Morning Top News: ముందస్తు బెయిల్ కోసం వైసీపీ నేతల పరుగులు, బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టు వంటి మార్నింగ్ న్యూస్
Top 10 Headlines Today: తెలంగాణలో ప్రస్తుతం పాలన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తలపిస్తోందన్న మాజీ మంత్రి హరీష్ రావు, చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తానన్న వీఎస్ఆర్ వంటి మార్నింగ్ న్యూస్
Morning Top News:
పోలీసులను దూషించిన కేసులో కౌశిక్‌కు బెయిల్
ఫిర్యాదుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వారితో వాగ్వాదం దిగిన కేసులో కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. అర్థరాత్రి వేళ ఐదు వేల రూపాయల స్వంత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. కౌశిక్‌తోపాటు ఇతర నాయకులను అరెస్టు చేయాన్ని తీవ్రంగా తప్పుపట్టిన బీఆర్‌ఎస్ ఇవాళ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళన నేపథ్యంలో చాలా మంది గులాబీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తా: వీఎస్ఆర్
చంద్రబాబుకు మతి భ్రమించి ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదంటూ YCP MP విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ‘అందరినీ క్రిమినల్ అంటాడు.. కానీ, చంద్రబాబే ఒక క్రిమినల్. KVరావు ఒక బ్రోకర్.. చంద్రబాబుకు చెంచా. కాకినాడ పోర్టును తన బినామీ KVరావుకు కట్టబెట్టడానికే బాబు నాటకాలు. నాపై లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సిన అవసరమేంటి? KVరావు, చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తా’ అని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
వైసీపీ నేతలపై కేసులు.. బెయిల్ కోసం పరుగులు
విద్యుత్ రంగాన్ని గాడిలో పెడతాం
వైసీపీ పాలనలో నిర్వీర్యమైన ఏపీ విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. రాబోయే 6 నెలలకు సంబంధించి విద్యుత్ ఉత్పత్తి, వినియోగం, సరఫరాతో పాటు పలు అంశాలను చర్చించారు. 6 నెలలకు సంబంధించి విద్యుత్ వినియోగం, డిమాండ్లకు అనుగుణంగా ఏ విధంగా విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలి అనే దానిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ తప్పిదాలు ప్రజలకు భారం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
భారత్‌ను పదే పదే రెచ్చగొడుతున్న బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ ఉద్దేశపూర్వకంగా సరిహద్దుల్లో అలజడి పెంచేలా వ్యవహరిస్తూ భారత్ ను రెచ్చగొడుతోంది. పరిస్థితి ఎలా ఉందంటే చివరికి యుద్దానికి కూడా సిద్ధమని అంటున్నట్లుగా అక్కడి తాత్కలిక పాలకులు బెదిరింపులకు దిగుతున్నారు. ఇది ప్రశాంతంగా ఉండే భారత్ కూడా యుద్ధానికి సన్నద్ధం అయ్యేలా చేస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
కాలిఫోర్నియాలో 7.0 తీవ్రతతో భారీ భూకంపం
అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు శాన్ ఫ్రాన్సిస్కో వరకు వచ్చాయి. సునామీ హెచ్చరిక కూడా అధికారులు జారీ చేశారు. కాసేపటికే దానిని ఉపసంహరించుకున్నారు. భూకంపం ప్రభావంతో అక్కడి 5.3 మిలియన్ల మంది ప్రజలు భయాందోళలకు గురయ్యారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..