Pre-Cancer Symptoms : క్యాన్సర్ వచ్చే ముందు శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే.. దద్దుర్లు నుంచి అలసట వరకు, అస్సలు ఇగ్నోర్ చేయకండి
Cancer Symptoms : క్యాన్సర్ ప్రాణాంతకం కాకూడదంటే శరీరం ముందుగా ఇచ్చే లక్షణాలను గుర్తించాలి అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటి? ఎలా గుర్తించాలంటే..

Cancer Life-Threatening Signs : ప్రాణాంతక వ్యాధులలో క్యాన్సర్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలలో ఇది కూడా ప్రధాన కారణంగా చెప్తారు. అందుకే దీనిని ముందుగానే గుర్తిస్తే ప్రాణాపాయ స్థితినుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలోనే శరీరం ఇచ్చే కొన్ని సంకేతాలు, వార్నింగ్ సైన్స్‌ని విస్మరించవద్దని చెప్తున్నారు. చిన్నవే కదా అని ఆ లక్షణాలను విస్మరిస్తే.. క్యాన్సర్ కణాలు పెరిగి ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఎక్కువ అవుతుందంటూ హెచ్చరిస్తున్నారు.
క్యాన్సర్ కణాలు చిన్నగా ప్రారంభమై శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాపించి.. ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తాయి. అలా చిన్నగా మొదలైనప్పుడే శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది. వాటిని కచ్చితంగా గుర్తించాలి. అప్పుడే చెకప్స్ చేయించుకుని.. కణితి ఎంత ఉంది. ఎంతవరకు వ్యాపించిందో తెలుసుకుని.. ఆ స్టేజ్‌లకు అనుగుణంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అయితే రోగనిర్ధారణ, చికిత్స కోసం ముందుగా క్యాన్సర్ లక్షణాలను ఎలా గుర్తించాలో.. శరీరం అందించే హెచ్చరిక సంకేతాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
చర్మంపై దద్దుర్లు
శరీరంపై దద్దుర్లు తరచూ వస్తోన్న.. లేదా వచ్చిన దద్దుర్లు అలాగే ఉండిపోయి మచ్చగా ఏర్పడినా దానిని క్యాన్సర్‌కి మొదటి సంకేతాలుగా చెప్తారు. కాబట్టి చర్మంపై ఎక్కడైనా కొత్తగా మచ్చ ఏర్పడినా, దురద లేదా మచ్చ వచ్చినా.. దాని ఆకారంలో మార్పులు, రంగులో మార్పులు గుర్తిస్తే కచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో దద్దుర్ల నుంచి రక్తస్రావం కావడం, పుండ్లుగా మారడం జరిగుతాయి. ఇవి క్యాన్సర్ కణాల వల్లే జరుగుతాయి కాబట్టి వెంటనే వైద్యసహాయం తీసుకోవాలి.
బరువు తగ్గడం
శరీరంలో క్యాన్సర్ కణాలు ఎక్కువైతే.. కాలక్రమేణా బరువు తగ్గుతారు. శరీరంలోని క్యాన్సర్ కణాలు.. ఆరోగ్యంగా ఉండే కణాల కంటే ఎక్కువ శక్తిని ఉపయోగిస్తాయి. దీనివల్ల శరీరం రెస్టింగ్ పొజీషన్లో ఉన్నా.. కేలరీలు బర్న్ అవుతూ ఉంటాయి. దీనివల్ల ఊహించని రీతిలో బరువు తగ్గిపోతూ ఉంటారు. ఇలా ఏ రీజన్ లేకుండా సడెన్‌గా బరువు తగ్గితే కచ్చితంగా వైద్యుల దగ్గరికి వెళ్లి చెకప్స్ చేయించుకోవాలి.
అలసట
క్యాన్సర్ హెచ్చరిక సంకేతాల్లో అలసట ఒకటి. ఏ పని చేయకపోయినా తీవ్రంగా అలసిపోతూ ఉంటారు. శరీరంలోని క్యాన్సర్ కణాలు శరీరానికి అవసరమైన పోషకాలను, కేలరీలను ఉపయోగించుకుని ఎనర్జీని డ్రైన్ చేస్తాయి. దీనివల్ల మీరు అలసటగా ఫీల్ అవుతారు. ఒంట్లో ఓపిక ఉండదు. రోజంతా నిద్రపోయినా.. విశ్రాంతి తీసుకున్నా అలసిపోయినట్లుగా ఉంటుంది. కాబట్టి అలసటను గుర్తించినా.. వైద్య సహాయం తీసుకోవాలి.
భరించలేని నొప్పి..
బోన్ క్యాన్సర్, కొన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్లు తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఎముకలో క్యాన్సర్ కణాలు మొదలైతే.. మొదటినుంచి ఇది బాధిస్తుంది. బ్రెయిన్ ట్యూమర్ తీవ్రమైన తలనొప్పిని కలిగిస్తుంది. ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నా నొప్పి నుంచి ఉపశమనం ఉండదు. రోజుల తరబడి నొప్పి ఉంటుంది. ఇదే కంటిన్యూ అయితే దానిని క్యాన్సర్‌కు సంకేతంగా గుర్తించి వైద్యుల సహాయం తీసుకోవాలి.
రక్తస్రావం
మూత్రవిసర్జన సమయంలో మలం ద్వారా రక్తస్రావం అవుతుంది. యూరిన్ ద్వారా కూడా ఈ సంకేతాన్ని గుర్తించవచ్చు. వేడి చేసినప్పుడు ఇలా జరగడం కామన్ కానీ.. ఇది రెగ్యులర్‌గా జరుగుతుందంటే దానిని క్యాన్సర్‌కి సంకేతంగా గుర్తించాలి. ఎందుకంటే మూత్రనాళంలో ఏర్పడిన క్యాన్సర్ కణితులు ఈ రక్తస్రావానికి దారి తీస్తాయి. కాబట్టి ఈ సంకేతాన్ని అస్సలు విస్మరించవద్దని సూచిస్తున్నారు.
ఈ లక్షణాలు మీరు గుర్తిస్తే కచ్చితంగా వైద్య సహాయం తీసుకోవాలి. ఒక్కోసారి ఈ సంకేతాలు క్యాన్సర్‌కి దారి తీయకపోయినా.. ఇతర ఆరోగ్య సమస్యలను ఇండికేట్ చేస్తాయి. కాబట్టి రెగ్యులర్‌గా చెకప్‌లు చేయించుకుంటే మంచిది. పైగా దీనివల్ల క్యాన్సర్ కణాల వ్యాప్తిని కంట్రోల్ చేసి.. చికిత్సల ద్వారా క్యాన్సర్ క్యూర్ అవుతుంది.
Also Read : బర్డ్ ఫ్లూ సమయంలో చికెన్, ఎగ్ తినకూడదా? ఒకవేళ తినాలనుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే






















