Minsiter Gottipati Ravikumar: 'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
Andhra News: ప్రజలపై భారం లేకుండా విద్యుత్ కొనుగోళ్లు ఉండాలని మంత్రి గొట్టపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ తప్పిదాలు ఇప్పుడు గుదిబండలా మారాయని అన్నారు.

Minister Gottipati Ravikumar Key Orders On Power Purchases: వైసీపీ పాలనలో నిర్వీర్యమైన విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravikumar) స్పష్టం చేశారు. సచివాలయంలో గురువారం విద్యుత్ రంగానికి సంబంధించి ట్రాన్స్ కో, జెన్ కో, డిస్క్ంల సీఎండీలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే 6 నెలలకు సంబంధించి విద్యుత్ ఉత్పత్తి, వినియోగం, సరఫరాతో పాటు పలు అంశాలను చర్చించారు. 6 నెలలకు సంబంధించి విద్యుత్ వినియోగం, డిమాండ్లకు అనుగుణంగా ఏ విధంగా విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలి అనే దానిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ తప్పిదాలు ప్రజలకు భారం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజలపై భారం లేకుండా..
ప్రజలపై భారం లేకుండా విద్యుత్ కొనుగోళ్లు ఉండాలని మంత్రి గొట్టిపాటి అధికారులకు సూచించారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు చేసిన చారిత్రాత్మక తప్పిదాలు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు గుది బండగా మారాయని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటుందని, అందుకు అనుగుణంగానే విద్యుత్ రంగానికి సంబంధించి ఎటువంటి సమస్యలూ ఎదురు కాకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. సోలార్, విండ్ వంటి పునరుత్పాదక విద్యుత్ రంగాల్లో ఉత్పత్తిని... డిమాండ్ మేరకు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
ఏయే ప్రాంతాల్లో, ఏయే కాలాల్లో విద్యుత్ వినియోగం పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో పరిశీలించి దానికి తగినట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. అదే విధంగా లో ఓల్టేజ్ సమస్యలు తలెత్తకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్వా, ఫౌల్ట్రీ రంగాలకు ఇచ్చే రాయితీలపై అధికారులతో మంత్రి చర్చించారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు అందించే ఉచిత విద్యుత్‌పై చేస్తున్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలన్నారు. రాబోయే 6 నెలల కాలానికి విద్యుత్ రంగానికి సంబంధించి ఎటువంటి సమస్యలూ.. లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని మంత్రి పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, జెన్ కో ఎండీ చక్రధర్ బాబు, ట్రాన్ కో జేఎండీ కీర్తీ చేకూరి తో పాటు డిస్క్ం ల సీఎండీలు, పలువురు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Before You Go
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























