Tirupati Deputy Mayor Election MLC Kidnap | తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలో హై టెన్షన్ | ABP Desam
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక చుట్టూ కావాల్సినంత హై డ్రామా నడిచింది. వైసీపీ కార్పొరేటర్లను టీడీపీ కిడ్నాప్ చేసిందని...ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కూడా కనిపించట్లేదని ఆయన్ను కూడా కిడ్నాప్ చేశారంటూ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరెరెడ్డి తనయుడు భూమన అభినయ్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి రాత్రంతా ఆందోళన చేశారు. వైసీపీ కార్పొరేటర్లను ఎన్నికకు రాకుండా దూరం చేసేలా వాళ్ల ఇళ్లపై రాళ్ల దాడులు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కార్పొరేటర్లు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణం తమనెవరూ కిడ్నాప్ చేయలేదంటూ వీడియోలు విడుదల చేయటం గమనార్హం. అయితే ఉదయం పోలీసులు వైసీపీ కార్పొరేటర్లకు భద్రత కల్పిస్తూ ఎన్నిక జరుగుతున్న ఎస్వీ సెనేట్ హాల్ కు తీసుకువచ్చారు. 22 మంది వైసీపీ ఎమ్మెల్సీలు సెనేట్ హాల్ కు చేరుకున్న డిప్యూటీ మేయర్ ఎన్నికలో పాల్గొన్నారు.టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా 26 ఓట్లు పడటంతో...ఇన్నాళ్లూ ఏకైక టీడీపీ కార్పొరేటర్ గా ఉన్న ఆర్సీ మునికృష్ణ ఇప్పుడు తిరుపతి డిప్యూటీ మేయర్ గా విజయం సాధించినట్లైంది.





















