అన్వేషించండి
Advertisement

Kajal Aggarwal: ఎల్లో శారీలో మెరిసిపోతున్న అందాల చందమామ - కాజల్ అగర్వాల్ లేటెస్ట్ పిక్స్ వైరల్
Kajal Aggarwal: ‘సత్యభామ’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ అగర్వాల్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎల్లో శారీలో చందమామ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

కాజల్ అగర్వాల్ (Image Credit: Kajal Aggarwal Instagram)
1/10

దక్షిణాది అగ్ర కథానాయిక, అందాల చందమామ కాజల్ అగర్వాల్ గత రెండు దశాబ్దాలుగా సినీ అభిమానులను అలరిస్తూ వస్తోంది.
2/10

2004లో 'క్యూన్! హో గయా నా' అనే హిందీలో సినిమాతో తెరంగేట్రం చేసిన కాజల్.. 2007లో 'లక్ష్మీ కల్యాణం' చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
3/10

'చందమామ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీ.. 'మగధీర' మూవీతో స్టార్ స్టేటస్ సాధించింది. ఆ తర్వాత కొన్నేళ్లపాటు ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
4/10

మూడు పదుల వయసు దాటిన తర్వాత కూడా కుర్ర భామలకు పోటీ ఇస్తూ వరుస అవకాశాలు అందుకుంది. ఓవైపు కుర్ర హీరోలతో రొమాన్స్ చేస్తూనే, మరోవైపు సీనియర్ హీరోలకు జోడీగా నటించడం ఆమెకే చెల్లింది.
5/10

కోవిడ్ పాండమిక్ టైంలో గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకొని వివాహ బంధంలో అడుగుపెట్టిన కాజల్.. ఆ తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ వస్తోంది.
6/10

ప్రస్తుతం తన కుమారుడి ఆలనా పాలనా చూసుకుంటూ, పర్సనల్ లైఫ్ ను ప్రొఫెషనల్ లైఫ్ ను పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేస్తూ ముందుకు సాగుతోంది.
7/10

కాజల్ ప్రధాన పాత్రలో నటించిన ‘సత్యభామ’ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ 2024 జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
8/10

‘సత్యభామ’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా అమ్మడు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఎల్లో శారీలో చందమామలా మెరిసిపోతున్న ఆమె అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
9/10

కాజల్ అగర్వాల్ చేతిలో 'ఇండియన్ 2' లాంటి క్రేజీ మూవీ కూడా ఉంది. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్.. జూలై 12న రిలీజ్ కానుంది.
10/10

కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలు
Published at : 05 Jun 2024 10:43 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
క్రికెట్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion