అన్వేషించండి

Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

Maharastra New CM: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా దేవేంద్ర ఫడణవీస్, డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, అజిత్ పవార్‌లు గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు.

Devendra Fadnavis Take Oath As New CM Of Maharastra: మహారాష్ట్రలో గురువారం సాయంత్రం 'మహాయుతి' (Mahayuti) ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ అగ్రనేత దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) సీఎంగా, శివసేన అధినేత ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde), ఎన్సీపీ అగ్రనాయకుడు అజిత్ పవార్‌లు (Ajit Pawar) ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దక్షిణ ముంబయిలోని ఆజాద్ మైదానంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ వీరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, ఏపీ సీఎం చంద్రబాబు, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి 19 మంది ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఫడణవీస్ సీఎంగా ప్రమాణం చేయడం ఇది మూడోసారి.

కాగా, ఫడణవీస్ 1989లో ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించి 22 ఏళ్ల వయసులోనే నాగ్‌పూర్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 1997లో మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1999 నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన ఆయన.. 2014లో మొదటిసారి సీఎంగా ఎన్నికయ్యారు. 2019 నవంబర్ 23న రెండోసారి సీఎంగా ప్రమాణం చేశారు. అయితే, సరిపడా బలం లేకపోవడంతో 3 రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడూ మూడోసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

చివరి వరకూ ప్రతిష్టంభన

ఎన్నికల ఫలితాల తర్వాత మహారాష్ట్ర సీఎం ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముంబయిలో బుధవారం బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఫడణవీస్ పేరు ఖరారు చేయడంతో ప్రతిష్టంభనకు తెరపడింది. మిత్ర ధర్మాన్ని పాటిస్తూ బీజేపీ అధిష్టానం శిందే, అజిత్ పవార్‌లకు డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించింది. కాగా, అజిత్ పవార్ బాధ్యతలపై బుధవారమే ఓ స్పష్టత రాగా.. శిందే బాధ్యతలు స్వీకరిస్తారా.? లేదా.? అనే దానిపై టెన్షన్ నెలకొంది. అయితే, శివసేన అధికారిక ప్రకటన చేయడంతో ప్రతిష్టంభన వీడింది.

నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 'మహాయుతి' కూటమి.. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు 233 స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి 51 చోట్ల గెలుపొందింది. బీజేపీ 132 స్థానాలు గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరించింది. శివసేన (ఏక్‌నాథ్ శిందే) వర్గం 57, ఎన్సీపీ (అజిత్ పవార్) వర్గం 41 స్థానాల్లో గెలుపొందాయి. ఇక శివసేన (ఉద్ధవ్) పార్టీ 20 చోట్ల విజయం సాధించగా.. కాంగ్రెస్ 16, ఎన్సీపీ (ఎస్పీ) 10 స్థానాలు గెలుచుకున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ 2, జన్ సురాజ్య శక్తి 2, రాష్ట్రీయ యువత స్వాభిమాన్ పార్టీ, రాష్ట్రీయ సమాజ్ పక్ష, ఏఐఎంఐఎం, సీపీఎం, పీడబ్ల్యూపీఐ, ఆర్‌వీఏ చెరో ఒక స్థానం చొప్పున గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థులు 2 స్థానాల్లో విజయం సాధించారు.

Also Read: Uber: టైమ్‌కు రాలేదని ఉబెర్‌ను కోర్టుకు లాగిన కస్టమర్ - అంతేనా రూ.54వేల పరిహారం కూడా పొందాడు !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Card Online Apply Telangana: మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేయడానికి లేదు- తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ
మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేయడానికి లేదు- తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ
Delhi Election Result 2025: ఢిల్లీ ఫలితాలు అన్నా హజారేను సంతోష పెట్టి ఉంటాయి- 'ఆప్ అవినీతి పార్టీ, కాంగ్రెస్ పరాన్నజీవి', ప్రధాని మోదీ విమర్శలు
ఢిల్లీ ఫలితాలు అన్నా హజారేను సంతోష పెట్టి ఉంటాయి- 'ఆప్ అవినీతి పార్టీ, కాంగ్రెస్ పరాన్నజీవి', ప్రధాని మోదీ విమర్శలు
Kiran Royal: వివాదంలో జనసేన నేత కిరణ్ రాయల్ - డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదన్న మహిళ
వివాదంలో జనసేన నేత కిరణ్ రాయల్ - డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదన్న మహిళ
Andhra Pradesh: కూటమి ప్రభుత్వాన్ని అభినందించకుండా ఉండలేరు -  పేదల ప్రాణాలను కాపాడేలా ఉచితంగా ఖరీదైన ఇంజక్షన్
కూటమి ప్రభుత్వాన్ని అభినందించకుండా ఉండలేరు - పేదల ప్రాణాలను కాపాడేలా ఉచితంగా ఖరీదైన ఇంజక్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

AAP Loss Yamuna Pollution Key Role | Delhi Election Results 2025లో కేజ్రీకి కలిసి రాని యమున | ABP DesamArvind Kejriwal on AAP Election Loss | ఆమ్ ఆద్మీ ఓటమిపై స్పందించిన కేజ్రీవాల్ | ABP DesamDelhi Elections Results 2025 | మాస్టర్ మైండ్ Manish Sisodia ను వీక్ చేశారు..ఆప్ ను గద్దె దింపేశారు | ABP DesamDelhi Elections Results 2025 | Delhi గద్దె Arvind Kejriwal దిగిపోయేలా చేసింది ఇదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Card Online Apply Telangana: మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేయడానికి లేదు- తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ
మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేయడానికి లేదు- తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ
Delhi Election Result 2025: ఢిల్లీ ఫలితాలు అన్నా హజారేను సంతోష పెట్టి ఉంటాయి- 'ఆప్ అవినీతి పార్టీ, కాంగ్రెస్ పరాన్నజీవి', ప్రధాని మోదీ విమర్శలు
ఢిల్లీ ఫలితాలు అన్నా హజారేను సంతోష పెట్టి ఉంటాయి- 'ఆప్ అవినీతి పార్టీ, కాంగ్రెస్ పరాన్నజీవి', ప్రధాని మోదీ విమర్శలు
Kiran Royal: వివాదంలో జనసేన నేత కిరణ్ రాయల్ - డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదన్న మహిళ
వివాదంలో జనసేన నేత కిరణ్ రాయల్ - డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదన్న మహిళ
Andhra Pradesh: కూటమి ప్రభుత్వాన్ని అభినందించకుండా ఉండలేరు -  పేదల ప్రాణాలను కాపాడేలా ఉచితంగా ఖరీదైన ఇంజక్షన్
కూటమి ప్రభుత్వాన్ని అభినందించకుండా ఉండలేరు - పేదల ప్రాణాలను కాపాడేలా ఉచితంగా ఖరీదైన ఇంజక్షన్
Telangana News: కాంగ్రెస్‌కు గుండు సున్న- కేసీఆర్‌ను కలిసిన వారంతా పోయారు - సోషల్ మీడియాలో రచ్చ రచ్చ 
కాంగ్రెస్‌కు గుండు సున్న- కేసీఆర్‌ను కలిసిన వారంతా పోయారు - సోషల్ మీడియాలో రచ్చ రచ్చ 
Parvesh Verma: ఢిల్లీ సీఎం రేసులో జెయింట్ కిల్లర్ పర్వేష్ వర్మ - ఆయన అస్తులెన్నో తెలిస్తే షాకే !
ఢిల్లీ సీఎం రేసులో జెయింట్ కిల్లర్ పర్వేష్ వర్మ - ఆయన అస్తులెన్నో తెలిస్తే షాకే !
IIFA Awards 2025: ఐఫా అవార్డుల ప్రదానం ఎప్పుడు, ఎక్కడ ? టిక్కెట్లు ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా?
IIFA అవార్డుల ప్రదానం ఎప్పుడు, ఎక్కడ ? టిక్కెట్లు ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా?
Arvind Kejriwal: మోదీనే వణికించిన మొనగాడు కేజ్రీవాల్, కానీ నాలుగోసారి ఎందుకు ఓడాడంటే!
మోదీనే వణికించిన మొనగాడు కేజ్రీవాల్, కానీ నాలుగోసారి ఎందుకు ఓడాడంటే!
Embed widget