అన్వేషించండి

Lower Blood Sugar Naturally : డయాబెటిస్​ను కంట్రోల్ చేసే సహజమైన టిప్స్.. బ్లడ్​లోని షుగర్ లెవెల్స్​ను తగ్గించేయండిలా

Blood Sugar : మధుమేహంతో ఇబ్బంది పడేవారు సహజంగా రక్తంలో షుగర్ లెవెల్స్​ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్​ ఫాలో అయితే మంచి బెనిఫిట్స్ ఉంటాయి.

Natural Ways to Lower Blood Sugar : రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైతే.. హైపర్​ గ్లైసీమియాగా మారి మధుమేహం సమస్య వస్తుంది. ఈ సమస్యను నెగ్లెక్ట్ చేస్తే ప్రాణాంతకమవుతుంది. అందుకే బ్లడ్​లో షుగర్​ లెవెల్స్​ని కంట్రోల్ చేస్తూ ఉండాలి. లేదంటే గుండె, మూత్రపిండాల సమస్యలను పెంచి.. ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. అందుకే వైద్యులు ఇచ్చిన మందులు వాడుతూ.. లైఫ్​స్టైల్​లో కొన్ని మార్పులు చేయాలంటున్నారు. దీనివల్ల బ్లడ్​లో షుగర్​ లెవెల్స్ సహజంగా కంట్రోల్ అవుతాయంటున్నారు. మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో ఇప్పుడు చూసేద్దాం. 

హైడ్రేషన్ 

నీరు తాగడం వల్ల శరీరం నుంచి టాక్సిన్లు బయటకు పోతాయి. అంతేకాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలు కూడా కంట్రోల్ అవుతాయి. కాబట్టి రోజుకు రెండు లేదా మూడు లీటర్ల నీటిని తాగాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో రోజును ప్రారంభిస్తే జీవక్రియ కూడా మెరుగవుతుంది. 

ఫైబర్ 

ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోండి. ఇది బ్లడ్ షుగర్​ని కంట్రోల్​ చేస్తుంది. కార్బోహైడ్రేట్స్ మాదిరిగా ఇది ఇన్సులిన్​ని స్పైక్ చేయదు. పైగా కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. కాబట్టి మిల్లిట్స్, ఫ్రూట్స్, కూరగాయలు, బీన్స్, బఠానీలు, చిక్కుళ్లు వంటివి డైట్​లో చేర్చుకోండి. 

కార్బ్స్ తినకండి.. 

కార్బోహైడ్రేట్లను తింటే శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. శరీరానికి శక్తిని ఇవ్వడానికి కార్బ్స్ హెల్ప్ చేస్తాయి. కానీ దానిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే.. అవి శరీరంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. కాబట్టి ఫైబర్, విటమిన్స్, మినరల్స్​తో కూడిన కార్బ్స్​ని లిమిటెడ్​గా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. వైట్ రైస్​ని వీలైనంత వరకు తగ్గిస్తే మంచిది. 

సమతుల్య ఆహారం.. 

బ్లడ్​లోని షుగర్​ లెవెల్స్​ని కంట్రోల్ చేయడానికి బ్యాలెన్స్డ్​ డైట్ మంచి ఫలితాలు ఇస్తుంది. సరైన పోషకాలు అందిస్తూ.. పోర్షన్ కంట్రోల్ చేస్తే.. మధుమేహం కంట్రోల్ అవుతుందని చెప్తున్నారు. కూరగాయలు, ప్రోటీన్​తో, హెల్తీ కార్బ్స్​తో నిండిన ఫుడ్ డయాబెటిస్​కే కాదు పూర్తి ఆరోగ్యానికి మంచిది. 

నిద్ర 

రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయాలనుకుంటే మంచి నిద్ర అవసరం. ఇది రక్తంలో చక్కెరను కంట్రోల్ చేసి.. ఇన్సులిన్​ సెన్సిటివిటీని పెంచుతుందని ఓ అధ్యయనం తేల్చింది. స్లీప్ ఆప్నియా, నిద్రలేమి వంటి సమస్యల వల్ల గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి రాత్రి నిద్ర మెరుగ్గా ఉండేలా చూసుకోండి. ఉదయాన్నే త్వరగా లేవడం వల్ల, బాడీ యాక్టివ్​గా ఉండడం వల్ల కూడా రాత్రి నిద్ర త్వరగా వచ్చే అవకాశముంది. 

వ్యాయామం.. 

మీరు హెల్తీ లైఫ్​స్టైల్​ని లీడ్ చేయాలనుకుంటే.. ఉదయాన్నే నిద్రలేవాలి. మీ రోజును ఎంత ఎర్లీగా, యాక్టివ్​గా స్టార్ట్ చేస్తే అంత మంచిది. రోజూ వ్యాయామం చేస్తే షుగర్ కంట్రోల్ అవుతుందట. కనీసం అరగంట ఏరోబిక్ చేస్తే.. బాడీ యాక్టివ్ అవుతుంది. కండరాలు యాక్టివ్​గా ఉన్నప్పుడు రక్తంలో చక్కెర పేరుకుపోకుండా చేస్తుంది. 

రిలాక్స్ అవ్వండి.. 

ఒత్తిడిని పెంచే కారణాలు చాలానే ఉండొచ్చు. కానీ ఈ స్ట్రెస్​ వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కార్టిసాల్, అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లను విడుదల చేసి.. ఇన్సులిన్ పనిచేయడాన్ని కష్టతరం చేస్తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, మెడిటేషన్ చేస్తే మధుమేహం తగ్గుతుంది. పాజిటివిటీ పెరుగుతుంది. 

నో స్మోకింగ్

పొగాకు వాడకం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇన్సులిన్​ సామర్థ్యం తగ్గుతుంది. ఇది మధుమేహాన్ని కంట్రోల్ చేయడాన్ని కష్టతరం చేస్తుంది. క్యాన్సర్, గుండె జబ్బులు, మూత్రపిండ వ్యాధి ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి సిగరెట్​ని పూర్తిగా మానేస్తే పూర్తి ఆరోగ్యానికి మంచిది. 

బరువు తగ్గడం.. 

శరీరంలో కొవ్వు అధికంగా ఉండి.. బరువు పెరగడం వల్ల టైప్​ 2 మధుమేహం ప్రమాదం ఎక్కువ అవుతుంది. బరువు తగ్గడం ద్వారా దానిని మీరు కంట్రోల్ చేయవచ్చు. కాబట్టి బరువు తగ్గేందుకు వ్యాయామాన్ని ఫాలో అవుతూ డైట్ చేయండి. 

మరిన్ని జాగ్రత్తలు

షుగర్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్​లు, షుగర్​తో నిండిన ఇతర పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. రెగ్యులర్​గా బ్లడ్​లోని షుగర్ లెవెల్స్​ని ట్రాక్ చేస్తూ ఉండాలి. షుగర్​ని కంట్రోల్ చేసే ఫుడ్స్​ తీసుకోవాలి. విటమిన్ డి కూడా చాలా ముఖ్యమని గుర్తించుకోండి. వైద్యుల సూచనలమేరకు విటమిన్ డి శరీరానికి అందేలా చూడాలి. ఆల్కహాల్​ కూడా మధుమేహాన్ని పెంచుతుంది కాబట్టి దానిని కూడా వీలైనంత తగ్గించాలి. ఇవన్నీ రెగ్యులర్​గా ఫాలో అయితే బ్లడ్​లో షుగర్ లెవెల్స్ సహజంగానే కంట్రోల్ అయిపోతాయి. 

Also Read : వేసవికాలంలో బీపీ, షుగర్, ఆస్తమా పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Trimukha Movie Release Date: సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Tata Sierra Dealership: టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
Embed widget