అన్వేషించండి
BA Raju: నేడు బీఏ రాజు జయంతి... త్వరలోనే నిర్మాతగా ఆయన తనయుడు!
విలేకరిగా తెలుగు చిత్రసీమలో ప్రవేశించి తర్వాత పీఆర్వోగా వందల సినిమాలకు పని చేసి, తర్వాత నిర్మాతగా తనదైన ముద్ర వేసిన వ్యక్తి బీఏ రాజు. నేడు (జనవరి 7న) ఆయన జయంతి. త్వరలో ఆయన తనయుడు నిర్మాతగా రానున్నారు.

బీఏ రాజు జయంతి సందర్భంగా...
1/5

బీఏ రాజు... తెలుగు చిత్రసీమలో ప్రతి ఒక్కరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి. సుమారు 40 ఏళ్ల పాటు జర్నలిస్టుగా సేవలు అందించారు. మ్యాగజైన్, వెబ్ సైట్ - మీడియా సంస్థలు నిర్వహించారు. పీఆర్వోగా పలు సినిమాలకు పని చేశారు. ఆ అనుభవంతో నిర్మాతగా విజయవంతమైన సినిమాలు చేశారు. నేడు (జనవరి 7న) బిఏ రాజు 65 వ జయంతి.
2/5

ఆర్జే సినిమాస్ బ్యానర్ స్థాపించి... భార్య బి జయ దర్శకత్వంలో 'ప్రేమలో పావని కళ్యాణ్' అనే సినిమా నిర్మించారు. దాంతో చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు బీఏ రాజు. ఆయన నిర్మించిన సినిమాల్లో 'లవ్లీ' బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి.
3/5

'చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం' వంటి విజయవంతమైన సినిమాలను బీఏ రాజు నిర్మించారు.
4/5

ఆర్జే సినిమాస్ సంస్థను మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి బీఏ రాజు తనయుడు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ఆర్జే సినిమాస్ మీద శివకుమార్ బి సినిమాలు నిర్మించనున్నారు. ప్రముఖ హీరోలతో చిత్రాలను ప్రకటించనున్నట్లు శివ తెలిపారు.
5/5

సుమారు 1500 చిత్రాలకు పైగా పీఆర్వోగా పని చేసిన బిఏ రాజు... చిత్రసీమలో చిన్నా పెద్దా అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరితో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పర్చుకుని అజాత శత్రువుగా అందరితో ప్రశంసలు అందుకున్నారు. బీఏ రాజు ఆత్మకు శాంతి చేకూరాలని 65వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం.
Published at : 07 Jan 2025 09:33 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
రాజమండ్రి
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion