అన్వేషించండి

Summer Health Tips : వేసవికాలంలో బీపీ, షుగర్, ఆస్తమా పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

Beat the Heat : సమ్మర్ వచ్చేసింది. ఈ సమయంలో వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే.. 

Summer Health Tips for BP, Sugar, and Asthma Patients : ఫిబ్రవరిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కొన్ని విషయాలు అస్సలు విస్మరించవద్దని సూచిస్తున్నారు నిపుణులు. మధుమేహమున్నవారు, బీపీ పేషెంట్లు, ఆస్తమా రోగులు సమ్మర్​లో కొన్ని విషయాల పట్ల కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని.. లేకుంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. మరి బీపీ, షుగర్, ఆస్తమా పేషెంట్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. 

బీపీ పేషెంట్లు.. 

రక్తపోటు సమస్యలున్నవారు సమ్మర్​లో కొన్ని సూచనలు రెగ్యులర్​గా ఫాలో అవ్వాలి. ఇవి బీపీ పెరగకుండా హెల్ప్ చేస్తాయి. అవేంటంటే.. 

హైడ్రేషన్ : శరీరం డీహైడ్రేషన్ కాకుండా.. నీళ్లు తాగాలి. ఎలక్ట్రోలైట్ రిచ్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటాలి. ఇది శరీరంలో బీపీని కంట్రోల్ చేసి.. హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది.

ఒత్తిడి : ఎండకాలంలో వేడి వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఉష్ణోగ్రతల వల్ల స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో (ఉదయం 10-సాయంత్రం 4) ఇంట్లో ఉంటే మంచిది. ఫ్యాన్, ఏసీ వంటి కూలింగ్ పరికరాలు ఉపయోగించుకోవాలి. 

చెకప్స్ : రక్తపోటు ఎంత ఉందో రోజూ చెక్ చేస్తూ ఉండాలి. దానికి అనుగుణంగా మందులు, జీవనశైలి అలవాట్లు సర్దుబాటు చేసుకోవాలి.

డైట్​లో : వేడిని దూరం చేసి.. బీపిని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేసే ఫుడ్స్ తీసుకోవాలి. దోసకాయలు, సెలరీ, పెరుగు వంటి ఫుడ్స్ డైట్​లో తీసుకుంటే మంచిది. ఇవి వేడిని తగ్గించడంతో పాటు.. రక్తపోటును కంట్రోల్ చేస్తాయి. 

మధుమేహమున్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

హైడ్రేషన్ : ఎండవేడిని తట్టుకునే శక్తిని శరీరానికి అందించేలా నీటిని తాగుతూ ఉండాలి. ఇది డీహైడ్రేషన్​ని తగ్గిస్తూ.. షుగర్ లెవెల్స్​ని రెగ్యులేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. 

ఆ డ్రింక్స్ వద్దు : ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు హైడ్రేషన్ కోసం షుగర్ డ్రింక్స్ తీసుకుంటారు. జ్యూస్ సోడా, టీ వంటివి డీహైడ్రేషన్​ని పెంచి.. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగేలా చేస్తాయి. 

చెకప్స్ : బ్లడ్​లో షుగర్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయో రెగ్యులర్​గా చెక్ చేసుకోవాలి. దానికి అనుగుణంగా లైఫ్​స్టైల్, ఫుడ్స్ మార్చుకోవాలి. మందులు తప్పకుండా ఉపయోగించాలి. 

డైట్​ : ఫుడ్​ని ఒకేసారి కాకుండా.. తక్కువగా ఎక్కువసార్లు తినాలి. తీసుకునే కేలరీలను లెక్కించి.. దానిని డివైడ్ చేసుకోవాలి. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్​లో ఉంటాయి. 

ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

బయటకి వెళ్లొద్దు : ఉదయాన్నే 5 నుంచి 10వరకు బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఆ సమయంలో ఆస్తమా రోగులు అలెర్జీలకు ఎక్కువగా గురి అవుతారు. కాబట్టి ఉదయాన్నే బయటకి వెళ్లకపోవడమే మంచిది. 

ఏసీలు : అలెర్జీలు, కాలుష్య కారకాలను ఫిల్టర్​ చేయడంలో హెల్ప్ చేసే ఎయిర్ కండీషనర్​లు ఉపయోగిస్తే మంచిది. ఇంట్లో, కారులో ఇవి ఉండేలా చేసుకోండి. 

ఆ పనులు వద్దు : ఎక్కువ శ్రమతో కూడిన పనులు చేయకండి. వాటివల్ల ఉబ్బసం లక్షణాలు పెరుగుతాయి. కాబట్టి వేడి ఎక్కువగా ఉన్న సమయంలో శారీరక శ్రమను పరిమితం చేయాలి. 

ఇన్​హేలర్ : ఎక్కడికి వెళ్లినా.. ఇంట్లో ఉన్నా ఇన్​హేలర్ అందుబాటులో ఉండేలా చూసుకోండి. వైద్యులు సూచించిన సలహాలు ఫాలో అవ్వాలి. 

మరిన్ని జాగ్రత్తలు 

బయటకు వెళ్లినప్పుడు తేలికగా ఉండే, లూజ్ ఫిట్టింగ్ ఉండే దుస్తులు ధరించండి. టోపీలు, సన్​గ్లాసెస్​ ఉపయోగించడం వల్ల ఎండవేడిని తగ్గించుకోవచ్చు. SPF 30 సన్​స్క్రీన్​ని ఉపయోగించండి. నీటిని తరచూ తాగుతూ ఉండండి. మెడికల్ హెల్ప్ తీసుకోవడానికి అస్సలు వెనకాడకండి. 

Also Read  : క్యాన్సర్ వచ్చే ముందు శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే.. దద్దుర్లు నుంచి అలసట వరకు, అస్సలు ఇగ్నోర్ చేయకండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
Hair Oiling Tips : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
Bugs in Rice : బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget