Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
BJP : బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలకు పదేళ్ల తర్వాత వ్యతిరేకత వచ్చిందని..ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాకముందే వ్యతిరేకత ఏర్పడిందన్నారు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి.

Congress : బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలకు పదేళ్ల తర్వాత వ్యతిరేకత వచ్చిందని.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాకముందే వ్యతిరేకత ఏర్పడిందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి. మోదీ ప్రభుత్వ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక తెలంగాణలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను మీడియా ప్రతినిధులముందు వివరించారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కోసం రూ. 10 లక్షల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఇందులో భాగంగా రామగుండంలో రూ. 7వేల కోట్లతో యూరియా యూనిట్, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, జాతీయ రహదారుల అభివృద్ధి కోసం రూ. 1.20 లక్షల కోట్లు, రూ. 80 వేల కోట్లతో మరిన్ని నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. అలాగే, వరంగల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి, రామప్ప దేవాలయానికి రూ. 150 కోట్ల కేటాయింపు, యూనిస్కో గుర్తింపు, 40 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ, కొమురవెళ్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి, సమ్మక్క సారాలమ్మ దేవాలయ అభివృద్ధికి రూ. 1000 కోట్లు కేటాయించారని చెప్పారు. ప్రధానమంత్రితో ఆమోదం పొందిన ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణం కోసం రూ. 1350 కోట్లు, హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్ట వరకు ఎంఎంటీఎస్ ప్రాజెక్టు ప్రారంభం, ఎన్టీపీసీ 850 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, ఫ్లోటింగ్ యూనిట్, ఎరువులపై రూ. 60 వేల కోట్లు సబ్సిడీ వంటి అనేక కీలక ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని ఆయన తెలిపారు.
చంకలు గుద్దుకున్నారు
ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హనుమకొండలో విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు . ప్రాగా టూల్స్, ఐడీపీఎల్, హెచ్ ఎంటీ, ఆల్వీన్ లాంటి అనేక సంస్థలు మూతపడ్డాయన్నారు. బయ్యారంపై కేంద్రం ప్రకటన చేయలేదన్నారు. తామే ఏర్పాటు చేస్తామని 2018లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ లు చంకలు గుద్దుకున్నారని చెప్పారు. వాస్తవంగా ఆ సంస్థ రావాలనే తనకూ ఉందని, కానీ స్టీల్ లభ్యత ఉండదని తెలిసిన తరువాత ప్రజల డబ్బును నష్టం చేయలేమన్నారు.
Also Read : Sirpur Politics: తగ్గేదేలే- సిర్పూర్ లో ఆసక్తికరంగా మారుతున్న కోనప్ప రాజకీయం..!
బీజేపీకి సానుకూల ఫలితాలు
తెలంగాణ రాష్ర్టంలో ఈ నెల 27న జరిగే మూడు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీజేపీ పోటీ చేస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. ఈ మూడు స్థానాల్లోనూ బీజేపీ గెలుస్తుందన్నారు. బీఆర్ ఎస్ పట్ల వ్యతిరేకతతో గతంలో ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు. రేవంత్ రెడ్డి, రాహుల్ తమతమ ప్రసంగాలతో ఓటర్లను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారన్నారు. కానీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక గ్యారెంటీలు, హామీలు అమలు చేయడంలో విఫలం కావడంతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు. రైతులు, కూలీలు, మహిళలు, విద్యార్థులు, యువకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ అసంతృప్తి బాహాటంగానే వెళ్లగక్కుతున్నారని తెలిపారు.
సమస్యలు లేవనెత్తుతాం
శాసనమండలి ప్రాధాన్యతను తగ్గించేలా బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ప్రయత్నిస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. సభ్యులందరినీ మూకుమ్మడిగా బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉద్దేశ్యాలను దెబ్బతీశారు. ఈ కౌన్సిల్ ఉద్దేశ్యం ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలను లేవత్తుతామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను శాసనమండలి ద్వారా నెరవేర్చాలని మూడు స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందన్నారు. ప్రతీవారం ఢిల్లీకి వెళ్లడమే సీఎం రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. అక్కడి రాహుల్ మాటలను ఇక్కడకు మోసుకువచ్చి మోదీ, బీజేపీలపై విమర్శలు చేయడం తప్ప ఆయన చేపట్టే పర్యటనల్లో మర్మం ఏమీ లేదన్నారు.
Also Read : Left Parties Protest: కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఈనెల 18,19 తేదీల్లో దేశవ్యాప్తంగా వామపక్షాల నిరసన
రాష్ట్రంలో దయనీయ పరిస్థితి
రాష్ర్టంలో దయనీయ పరిస్థితిలో ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఏ ఒక్క బీసీ సంఘమైన కాంగ్రెస్ చేసిన సర్వేకు ఆమోదం తెలిపారా?అని ప్రశ్నించారు. బీజేపీ కులగణనను సమర్థిస్తుందన్నారు. బీజేపీ ఎప్పుడైనా బీఆర్ఎస్ తో కలిసిందా? అని అడిగారు. తాము కుంభకోణాలు, అవినీతిని ఎప్పటికీ సహించబోమన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

