Morning Top News: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్, నేడు తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం వంటి టాప్ న్యూస్
Top 10 Headlines Today: హైదరాబాద్ నుమాయిష్ వాయిదా, అమెరికా మాజీ ప్రెసిడెంట్ మృతి వంటి మార్నింగ్ టాప్ న్యూస్
Morning Top News:
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ నియమితులయ్యారు. వచ్చే ఏడాది నవంబరు నెలాఖరున ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఎన్డీయే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం ఈ నెలాఖరు (డిసెంబర్ 31)తో ముగియనుంది. దీంతో నూతన సీఎస్‌గా విజయానంద్‌ను కూటమి ప్రభుత్వం ఎంపిక చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
నేడు తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం
తెలంగాణ శాసనసభ నేడు ప్రత్యేకంగా సమావేశం కానుంది. మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కర్త మన్మోహన్ సింగ్ మృతికి సభ నివాళులు అర్పించనుంది. మన్మోహన్ మృతి పట్ల సభ సంతాపం ప్రకటించనుంది. శాసనసభ సమావేశాల నేపథ్యంలో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారు. హైదరాబాద్ లో మన్మోహన్ విగ్రహ ఏర్పాటు సహా.. ఆయన పేరుతో కొత్త పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రకటించే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
తమ్మినేని పార్టీ మార్పు ఖాయమేనా..?
సిక్కోలు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో తమ్మినేని టచ్‌లోకి వెళ్లారం జరిగింది. అందుకే ఆయన గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారని వైసీపీ శ్రేణులు భావించాయి. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, సీనియర్ నేత తమ్మినేని సీతారాం ఇంటికి శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలే ఒక్కో కీలక నేత పార్టీని వీడుతుండటం అధినేత జగన్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ
తెలంగాణలో గతేడాదితో పోలిస్తే ఈసారి 9.87 శాతం కేసులు పెరిగాయని.. 2,34,158 కేసులు నమోదైనట్లు రాష్ట్ర డీజీపీ జితేందర్ తెలిపారు. డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే పోలీస్ శాఖ లక్ష్యమని అన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో నేర వార్షిక నివేదికను విడుదల చేశారు. తెలంగాణలో పోలీస్ ఆత్మహత్యలపై డీజీపీ జితేందర్ స్పందించారు. చాలా చోట్ల వ్యక్తిగత కారణాలతోనే బలవన్మరణాలు జరుగుతున్నాయన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
నుమాయిష్ ప్రారంభం వాయిదా
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జనవరి 1న ప్రారంభం కావాల్సిన నుమాయిష్ వాయిదా పడింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి ప్రభుత్వం 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. దీంతో జనవరి 3వ తేదీన సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 2500 స్టాళ్లు ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. 25 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఈ పబ్‌ల్లో న్యూ ఇయర్ వేడుకలకు నో పర్మిషన్
హైదరాబాద్ నగరం న్యూఇయర్ వేడుకలకు సిద్ధమవుతోంది. అయితే జూబ్లీహిల్స్‌లోని 34 పబ్బుల్లో నాలుగు పబ్బులకు అనుమతి నిరాకరించారు. హాట్‌కప్, అమినేషియా, బ్రాండ్‌వే, బేబీ లాండ్ పబ్బుల్లో నూతన సంవత్సర వేడుకలకు పోలీసులు పర్మిషన్ రద్దు చేశారు. డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట వరకు న్యూ ఇయర్ వేడుకలు ముగించుకోవాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
బోరు బావికి మరో బాలుడు బలి
దేశంలో బోరు బావులు చిన్నారులను బలికొంటూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ గుణ జిల్లా పిప్లియా గ్రామంలో బోరు బావిలో పడిన బాలుడు(10) చికిత్స పొందుతూ కన్నుమూశాడు. 140 ఫీట్ల లోతు ఉన్న ఆ బావిలో బాలుడు 39 ఫీట్ల వద్ద చిక్కుకున్నాడు. 24 గంటలు కష్టపడి రెస్క్యూ సిబ్బంది కాపాడినా ఫలితం లేకుండా పోయింది. అటు రాజస్థాన్‌లో మూడేళ్ల చిన్నారి వారం రోజులుగా బోరు బావిలోనే ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
అమెరికా మాజీ ప్రెసిడెంట్ మృతి
అమెరికా మాజీ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ ఆదివారం రాత్రి మృతి చెందారు. కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న 100 ఏళ్ల జిమ్మీ కార్టర్.. జార్జియాలోని తన ఇంట్లో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. US 39వ ప్రెసిడెంట్‌గా 1977-1981 మధ్యకాలంలో జిమ్మీ కార్టర్ పనిచేశారు. 2002లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. US అధ్యక్షుల్లో ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా కార్టర్ రికార్డ్ సృష్టించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
96 ఏళ్ల రికార్డును భారత్ బద్దలు కొడుతుందా..?
బాక్సింగ్ డే టెస్టు రసవత్తరంగా మారింది. నాలుగో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 228/9 స్కోరుతో నిలిచింది. దీంతో 333 పరుగుల లీడ్ సాధించింది. భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే దాదాపు 96 ఏళ్ల నుంచి కొనసాగుతున్న రికార్డు తుడిచిపెట్టుకుపోనుంది. మెల్‌బోర్న్ మైదానం వేదికగా జరిగిన టెస్టులో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఇంగ్లండ్ కొనసాగుతోంది. ఆసీస్‌పై 1928లో 332 పరుగులను ఛేదించి ఇంగ్లండ్ విజయం సాధించింది. ఇప్పుడు భారత్ గెలిస్తే ఆ రికార్డును అధిగమించే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
రామ్ చరణ్ 256 అడుగుల కటౌట్
విజయవాడలో రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 256 అడుగుల ఎత్తులో గేమ్ ఛేంజర్ కటౌట్ నిర్మించారు. ఈ కటౌట్ ను రేపు మధ్యాహ్నం 3 గంటల సమయంలో గేమ్ చేజింగ్ మూవీ టీం హాజరై ఆవిష్కరించనున్నారు. కటౌట్ ఆవిష్కరణ అనంతరం హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపించేందుకు ఏర్పాటు చేసినట్లు సమాచారం. తమ అభిమాన కథానాయకుడు భారీ కటౌట్ ఏర్పాటు చేయటం పట్ల ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..