అన్వేషించండి
Brahmamudi Serial Today February 25th Episode Highlights: రాజ్ వేలిముద్రలు మ్యాచ్ అయ్యాయ్..అనామిక రాక్షసానందం - బ్రహ్మముడి ఫిబ్రవరి 24 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Serial February 24th Episode: సామంత్ హత్య కేసులో రాజ్ అరెస్టవడంతో కీలక మలుపు తిరిగింది బ్రహ్మముడి .అనామిక కుట్ర నుంచి రాజ్ ను... కావ్య-అప్పు కాపాడగలరా...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

Brahmamudi Serial Today February 25th
1/10

సామంత్ హత్యకేసు విచారణ జరుగుతుంటుంది. కావ్యను బోన్ లోకి పిలుస్తాడు అనామిక తరపు లాయర్. ఆ రోజు ఏం జరిగిందని అడిగితే నందతో కలసి సామంత్ మా కంపెనీని మోసం చేశాడు అందుకే వెళ్లి వార్నించ్ ఇచ్చారు..చంపేస్తానని బెదిరించారు అంటుంది
2/10

అప్పుని పిలిచిన రాజ్ తరపు లాయర్.. మీరు హత్య చేయడం చూశారా?, డిక్కీలో శవం పెట్టడం చూశారా? ప్రాధమిక ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అని అడిగితే అనామిక కంప్లైంట్ మేరకు సెర్చ్ వారెంట్ తో వెళ్లి రాజ్ ని అరెస్ట్ చేశామంటుంది
3/10

మరిన్ని సాక్ష్యాలు చూపించేందుకు సమయం కావాలని అనామిక లాయర్ అడుగుతాడు.. ఇంకా టైమ్ ఇస్తే కొత్త సాక్ష్యాధారాలు సృష్టిస్తారని రాజ్ లాయర్ అంటాడు. మీరు అవి తప్పు అని ప్రూవ్ చేయండని జడ్జి చెబుతాడు.రాజ్ కి బెయిల్ రద్దు చేస్తారు.
4/10

రాజ్ ని చూసి అపర్ణ బాధపడుతుంది. నాకేం జరగలేదు కదా అని రాజ్ అంటాడు. ఏ తప్పూ చేయనప్పుడు ఎంత ధైర్యంగా నిలబడాలో తాతయ్య నేర్పించారు అది మర్చిపోను..నిజాయితీగా పోరాడుతాను నిర్దోషిగా బయటకు వస్తాను అంటాడు రాజ్
5/10

నేరస్థుడికి గుండెనిండా ధైర్యం నింపుతున్నారా అంటూ అనామిక ఎంట్రీ ఇచ్చి ఏదేదో వాగుతుంది. నువ్వు ఎంత నాటకం ఆడినా నిజమే గెలుస్తుంది అంటాడు రాజ్. దుగ్గిరాల కుటుంబంలో అందరూ జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు ఇది ఫిక్స్ అంటుంది అనామిక
6/10

నువ్వు చెప్పిన సాక్ష్యం వల్ల వాడి జీవితమే ప్రశ్నార్థకంగా మారిందని అపర్ణ కావ్యపై ఫైర్ అవుతుంది. నా కొడుకు విషయంలో తప్పు చేశావ్ అంటుంది.
7/10

వీళ్ల కుటుంబమే తేడా వదినా అంటూ రుద్రాణి ఎంట్రీ ఇస్తుంది. ఆస్తి మొత్తం దీనిపేరుమీద ఉందికదా అందుకే మొగుడుని ఇరికించి ఆస్తిని అనుభవించాలని ప్లాన్ చేసింది అంటుంది. మీ ముగ్గురు మా కుటుంబం పతనకోసమే పుట్టారా అని ధాన్యం ఫైర్ అవుతుంది.
8/10

రాజ్ నిర్దోషి అని నమ్మింది కాబట్టే కోర్టులో నిజం చెప్పిందంటూ ఇందిరాదేవి సపోర్ట్ చేస్తుంది. రాజ్ బిడ్డను తీసుకొచ్చి తనే బిడ్డ అంటే అందరం అవమానించినా కావ్య అసలు నిజం బయటపెట్టింది. అలాంటి మనిషి వాడి చెడు కోరుకుంటుందా అని ఇందిరాదేవి క్వశ్చన్ చేస్తుంది.
9/10

అక్క ఇప్పుడు నిజం చెప్పకపోతే తర్వాత నిజాలు బయటపడిన తర్వాత మనం ఇరుక్కుపోతాం అంటుంది అప్పు. ఇంటి పరువు కోసం ఆస్తి కాపాడింది..ఇంటి వారసుడికోసం కూడా ఒంటరి పోరాటం చేస్తుంది. దానికి మనం ఇస్తున్నదేంటి నిందలు అంటుంది ఇందిరాదేవి. అపర్ణ హగ్ చేసుకుంటుంది.
10/10

బ్రహ్మముడి ఫిబ్రవరి 25 ఎపిసోడ్ లో రాజ్‌కు క్యారియర్ తీసుకెళ్లి భోజనం పెడుతుంది కావ్య. హత్య జరిగిన సమయంలో వినియోగించిన రాడ్ పై రాజ్ వేలిముద్రలు ఉన్నట్టు తేలుతుంది.
Published at : 25 Feb 2025 08:42 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
క్రైమ్
తెలంగాణ
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion