Tirupati Pilgrims Rush for Tokens | వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం తోపులాట | ABP Desam
తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శనం కోసం టీటీడీ ఆఫ్ లైన్ లో టికెట్లు కేటాయిస్తామని ప్రకటించిన కేంద్రాల వద్ద భక్తులు భారీగా చేరుకుంటున్నారు. ఈనెల 10 నుంచి 19వ తేదీవరకూ వైకుంఠ ద్వార దర్శనాలు జరగనుండగా ఆఫ్ లైన్ లో 9వ తేదీ ఉదయం 5గంటల నుంచి టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ప్రకటించింది. దీంతో 8వ తేదీ మధ్యాహ్నం నుంచే భక్తులు టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్దకు చేరి వేచిచూస్తున్నారు. 9వ తేదీన 10, 11, 12 వ తేదీలకు టోకెన్లు జారీ చేస్తామని చెప్పటంతో...క్యూలైన్లలోకి వెళ్లేందుకు భక్తులు తీవ్రంగా యత్నిస్తున్నారు. పోలీసులకు భక్తలను నియంత్రించటం కష్టంగా మారుతోంది. టోకెన్లు పొందాలనే తొందరలో భక్తుల మధ్య తోపులాటలు జరుగుతున్నాయి తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శనం కోసం టీటీడీ ఆఫ్ లైన్ లో టికెట్లు కేటాయిస్తామని ప్రకటించిన కేంద్రాల వద్ద భక్తులు భారీగా చేరుకుంటున్నారు. ఈనెల 10 నుంచి 19వ తేదీవరకూ వైకుంఠ ద్వార దర్శనాలు జరగనుండగా ఆఫ్ లైన్ లో 9వ తేదీ ఉదయం 5గంటల నుంచి టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ప్రకటించింది. దీంతో 8వ తేదీ మధ్యాహ్నం నుంచే భక్తులు టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్దకు చేరి వేచిచూస్తున్నారు. 9వ తేదీన 10, 11, 12 వ తేదీలకు టోకెన్లు జారీ చేస్తామని చెప్పటంతో...క్యూలైన్లలోకి వెళ్లేందుకు భక్తులు తీవ్రంగా యత్నిస్తున్నారు. పోలీసులకు భక్తలను నియంత్రించటం కష్టంగా మారుతోంది. టోకెన్లు పొందాలనే తొందరలో భక్తుల మధ్య తోపులాటలు జరుగుతున్నాయి