అన్వేషించండి
Brahmamudi January 15th Episode: కావ్యకు గిఫ్ట్ ఇచ్చిన ఈగో రాజ్.. మరో మంట పెట్టిసిన రుద్రాణి - బ్రహ్మముడి జనవరి 15 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Serial January 15th Episode: కావ్య పేరుమీద ఆస్తి మొత్తం రాసేసిన సీతారామయ్య... ష్యూరిటీ సంతకం పెట్టి కొత్త కష్టాలు తీసుకొచ్చాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Brahmamudi January 15th Episode (Disney Plus Hotstar/ Star Maa)
1/9

దుగ్గిరాల ఫ్యామిలీ అందరూ కలసి కనకం ఇంటి ముందు దిగుతారు. కారు దిగుతూనే ఏర్పాట్లు చూసి సెటైర్స్ స్టార్ట్ చేస్తుంది రుద్రాణి. కాసేపు వాదనలు జరుగుతాయ్
2/9

ఇంట్లో నక్లెస్ మరిచిపోయాను అని స్వప్న అంటే..నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావ్ అంటారంతా. నా కోడలు మహాలక్ష్మిలానే ఉంది కానీ నువ్వు దారిద్ర్యానికి కేరాఫ్ లా ఉన్నావంటూ రుద్రాణి, ధాన్యలక్ష్మి నోరుపారేసుకుంటారు. ఇంతకీ నీ నగలేవి అంటుంది అపర్ణ. ఇంట్లో మర్చిపోయాను అంటుంది కావ్య.
3/9

రిచ్ నెస్ ఆలోచనల్లో , ప్రవర్తనలో ఉండాలి అలంకారంలో ఉంటుందా అంటాడు రాజ్. సరే నీ వల్లకాదంటే నేను నాన్నని పంపించి నగలు తెప్పిస్తానంటుంది అపర్ణ. ఏదో జరుగుతోంది అనుకుంటారు రుద్రాణి-రాహుల్..
4/9

సీమంతంలో లోపాలు ఎవరి కంటా పడకూడదంటూ క్లాస్ వేస్తుంది కనకం..అందరకీ స్వాగతం పలుకుతుంది. స్వప్నా మెరిసిపోతున్నావ్ నువ్వు దుగ్గిరాల ఇంటికోడలు అనిపించుకున్నావ్ అంటుంది. నువ్వే వియ్యంకురాలివి అనిపించుకోలేకపోతున్నావ్ అంటుంది రుద్రాణి. ఇద్దరూ సెటైర్స్ వేసుకుంటారు.
5/9

ఏర్పాట్లు బాలేవంటూ రుద్రాణి, ధాన్యలక్ష్మి తక్కువ చేసి మాట్లాడుతారు. పరిస్థితులను అర్థం చేసుకో అంటుంది అపర్ణ. అయినా ఆకాశమంత పందిరి ముఖ్యం కాదు మా అక్కను దీవించే విశాల హృదయం ముఖ్యం అంటుంది కావ్య. దారిద్ర్యాన్ని కడుపులో ఉన్నప్పుడే అనుభవించే కర్మ పట్టిందేమో అంటుంది రుద్రాణి.
6/9

ఇక్కడ సీమంతం చేస్తాం అన్నప్పుడే నా ఆశలు చచ్చిపోయాయ్ అని కన్నీళ్లు పెట్టుకుంటుంది స్వప్న. అక్కడకు వచ్చే బంధువులు డబ్బును చూసి వస్తారు..ఇక్కడకు వచ్చేవారు మనస్ఫూర్తిగా దీవించేందుకు వస్తారంటూ స్నప్నకి సర్దిచెబుతుంది కావ్య. స్వప్న నార్మల్ అయిపోతుంది
7/9

ఫుడ్ బాలేదంటూ , వెరైటీలు లేవంటూ మరో రచ్చ ప్రారంభిస్తుంది రుద్రాణి. ఫ్రూట్స్ తిందాం అని వెళితే అక్కడ పెట్టిన ప్లాస్టిక్ పండు కొరికి ఛీఛీ అనేసి వెళ్లిపోతుంది
8/9

కావ్యను రూమ్ లోకి పిలిచిన రాజ్ తో..సమయం సందర్భం లేదా అంటుంది. నా పెళ్లాన్ని నేను పిలవడానికి సమయంతో ఏం అవసరం అంటూ హగ్ చేసుకుంటాడు. ఏదో గిఫ్ట్ ఇస్తాడు..
9/9

బ్రహ్మముడి జనవరి 16 ఎపిసోడ్ లో...ఆ రోజు తాతయ్యకి కట్టాల్సిన హాస్పిటల్ బిల్లును కావ్య నగలు తాకట్టుపెట్టి కట్టారని చెబుతాడు రాహుల్. ఆ తర్వాత ఫంక్షన్ జరుగుతుంటే కావ్య నగలు జాగ్రత్తగానే ఉన్నాయా అని పుల్ల పెడుతుంది రుద్రాణి...
Published at : 15 Jan 2025 10:03 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
అమరావతి
సినిమా
లైఫ్‌స్టైల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion