Pradeep Ranganathan: 'నాకు స్టోరీ చెప్పిన కుర్రాడు బైక్‌లో రావడమా?' - కథ నచ్చే దర్శకుడికి కారు గిఫ్ట్ ఇచ్చిన 'లవ్ టుడే' హీరో
Return Of The Dragon Telugu Pre Release Event: 'లవ్ టుడే' ఫేం ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ మూవీ 'డ్రాగన్' ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది.

Pradeep Ranganathan Gifts Car To Director: 'లవ్ టుడే' సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ఆయన లేటెస్ట్ మూవీ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' (Return Of The Dragon) ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు అశ్వత్ మారిముత్తు యూత్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుండగా.. హైదరాబాద్‌లో తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. ఈ వేడుకలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన వై.రవిశంకర్ మాట్లాడుతూ.. ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికే 20 రోజులు షూటింగ్ చేశామని చెప్పారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
హీరో ప్రదీప్ రంగనాథన్.. దర్శకుడు చెప్పిన కథ నచ్చే ఆయనకు కారు గిఫ్ట్ ఇచ్చారని రవిశంకర్ తెలిపారు. సినిమా హిట్ అయితే కారు గిఫ్ట్స్ ఇవ్వడం మనం చూశామని.. కానీ కథ నచ్చే కారు గిఫ్ట్ ఇవ్వడం ఇదే ఫస్ట్ అని అన్నారు. తనకు కథ చెప్పిన కుర్రాడు రోజూ బైక్‌పై వస్తున్నాడని తెలిసి అతనికి కారు గిఫ్ట్ ఇచ్చినట్లు చెప్పారు. 'లవ్ టుడే' హిందీ రీమేక్ చేయాలని అనుకున్నామని.. కానీ కుదరలేదని.. ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్‌తో పని చేయడం గర్వంగా, సంతోషంగా ఉందని అన్నారు.
Also Read: బాలీవుడ్‌లో శ్రీలీల ఫస్ట్ మూవీ - రొమాన్స్ డోస్ పెంచేసిందిగా.. ఫస్ట్ లుక్ చూశారా!
'ఆ హీరోలని డైరెక్ట్ చేయాలని ఉంది'
I'm interested to work with #PawanKalyan sir & #AlluArjun
— IndiaGlitz Telugu™ (@igtelugu) February 16, 2025
I like the mass of #PawanKalyan
I like the swag of #AlluArjun#ReturnOfTheDragon @pradeeponelife #Dragon pic.twitter.com/xYqX4K4OZ3
తనకు ఛాన్స్ వస్తే పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను డైరెక్ట్ చేయాలని ఉందంటూ హీరో ప్రదీప్ రంగనాథన్ తన మనసులోని మాటను బయటపెట్టారు. తనకు పవన్ కల్యాణ్ మాస్ ఎలిమెంట్స్, బన్నీ స్వాగ్ అంటే ఇష్టమన్నారు.
ప్రదీప్ రంగనాథన్ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. అనుపమ పరమేశ్వరన్, కయదు లోహర్, జార్జ్ మరియన్, ఇందుమతి మణికందన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, స్నేహ, మిస్కిన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్ నిర్మించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన AGS ఎంటర్‌టైన్‌మెంట్ ఈ మూవీని నిర్మిస్తుండగా.. ఇంజినీరింగ్‌లో 48 బ్యాక్‌లాగ్‌లు పెట్టుకున్న హీరో.. కాలేజీలో పనీ పాటా లేనీ గాలికి తిరిగే ఓ కుర్రాడిగా కనిపించాడు. ప్రేమ, బ్రేకప్, లైఫ్‌లో సెటిల్ అవ్వడం కోసం కష్టపడే తీరు, ఫ్యామిలీ ఎమోషన్ ఇలా అన్నీ కూడా ట్రైలర్‌లో చూపించారు.
ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీలోకి రిలీజ్ కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం 'నెట్ ఫ్లిక్స్'లో (Netflix) స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ సినిమా తర్వాత విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాలో ప్రదీప్ నటిస్తున్నారు.
Also Read: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

