Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసిన రాజేంద్ర ప్రసాద్ - ఇరువురి ఆత్మీయ ఆలింగనం
Rajendra Prasad: నట కిరీటి రాజేంద్రప్రసాద్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ను కలిశారు. ఇరువురూ ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ పలు విషయాలపై చర్చించారు. అనంతరం ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

Rajendra Prasad Meets AP Deputy CM Pawan Kalyan: ప్రముఖ నటుడు, నట కిరీటి రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను (Pawan Kalyan) కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా పవన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చాయి. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం పవన్‌ను రాజేంద్రప్రసాద్ సన్మానించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ ఫోటోలు తాజాగా నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈరోజు ఉదయం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి @PawanKalyan తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ప్రముఖ నటుడు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు. pic.twitter.com/DVijEJTRaq
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) February 16, 2025
అప్పటి తరం టాప్ హీరోల నుంచి నేటి తరం యంగ్ హీరోల వరకూ అందరితోనూ కలిసి నటించి మెప్పించారు రాజేంద్రప్రసాద్. తన నటన, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల్లో ఓ చెరగని ముద్ర వేసి నటకిరీటిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లోనూ తన నటనతో ఆకట్టుకున్నారు. విభిన్న కథాంశంతో డిస్నీ హాట్ స్టార్ స్ట్రీమింగ్ అయిన 'హరికథ' వెబ్ సిరీస్ ఓటీటీ లవర్స్‌ను ఆకట్టుకుంది. మరోవైపు, రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీసాయి తేజస్విని నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'ఎర్రచీర - ది బిగినింగ్'. సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ పద్మాలయ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథలతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ శివరాత్రికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
Also Read: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

