అన్వేషించండి
Advertisement

Vishnu Vishal's AARYAN Launch : శ్రద్ధా శ్రీనాథ్, వాణీ భోజన్ నడుమ విష్ణు విశాల్ - క్రైమ్ థ్రిల్లర్ షురూ
విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'ఆర్యన్'. సెల్వ రాఘవన్ కీలక పాత్రధారి. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, వాణీ భోజన్ హీరోయిన్లు. ఈ రోజు పూజతో సినిమా ప్రారంభమైంది. ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

'ఆర్యన్' ప్రారంభోత్సవంలో వాణీ భోజన్, విష్ణు విశాల్, శ్రద్ధా శ్రీనాథ్
1/5

'ఆర్యన్'ను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో విశాల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారని ఈ రోజు విడుదల చేసిన ఫస్ట్ లుక్ ద్వారా వెల్లడించారు. ఈ చిత్రానికి ప్రవీణ్ కె దర్శకత్వం వహిస్తున్నారు. ఫాస్ట్ ఫేస్డ్ స్క్రీన్ ప్లే, ఊహకు అందని మలుపులతో సన్నివేశాలు చాలా వేగంగా ముందుకు వెళతాయని చిత్ర బృందం పేర్కొంది.
2/5

'ఆర్యన్' సినిమాలో యువ తెలుగు హీరో సాయి రోనక్, తారక్ పొన్నప్ప, అభిషేక్ జోసెఫ్ జార్జ్, మల పార్వతి ఇతర తారాగణం. ఈ సినిమాను శుభ్రా, ఆర్యన్ సమర్పణలో విష్ణు విశాల్ నిర్మిస్తున్నారు.
3/5

'జెర్సీ'తో పాటు 'కృష్ణ అండ్ హిజ్ లీల'తో తెలుగులో శ్రద్ధా శ్రీనాథ్ విజయాలు అందుకున్నారు. (Image courtesy - @Shraddha Srinath/Instagram)
4/5

'మీకు మాత్రమే చెప్తా' సినిమాలో వాణీ భోజన్ నటించారు. పలు తమిళ చిత్రాల్లో నటించిన ఈవిడ, తెలుగులో నవీన్ చంద్రతో ఒక సినిమా చేస్తున్నారు.
5/5

విష్ణు విశాల్ తెలుగమ్మాయి, బాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన లాస్ట్ సినిమా 'ఎఫ్.ఐ.ఆర్' తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
Published at : 03 Sep 2022 12:59 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తిరుపతి
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion