అన్వేషించండి
Brahmamudi January 8th Episode: కొంపలు మునిగిపోయినా నోరు మెదపని రోగం .. కుటుంబంలో గొడవలకు ఆజ్యం పోస్తున్న కావ్య - బ్రహ్మముడి జనవరి 8 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Serial January 8th Episode: కావ్య పేరుమీద ఆస్తి మొత్తం రాసేసిన సీతారామయ్య... ష్యూరిటీ సంతకం పెట్టి కొత్త కష్టాలు తీసుకొచ్చాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Brahmamudi January 8th Episode (Disney Plus Hotstar/ Star Maa)
1/12

బంగారు కిరీటం మార్చేసి దుగ్గిరాల కంపెనీని దెబ్బకొడదాం అనుకున్న అనామికకు రివర్స్ పంచ్ ఇస్తుంది కావ్య. మేనేజర్ అనామికకు కాల్ చేసి అసలు విషయం చెబుతుండగా..కావ్య వచ్చి ఫోన్ లాక్కుని అనామికకు వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత సెక్యూరిటీకి వార్నింగ్ ఇచ్చి పంపించేస్తుంది.
2/12

వాళ్ల కంపెనీని దెబ్బకొట్టాలన్న ఆలోచన మానుకో..నువ్వు ఎప్పటికీ ఏం చేయలేవు..కావ్య తెలివితేటల ముందు నువ్వు ఎందుకూ పనికిరావని తెలుసుకో అని వార్నింగ్ ఇస్తాడు సామ్రాట్. నేను కూడా నీ గొంతు పట్టుకోగలను చచ్చేవరకూ విడిపించుకోలేవ్ అనడంతో షాక్ అవుతుంది అనామిక..
3/12

కావ్య లోపలకు రాగానే రాజ్ సంతోషంగా ఎత్తుకుని తిప్పబోతాడు. ఆగండి..ఇలాంటి శత్రువులు మనకు ఉన్నారని తెలిసే జాగ్రత్తపడ్డాను అంటుంది. ఆయన అడ్వాన్స్ ఇస్తారు అనుకుంటే ఇవ్వలేదు..ఇప్పుడు అకౌంట్ జీరో అయింది ఎలా అంటాడు. సున్నాలు ఎన్ని ఉంటే వాటి ముందు వేసే అంకెలకు అంత విలువ అంటుంది...
4/12

మా పుట్టింటి తరపున ఎవరూ రావడం లేదన్నారు మా మేనమామకు నాపై అభిమానం ఉండడం వల్లే కదా చూడ్డానికి వచ్చారు అంటుంది ధాన్యలక్ష్మి. మీ ఆయన నాకు కాల్ చేసి..గోల్డ్ బిస్కెట్స్ అడిగాడు..రెండేళ్ల క్రితం ఉన్న రేట్ కే అడిగాను అంటాడు ప్రకాశం. రాజ్ రాగానే ఆ డీల్ మాట్లాడాలి అంటాడు. ఇది నిజంగా హెల్ప్ అవుతుంది అంటాడు సుభాష్. రాజ్ కావ్య రాగానే... ఈయన ధాన్యలక్ష్మి మేనమామ అని పరిచయం చేస్తాడు ప్రకాశం. ఆ తర్వాత అసలు విషయం చెబుతాడు. కాంట్రాక్ట్ కి అవసరం అయిన గోల్డ్ కొని స్టాక్ పెట్టేశాం..అంత గోల్డ్ ఇప్పట్లో మనకు అవసరం రాదంటుంది కావ్య. అంత గోల్డ్ పాత రేట్ కే ఇస్తున్నారంటే అని కావ్య సందేహించడంతో..మా మేనమామనే అనుమానిస్తున్నావా అని ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది.
5/12

రాజ్ కావ్య రాగానే... ఈయన ధాన్యలక్ష్మి మేనమామ అని పరిచయం చేస్తాడు ప్రకాశం. ఆ తర్వాత అసలు విషయం చెబుతాడు. కాంట్రాక్ట్ కి అవసరం అయిన గోల్డ్ కొని స్టాక్ పెట్టేశాం..అంత గోల్డ్ ఇప్పట్లో మనకు అవసరం రాదంటుంది కావ్య. అంత గోల్డ్ పాత రేట్ కే ఇస్తున్నారంటే అని కావ్య సందేహించడంతో..మా మేనమామనే అనుమానిస్తున్నావా అని ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది.
6/12

పాత రేటుకే ఇస్తానంటున్నా కదా అంటాడు ఆ వ్యాపారి. స్టాక్ కొనిపెట్టుకుంటే ఏమవుతుంది అంటాడు సుభాష్. ఇంత మంచి డీల్ కి అడ్డుపడతావ్ ఏంటి అంటాడు ప్రకాశం. ఈ డిస్కషన్ అంతా చూసి...ధాన్యలక్ష్మి మేనమామ ఫైర్ అవుతాడు. నీ మాటకి నీ ఇంట్లో ఎంత విలువ ఉందో అర్థమైందంటూ ప్రకాశాన్ని అవమానిస్తాడు.
7/12

మీరు అపార్థం చేసుకుంటున్నారని కావ్య సర్దిచెప్పబోతుంటే..మీ ఆయన్ని నోరు విప్పనీయకుండా నువ్వే మాట్లాడుతున్నావ్ కదా అనేసి వెళ్లిపోతాడు. ప్రతిరోజూ నిజం బయటపెట్టాల్సిన పరిస్థితి ఎందుకు కల్పిస్తున్నావో అర్థంకావడం లేదని బాధపడుతుంది. మీరు రూమ్ కి వెళ్లండి అంటుంది కావ్య.
8/12

రాకరాక మా పుట్టింటి నుంచి ఒక్క మనిషి వస్తే ఆయన ముందు నన్ను, నా భర్తను అవమానించారంటుంది. ప్రకాశం కూడా బాధపడతాడు. కావ్యకు ఏం తెలుసు అని వంతపాడుతున్నావ్ అని రాజ్ ని అడుగుతాడు ప్రకాశం. మట్టిపిసుక్కోమను అని కావ్యను అవమానిస్తారు. ఆస్తి అడిగానని కోపం పెట్టుకునే ఇదంతా చేశారు కదా అని ఫైర్ అవుతుంది
9/12

ఇదే అవకాశంగా రుద్రాణి మరింత రెచ్చగొడుతుంది. నన్ను ఓ మనిషిలా కూడా చూడలేదని ప్రకాశం అంటాడు. ఇప్పుడు అర్థమైందా ఆస్తికోసం ఎందుకు గొడవచేశానో అంటుంది ధాన్యలక్ష్మి. ఆపండి..ఇకపై కంపెనీనికి సంబంధించిన ఏ నిర్ణయం అయినా నేనే తీసుకుంటాను ఇందులో సంబంధం లేని వాళ్లు జోక్యం చేసుకోవద్దనేసి కావ్య వెళ్లిపోతుంది. ఇకపై ప్రకాశం కూడా మనవైపే అని సంబరపడుతుంది రుద్రాణి.
10/12

నేను మంచే చేశాను అయినా ఎందుకు ఇంతలా అవమానించారో అర్థంకాలేదని బాధపడతాడు ప్రకాశం. ఏం జరిగినా నువ్వున్నావు అడగడానికి అనుకున్నా అన్నయ్యా..కానీ ఈరోజు నా భార్యముందు నాకు అవమానం జరిగిందంటాడు. ఆ డీల్ వద్దనేందుకు ఓ స్ట్రాంగ్ రీజన్ చెప్పు అంటాడు
11/12

ఏం చెప్పాలి..కావ్య ఎందుకు అలా ప్రవర్తిస్తోందో, రాజ్ ఎందుకు మాట్లాడలేకపోతున్నాడో అర్థంకావడం లేదంటాడు సుభాష్. కానీ వాళ్లు మాత్రం తప్పుడు నిర్ణయం తీసుకోరు అనే నమ్మకం ఉందంటాడు. నాన్న నమ్మకం నిలబెట్టాలి అనుకోవడంలో తప్పులేదు కానీ ఇంట్లో వాళ్ల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం సరికాదంటాడు ప్రకాశం
12/12

బ్రహ్మముడి జనవరి 09 ఎపిసోడ్ లో.. నన్ను క్షమించండి మావయ్యా అని కావ్య ప్రకాశాన్ని అడుగుతుంది. కానీ ధాన్యలక్ష్మి మాత్రం మళ్లీ నోటికి పనిచెబుతుంది. ఇప్పటికైనా నిజం చెప్పడం మంచిది అంటాడు రాజ్..కానీ కావ్య వద్దని ఆపుతుంది...
Published at : 08 Jan 2025 09:22 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
వరంగల్
అమరావతి
ప్రపంచం
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion