అన్వేషించండి
Ram Pothineni: భాగ్యశ్రీ బోర్సేతో కలిసి కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టిన రామ్... RAPO 22 పూజకు ఎవరెవరు వచ్చారంటే?
RAPO 22 Pooja Ceremony: ఉస్తాద్ రామ్ పోతినేని 22వ సినిమా ఈ రోజు పూజతో మొదలు అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ ఓపెనింగ్‌కు నేడు కొబ్బరికాయ కొట్టారు.

పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన రామ్ పోతినేని - మహేష్ బాబు పి - మైత్రీ మూవీ మేకర్స్ సినిమా
1/6

Ram Pothineni New Movie: ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో నవీన్ ఎర్నేని, రవిశంకర్ వై నిర్మిస్తున్న కొత్త సినిమా ఈ రోజు ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ పి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో 'మిస్టర్ బచ్చన్' ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్.
2/6

పూజ తర్వాత హీరో హీరోయిన్లు రామ్, భాగ్యశ్రీ బోర్సే మీద చిత్రీకరించిన తొలి సన్నివేశానికి సీనియర్ స్టార్ దర్శకుడు, ప్రస్తుతం మైత్రీలో సన్నీ డియోల్ హీరోగా సినిమా చేస్తున్న గోపీచంద్ మలినేని కెమెరా స్విచ్ఛాన్ చేయగా... ప్రభాస్ హీరోగా 'ఫౌజీ' తీస్తున్న హను రాఘవపూడి క్లాప్ ఇచ్చారు. నితిన్ 'రాబిన్ హుడ్' దర్శకుడు వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు.
3/6

ముహూర్తపు కార్యక్రమాల్లో భాగంగా చిత్ర దర్శకుడు మహేష్ బాబుకు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ తో పాటు సీఈవో చెర్రీ, దర్శకులు గోపీచంద్ మలినేని, హను రాఘవపూడి, వెంకీ కుడుముల, శివ నిర్వాణ, పవన్ సాధినేని స్క్రిప్ట్ అందజేశారు.
4/6

ఫీల్ గుడ్ క్రేజీ ఎంటర్‌టైనర్‌గా #RAPO22 రూపొందుతోందని, ఇందులో క్యారెక్టర్ కోసం రామ్ స్పెషల్‌గా మేకోవర్ అవుతున్నారని దర్శక నిర్మాతలు తెలిపారు. అన్ని వర్గాలను ఆకట్టుకునే కథ, కథనాలతో సినిమా రూపొందుతోందని వివరించారు.
5/6

RAPO 22 ప్రారంభోత్సవ వేడుకకు హాజరైన దర్శకులు గోపీచంద్ మలినేని, హను రాఘవపూడి, వెంకీ కుడుముల, శివ నిర్వాణ, పవన్ సాధినేనితో పాటు హీరో హీరోయిన్లు రామ్, భాగ్యశ్రీ... అలాగే నిర్మాతలు నవీన్, రవిశంకర్, సీఈవో చెర్రీ.
6/6

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటతో దర్శక నిర్మాతలు.
Published at : 21 Nov 2024 02:20 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
గాసిప్స్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion