Yashasvi Jaiswal: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
42 సార్లు చాంపియన్ అయిన ముంబైలో అజింక్య రహానే, సూర్య కుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ లాంటి స్టార్ ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ లో ముంబై ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది.

ICC Champions Trophy: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కి సంబంధించి నాన్ ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాడు గాయపడ్డాడు. దీంతో అతను రంజీ ట్రోఫీ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. ఆ ఆటగాడు ఎవరో కాదు.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్. తాజాగా తను మణికట్టు గాయం పాలు కావడంతో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నట్లు సమాచారం. దీంతో రంజీ ట్రోఫీ సెమీస్ లో తను ఆడటం లేదు. విదర్భతో నాగపూర్ తో ముంబై ఈ మ్యాచ్ ఆడనుంది. తొలుత యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్ లో ఆడతాడని భావించినా, ఆ తర్వాత గాయంతో తప్పుకున్నాడు.
ఇక 42 సార్లు చాంపియన్ అయిన ముంబైలో స్టార్ ఆటగాళ్లకు కొదువే లేదు. అజింక్య రహానే, సూర్య కుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ లాంటి ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ లో ముంబై ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. ఇక బీసీసీఐ టెన్ పాయింట్ రూల్ ప్రకారం దేశవాళీల్లో జైస్వాల్ ఆడుతున్నాడు. ఇంతకముందు లీగ్ మ్యాచ్ లో ఆడిన యశస్వి.. తాజాగా నాకౌట్ లో కూడా ఆడాలని భావించినా, గాయం కారణంగా తప్పుకున్నాడు.
Yashasvi Jaiswal will miss the Ranji Trophy Semi-Final due to Left Ankle Pain. [Gaurav Gupta from TOI] pic.twitter.com/6QW3w0mRxH
— Johns. (@CricCrazyJohns) February 16, 2025
ఆ కాంబినేషన్ వైపే గంభీర్ మొగ్గు..
పలు విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వైపే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడుతుందని టీమ్ మేనేజ్మెంట్ డిసైడ్ అయింది. నిజానికి తొలి నాలుగు స్థానాల్లో వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ కుదురుకోవడంతో ఐదో స్థానంలో రెగ్యులర్ గా వచ్చే కేఎల్ రాహుల్ స్థానంపై సందిగ్ధం వచ్చింది. ఈ స్థానంలో అక్షర్ పటేల్ ను పంపించడంపై గంభీర్ పట్టుదలగా ఉన్నాడు. లెఫ్ట్, రైట్ కాంబినేషన్ తో ప్రత్యర్థి జట్టు ఇబ్బంది పడుతుందని అతని ఆలోచన. ఈ నేపథ్యంలో మెగాటోర్నీలో ఐదో స్థానంలో అక్షర్ బరిలోకి దిగడం ఖాయంగా మారింది. దీంతో ఆరో నెంబర్లో రాహుల్ ఆడతాడని తెలుస్తోంది.
రాహుల్ కే ఓటు..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని ప్రకటించినప్పుడు ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా అందరూ రిషభ్ పంత్ నే భావించారు. అయితే గంభీర్ దృష్టిలో మాత్రం కేఎల్ రాహులే వికెట్ కీపర్ గా ఉండాలని ఉంది. అందుకే ఇంగ్లాండ్ తో మూడు వన్డేల్లోనూ రాహుల్ ను ఆడించి, పంత్ ను పక్కన పెట్టారు. దీంతో తన ఫోకస్ ఎంటో స్పష్టంగా గంభీర్ బయటకి చెప్పాడు. అయితే ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తుండటంతో రాహుల్ కుదురుకోవడం లేదు. ఇంగ్లాండ్ తో తొలి రెండు వన్డేల్లో ఆరో స్థానంలో బ్యాటింగ్ లో విఫలమైన రాహుల్.. మూడో వన్డేలో నెం.5 లో బ్యాటింగ్ చేసి సత్తా చాటాడు. దీంతో మాజీలతో సహా అంతా రాహుల్ ను నెం.5లోనే ఆడించాలని సూచించారు. అయితే ఈ విషయంలో మెట్టు దిగేందుకు గంభీర్ సిద్ధంగా లేదు. మెగాటోర్నీలో నిరాశ జనక ప్రదర్శన ఎదురైతే మాత్రం గంభీర్ కు ఈ విషయంలో అక్షింతలు ఎదురు కాక తప్పక పోవచ్చు.
Read Also: WPL Runout Controversy: రనౌట్ ఇవ్వకపోవడంపై నెటిజన్ల ఫైర్.. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

