Muhsin Hedricks : ప్రపంచంలో మొట్టమొదటి గే ఇమామ్ దారుణ హత్య
Gay Imam Murder: ప్రపంచంలోనే మొట్టమొదటి బహిరంగ గే ఇమామ్ అని చెప్పుకునే ముహ్సిన్ హెండ్రిక్స్ దక్షిణాఫ్రికాలో కాల్చి చంపబడ్డాడు. శనివారం గకేబర్హా నగరానికి సమీపంలో ఈ దాడి జరిగింది.

Gay Imam Murder News: ప్రపంచంలోనే మొట్టమొదటి బహిరంగ గే ఇమామ్ అని చెప్పుకునే ముహ్సిన్ హెండ్రిక్స్ దక్షిణాఫ్రికాలో కాల్చి చంపబడ్డాడు. శనివారం గకేబర్హా నగరానికి సమీపంలో ఈ దాడి జరిగింది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతని కారును ఆపి ఆపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హెండ్రిక్స్ మరొక వ్యక్తితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ముసుగు ధరించిన ఇద్దరు దుండగులు అతడి వాహనాన్ని ఫాలో అయ్యి అడ్డగించారు. తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా దుండగులు కారుపై కాల్పులు జరిపినట్లు స్థానికులు తెలిపారు. కాల్పులు జరిపిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడిలో ముహ్సిన్ హెండ్రిక్స్ అక్కడికక్కడే మరణించగా, అతనితో పాటు ఉన్న డ్రైవర్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు.
చుట్టు ముట్టి కాల్పులు జరిపి..
ఈ సంఘటన పై పోలీసులు మాట్లాడుతూ.. 'దాడి చేసిన వ్యక్తులు అతని కారు ముందు తమ వాహనాన్ని ఆపి అడ్డుకున్నారు. దీని తరువాత, ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు కారు నుండి బయటకు వచ్చి ఇమామ్ వాహనంపై విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. దీని తరువాత దాడి చేసినవారు పారిపోయారు. ఈ దాడిలో ముహ్సిన్ మాత్రమే మరణించాడు. తనపై కాల్పులు జరిగాయని మొదట గమనించిన డ్రైవర్ ఎలాగోలా తప్పించుకున్నాడు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నాం’’ అని పోలీసులు తెలిపారు.
Also Read : Mastan Sai Case : గవర్నర్ వద్దకు చేరిన మస్తాన్ సాయి కేసు.. వాళ్లను తొలగించాలని లేఖ
ఘటనపై సమగ్ర దర్యాప్తు
ఈ హత్యపై ఇంటర్నేషనల్ లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ అండ్ ఇంటర్‌సెక్స్ అసోసియేషన్ (ILGA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముహ్సిన్ హెండ్రిక్స్ హత్యతో మొత్తం ILGA సమాజం దిగ్భ్రాంతికి గురైందని సంస్థ ఎగ్జిక్యూటివ్ జూలియా ఎహార్ట్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది కావాలని చేసిన నేరం కావచ్చని తాము భయపడుతున్నట్లు ప్రకటించారు. కాబట్టి అధికారులు ఈ విషయంపై సమగ్రమైన దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ముహ్సిన్ హెండ్రిక్స్ 1996లో తాను స్వలింగ సంపర్కుడిని అని బహిరంగంగా అంగీకరించారు.
బెదిరిపులు వస్తున్నాయని ముందే చెప్పారు
దీని తరువాత అతను LGBTQ కమ్యూనిటీ హక్కుల కోసం పోరాడాడు.. అనేక సంస్థలలో కీలక పాత్ర పోషించారు. అతను కేప్ టౌన్‌లోని తన జన్మస్థలానికి సమీపంలో ఉన్న వైన్‌బర్గ్‌లోని అల్-ఘురాబా మసీదును నడిపాడు. ఆ మసీదును క్వీర్ ముస్లింలు, అణగారిన మహిళలకు సురక్షితమైన మతపరమైన స్థలంగా పరిగణించారు. 2022 డాక్యుమెంటరీ "ది రాడికల్"లో హెండ్రిక్స్ తనకు నిరంతరం బెదిరింపులు వస్తున్నాయని వెల్లడించారు. హత్య వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చాలామంది దీనిని LGBTQ వ్యతిరేక దాడిగా చూస్తున్నారు. మరికొందరు దీనిని వ్యక్తిగత శత్రుత్వం కారణంగా ఈ దాడి జరిగిందంటున్నారు.
Also Read : IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

