Errum Manzil Palace | నిర్లక్ష్యానికి బలైపోతున్న చారిత్రక కట్టడం | ABP Desam
చూసారుగా ఇదీ ప్రస్తుతం ఎర్రమంజిల్ ప్యాలెస్ దుస్దితి. కుతుబ్షాహీ రాజుల కాలంలో ముల్క్ నిర్మించిన ఈ అందమైన ,అతి పెద్ద ప్యాలెస్, ఇప్పుడు పూర్తిగా శిధిలావస్తకు చేరుకుంది. పంజాగుట్ట నుండి ఖైరతాబాద్ వైపు వెళ్లే మార్గంలో ఉన్న ఈ ప్యాలెస్ ను ఒప్పుడు ఏపూరం మంజిల్ అని పిలిచేవారు, ఆ తరువాత కాలంలో అది ఎర్రమంజిల్ గా మారింది. 1870 లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ప్యాలెస్ ను అప్పట్లో యూరోపియన్ స్టైల్ దేశంలోనే అత్యంత అద్బుత కట్టడాల్లో ఒకటిగా నిలిచింది.విందులు ,వినోదాలు,మహారాజుల అంతర్గత సమావేశాలకు దీనిని వినియోగించేవారు. 150 గదులు, డ్రాయింగ్ రూమ్ , గోల్ఫ్ కోర్స్ ,గుర్రపు శాల ఈ ఎర్రమంజిల్ ప్యాలెస్ ప్రత్యేకతగా చెప్పవచ్చు.రోజ్ ఉడ్ టేక్ తో నిర్మాణం, ప్యాలెస్కు కొంత దూరంలో నవాబుల వస్త్రాలు ఉతికేందుకు అతిపెద్ద దోబీఖానా, ప్యాలెస్ లోపల అతి పెద్ద వంటశాల, గోవా నుండి ప్రత్యేకంగా రప్పించిన వంటగాళ్లు, ప్యాలెస్ లోపల కేవలం లైటింగ్ కోసం చిమ్మెలు ,లాంతర్లు వీటిని చూసేందుకే 30 మంది పనివాళ్లు ఉండేవారు. ఇలా నవాబుల కాలంలో ఓ వెలుగువెలిగిన ఎర్రమంజిల్ ప్యాలెస్ ఇప్పుడు శిధిలావస్దలో ఒక్కమాటలో చెప్పాలంటే డంపింగ్ యార్డ్ గా మార్చేశారు.





















