Puspha Collections: పుష్పను తమ ఖాతాలో వేసుకున్న వైఎస్ఆర్‌సీపీ - అల్లు అర్జున్ క్లారిటీ ఇస్తారా ? మౌనం వహిస్తారా ?
Politics: అల్లు అర్జున్ ను తమ పార్టీ సపోర్టర్‌గా చెప్పేందుకు వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. హీరో మౌనం పాటిస్తే అర్థాంగీకారం అనే సంకేతాలు బలంగా వెళ్లే అవకాశం ఉంది.
YCP is trying hard to make Allu Arjun a supporter of their party: పుష్ప పార్ట్ వన్ సినిమా వచ్చినప్పుడు ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. అప్పుడు టిక్కెట్ రేట్ల పెంపుకు ఆమోదం లభించలేదు. మామూలు రేట్లతోనే పుష్ప రిలీజ్ అయింది. మంచి హిట్ అయింది. ఇక్కడ కన్నా నార్త్ లో ఇంకా పెద్ద హిట్ అయింది. ఆ సినిమా ఎంత హిట్ అన్న సంగతి పక్కన పెడితే ఈ పుష్ప సినిమాపై వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో స్మగ్లర్లు అందరికీ ఒకే సామాజికవర్గం పేరు పెట్టారని మండిపడ్డారు. అయితే ఇప్పుడు అదే పుష్ప సినిమాకు సీక్వెల్ ను వైఎస్ఆర్సీపీ నేతలు పనిగట్టుకుని మరీ ప్రమోట్ చేస్తున్నారు. అంబటి రాంబాబు లాంటి వాళ్లు రోజూ అదే పని చేస్తున్నారు.
సినిమాలో డైలాగ్స్ ను వక్రీకరిస్తూ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల ప్రచారం
అల్లు అర్జున్ సినిమాలో రాజకీయం లేదు. అయితే అందులో డైలాగుల వెర్షన్ మార్చేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అనని డైలాగుల్ని లేని డైలాగులని.. ఉన్న వాటిని కూడా అర్థాలు మార్చేసి ఆయన మెగా కుటుంబంపై పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడినట్లుగా ప్రచారం చేశారు.అయితే సినిమా చూసిన ఎవరికైనా అందులో వివాదాస్పద డైలాగులు లేవని అందులో ఉన్న పుష్ప క్యారెక్టర్ కు తగ్గట్లుగా.. ఆ సీన్ లో డైలాగులు ఉన్నాయని ఎవరికైనా అర్థం అవుతుంది.అయితే మెగా ఫ్యామిలీలో వివాదం ఉందని.. అల్లు ఫ్యామిలీకి.. కొణిదెల ఫ్యామిలీకి సరిపడటం లేదన్న భావన కల్పించాడనికి చేయాల్సినంత ప్రచారం చేశారు.అందుకే అర్జున్ కు వీరంతా మద్దతు పలికారని అనుకోవచ్చు.
Also Read: Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
ఒక వేళ నిజంగానే మెగా ఫ్యామిలీలో విభజన రేఖ ఉంటే దాన్ని పెద్దది చేసేందుకు వైసీపీ సోషల్ మీడియా ప్రయత్నించిందని అనుకోవచ్చు. అయితే మెగా ఫ్యామిలీలో విభజన వస్తే వైసీపీకి ఏంటి లాభం అంటే ఎవరి దగ్గర సమాధానం ఉండకపోవచ్చు. అయితే ఓ గ్రూపు తమకు సపోర్టు చేస్తుందని వైసీపీ వ్యూహకర్తలు అనుకుంటూ ఉండవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇది నిజం కావొచ్చు కూడా. గత ఎన్నికల్లో తన మిత్రుడు శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు. అయితే ఆయన ప్రచారం చేయలేదు. కానీ మా కోసం వచ్చారని వైసీపీ ఓన్ చేసుకుంది. కానీ అర్జున్ మాత్రం ఇంత వరకూ స్పందించలేదు.
Also Read: ఏపీ యువతకు గూగుల్ నైపుణ్య శిక్షణ - నారా లోకేష్ సమక్షంలో ఒప్పందం
రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేస్తే అర్జున్ స్పందించే చాన్స్ !
రాజకీయాలపై అల్లు అర్జున్ ఇంత వరకూ ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. తన భార్య స్నేహారెడ్డి తండ్రి తెలంగాణ రాజకీయ నేత.ఆయన కోసం కూడా గతంలో ఎప్పుడూ ఎలాంటి బహిరంగ ప్ రకటనలు చేయలేదు. రాజకీయాల విషయంలో అల్లు అర్జున్ ఆలోచనలు ఏమిటన్నది మాత్రం ఎప్పుడూ బయటకు రాలేదు. కానీ జనసేన పార్టీకి గతంలో మద్దతు పలికారు. ఇటీవల ఎన్నికల సమయంలో అందరూ పవన్ కోసం పిఠాపురం వెళ్తూంటే ఆయన నంద్యాల వెళ్లడంతోనే అసలు సమస్య వచ్చింది. తనను వైసీపీ పూర్తి స్థాయిలో రాజకీయంగా ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తే.. ఆయన ఖచ్చితంగా తిప్పికొట్టే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.