అన్వేషించండి

Harish Rao: ఎమర్జెన్సీని తలపించేలా సీఎం రేవంత్ పాలన - ఏడో గ్యారెంటీగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న హరీష్ రావు

Telangana News: తెలంగాణలో ఇందిరాగాంధీ నాటి ఎమర్జెన్సీ పాలన తలపిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. నిర్బంధాలు, అక్రమ అరెస్టులు తప్ప సీఎం రేవంత్ చేసిందేమీ లేదన్నారు.

Harish Rao Anger On CM Revanth Reddy: తెలంగాణలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తలపిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు (Harishrao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క చాన్స్, మార్పు అంటూ అధికారం చేజిక్కించుకుని రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడటం తప్పించి మరే మార్పు తీసుకురాలేదని దుయ్యబట్టారు. నిర్భందాలు, అక్రమ అరెస్టులు, రాజ్యాంగ ఉల్లంఘనలు తప్ప రేవంత్ తెచ్చిన మార్పు ఏమీ లేదని విమర్శించారు. గురువారం గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ నుంచి విడుదలైన అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.  

గొంతు నొక్కాలని చూస్తున్నారు..

సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. పోలీస్ స్టేషన్లన్నీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో వివిధ వర్గాలు అష్టకష్టాలు పడుతున్నాయని విమర్శించారు. నిరుద్యోగ యువతకు జాబుల గురించి మాట ఇచ్చారో.. అదే నిరుద్యోగుల వీపులు కమిలిపోయేట్టు అశోక్‌నగర్‌లో కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి గిరిజనులపై దాడి చేసి జైళ్లల్లో నిర్బంధించారని, రేవంత్‌ పాలన ఆనాటి ఇందిరమ్మ హయాంలోని ఎమర్జెన్సీని తలపిస్తోందని మండిపడ్డారు. పోలీసులతో రాజ్యమేలిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించలేదని, ఇందిరమ్మ లాంటివాళ్లను కూడా కూకటివేళ్లతో ప్రజలు పెకిలించి వేశారని గుర్తు చేశారు.

ఇక పోలీసుల తీరుపైనా హరీష్ రావు ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఎఫ్‌ఐఆర్‌లు పోలీస్‌ స్టేషన్లలో కాకుండా గాంధీభవన్‌లో తయారవుతున్నాయని, ఏ సెక్షన్లు పెట్టాలి.. ఎవరిని అరెస్టు చేయాలో గాంధీభవన్‌ నుంచి ఆదేశాలు వస్తున్నాయని విమర్శించారు. అధికారం ఎవరకీ శాశ్వతం కాదన్న విషయం రేవంత్ గుర్తుంచుకోవాలన్నారు.

ఏడాది పాలనలో ఒక్క మంచి పనైనా లేదు..
సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో రాష్ట్రంలో ఎవరు కూడా బాగుపడలేదని హరీష్ రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏడో గ్యారంటీగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం శాశ్వతం కాదని, పోలీసులు రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పనిచేయాలని హెచ్చరించారు. కానీ, రేవంత్‌రెడ్డి ఆదేశాలతో పని చేస్తే భవిష్యత్‌లో ఇబ్బంది పడేది ఖాకీలేనని, ప్రతిపక్షంపై సీఎం పగబట్టినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాపాలన కాదు.. రాక్షస పాలన కొనసాగుతోందని ఘాటుగా విమర్శించారు. కాగా, బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి అరెస్టును మాజీ మంత్రి హరీష్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే హరీష్ రావును సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. 

అరెస్టుపై హైకోర్టులో స్టే..

మరోవైపు.. హరీశ్‌రావు అరెస్టుపై హైకోర్టు స్టే విధించింది. తన అరెస్టును సవాల్ చేస్తూ హైకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు.. పంజాగుట్టలో నమోదైన కేసులో హరీశ్‌రావును అరెస్టు చెయ్యవద్దని సూచించింది. కావాలంటే.. నోటీసులు ఇచ్చి విచారించుకోవచ్చని జస్టిస్ లక్ష్మణ్ తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. హైకోర్టు నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ తీర్పు చెంపపెట్టు అని పేర్కొంటున్నారు. 

Also Read: Nizamabad News: బైక్‌తో రైలుకు ఎదురెళ్లాడు - గేట్ మ్యాన్ స్పందనతో ప్రాణాలు దక్కాయి, కట్ చేస్తే!

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Elections: పోలింగ్‌కు ముందే 17 చైర్‌పర్సన్ స్థానాల్లో కూటమి ఏకగ్రీవం.. విజేతల పూర్తి వివరాలు
పోలింగ్‌కు ముందే 17 చైర్‌పర్సన్ స్థానాల్లో కూటమి ఏకగ్రీవం.. విజేతల పూర్తి వివరాలు
Karnataka Political Sting Operation 2026: కర్ణాటక రాజకీయాల్లో స్టింగ్ కలకలం - సొంత పార్టీ నేతలపై సిద్ధరామయ్య ఆరోపణలు.. అసలేం జరుగుతోంది?
కర్ణాటక రాజకీయాల్లో స్టింగ్ కలకలం - సొంత పార్టీ నేతలపై సిద్ధరామయ్య ఆరోపణలు.. అసలేం జరుగుతోంది?
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
AIMIM AP Local Body Elections: ఏపీ స్థానిక పోరులో ఎంఐఎం - కడప, హిందూపురంలో బరిలోకి ఒవైసీ.. వైసీపీకి ఊహించని దెబ్బ?
ఏపీ స్థానిక పోరులో ఎంఐఎం - కడప, హిందూపురంలో బరిలోకి ఒవైసీ.. వైసీపీకి ఊహించని దెబ్బ?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget