంవత్సరాల క్రితం స్వర్గీయ పృకాపు అప్పన్నదొర దంపతులకు పోలేశ్వరి జన్మించింది. బాల్యం నుంచి ప్రత్యేకంగా ఉండేది పోలేశ్వరి. పోలమాంబకు యుక్తవయసు రావడంతో ఆమెకు వివాహం చేయాలని తండ్రి మేనత్తలు నిర్ణయించారు. తాను వివాహం చేసుకోనని గ్రామ దేవతగా అవతరించనున్నానని పోలమాంబ చెప్పిందట. అయితే పెళ్లి జరిగిన తర్వాతే పేరంటాలుగా గ్రామ దేవతగా అవతరించాలని మేనత్త నచ్చ జెప్పటంతో పోలమాంబ వివాహం చేసుకునేందుకు అంగీకరించింది. స్వతహాగా అందగత్తె అయిన పోలమాంబ రూపాన్ని వివాహ సమయంలోనైనా ఆమెను చూడవచ్చని గ్రామస్తులు భావించారు. గ్రామస్తుల భావనలకు భిన్నంగా వివాహం చేసుకుంటానని పోలమాంబ ఆంక్ష విధించింది. తనను పెళ్ళి చేసుకోబోయే వ్యక్తి ముట్టుకున్న పూలమాలను మేనత్త చేతుల మీదుగా తెప్పించుకుని మెడలో వేసుకుని వివాహం జరిగిందనిపించింది. వివాహం అనంతరం పల్లకిలో అత్తారింటికి బయలు దేరింది. ఆ సమయంలో నైనా ఆమెను చూడాలనిగ్రామస్థులు ఉబలాటపడ్డారు. గ్రామస్తుల కంట పడకుండా మెరుపు తీగలా ఇంట్లో నుంచి పల్లకి ఎక్కి ఎక్కి కూర్చుంది. భర్త గుర్రంపై ముందు వె ళ్తుండగా వెనుక పల్లకిలో మేనత్తతో పోలమాంబ వెళ్లింది.
శంబర గ్రామ పోలిమేరలకు పల్లకి చేరుకో గానే పల్లకిని దించమని బోయలను ఆదేశించింది. పల్లకిని నేలపై దించిన వెంటనే ఆమె సమీపంలో ఉన్న చెట్టు వెనక్కు వెళ్ళింది. ఎంతసేపటికి ఆమె తిరిగి రాకపోయే సరికి చెట్టుచాటుకు మేనత్త వెళ్ళి చూడగా అప్పటికే పోలమాంబ పీకలలోతు వరకు భూమి లోపలికి వెళ్ళింది. ఈ దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతి చెందిన మేనత్తతాను నీతో వచ్చేస్తాననటంతో సమీపాన భూమిపై అక్షింతలు జల్లమని చెప్పగా మేనత్త అక్షింతలు జల్లగా భూమిలోపల ప్రవేశానికి అవకాశం రావటంతో మేనత్త కూడా తల బాగం కనిపించేలా భూమిలోనికి దిగింది. అప్పటి నుంచి పోలమాంబను గ్రామస్తులు గ్రామ దేవతగా ఆరాధిస్తు ఏటా జాతర జరుపుతున్నారని స్థానిక కథనం.
Also Read: కుంభం నుంచి మీనం లోకి శుక్రుడు.. ఈ 5 రాశులవారికి ప్రయోజనం..మిగిలిన వారు అప్రమత్తం!
పోలమాంబ శంబర గ్రామంలో పుట్టి పెరిగినందున గ్రామస్తులంతా పోలమాంబను ఆడపిల్లగా భావిస్తా రు. సంక్రాంతి పండుగకు ప్రతి ఆడపిల్ల పుట్టింటికి వెళ్లే ఆనవాయితి ఉంది గనుక పోలమాంబ అమ్మవా రిని సంక్రాంతి రోజుకు ముందు వచ్చే మంగళవారం గ్రామంలోనికి తెస్తారు. సంక్రాంతి పండుగ తరువాత వచ్చే మంగళవారం అమ్మవారికి పూజలు నిర్వహిం చి ఆ తరువాత వచ్చే మంగళవారం అమ్మవారి సిరిమానోత్సవం జరిపించటం ఆనవాయితి
సిరిమానోత్సవం
పోలమాంబ అమ్మవారి జాతరను వైభవంగా చేసుకుంటారు. అమ్మవారు శక్తిస్వరూపిణి. మంగళవారం రోజు పూజారి సిరిమాను రథంపై గ్రామం లోని వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు పూజారిని అమ్మవారి ప్రతిరూపంగా భా విస్తారు. అందువలన సిరిమాను అధిరోహించే పూజారికి అరటిపళ్లు, కొబ్బరికాయలు, చీరలు చూపించి భక్తులు మొక్కుబడులు చెల్లించుకుంటా రు. మక్కువ, సాలూరు మండలాలకు సమీపంలో ఉన్న అడవుల్లో లభ్యమయ్యే సుమారు 36 నుంచి 42 అడుగుల సిరిమాను కర్ర (తాడిమాను) ను గ్రామపెద్దలు, ట్రస్టు కమిటీ సభ్యులు సిరి మానోత్సవానికి రెండురోజులు ముందుగా గుర్తిస్తారు.
Also Read: ముందు నుంచి పురుషుడు.. వెనుక నుంచి స్త్రీ.. ఈ విశేష ఆలయం ఏపీలోనే ఉంది!
అమ్మవారి ప్రతిరూపం వేపచెట్టు
గ్రామ ఆవలి ఒడ్డున ఉన్న వనంగుడి వెనుక ఉన్న వేపచెట్టును అమ్మవారి ప్రతిరూపంగా భక్తులు కొ లుస్తుంటారు. పోలమాంబ అమ్మవారు ఈ వేపచెట్టు వద్ద భూమిలో అంతర్థానం కావడం వలన జాతరకు వచ్చిన భక్తులు వనం గుడి వెనుకనున్న వేపచెట్టుకు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, చీరలు, జాకెట్లు పెట్టి, మొక్కుబడి తీర్చుకుంటారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)