అన్వేషించండి

Telangana DGP: 'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!

Telangana News: తెలంగాణలో ఈ ఏడాది కేసుల నమోదు పెరిగిందని డీజీపీ జితేందర్ తెలిపారు. డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యమని.. ఈసారి శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పారు.

Telangana DGP Released Annual Crime Report: తెలంగాణలో గతేడాదితో పోలిస్తే ఈసారి 9.87 శాతం కేసులు పెరిగాయని.. 2,34,158  కేసులు నమోదైనట్లు రాష్ట్ర డీజీపీ జితేందర్ (DGP Jitender) తెలిపారు. డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే పోలీస్ శాఖ లక్ష్యమని అన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో నేర వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ ఏడాది శాంతి భద్రతలు బాగున్నాయని.. ఒకటి రెండు ఘటనలు మినహా పూర్తి అదుపులో ఉన్నట్లు చెప్పారు. 

'కొత్త నేర చట్టాల అమలు కోసం పోలీసులకు శిక్షణ ఇచ్చాం. డిజిటల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ ఏడాది 33,618 సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేశాం. 703 చోరీ, 1525 కిడ్నాప్, 58 దోపిడీ, 856 హత్య, 2,945 అత్యాచారాల కేసులు నమోదు చేశాం. డయల్ 100కు 16,92,173 ఫిర్యాదులు వచ్చాయి. కొత్త చట్టం వచ్చిన తర్వాత 85,190 కేసులను నమోదు చేశాం. కొత్త చట్టం ప్రకారం సైబరాబాద్ పరిధిలో 15,360, హైదరాబాద్‌లో 10,501, రాచకొండలో 10,251 కేసులు నమోదు చేశాం. సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.180 కోట్లను బాధితులకు తిరిగి అప్పగించాం. తెలంగాణవ్యాప్తంగా రూ.142.95 కోట్ల డ్రగ్స్ సీజ్ చేశాం. డ్రగ్స్ కేసుల్లో 4,682 మంది నిందితులను అరెస్ట్ చేశాం.' అని వివరించారు.

పోలీస్ ఆత్మహత్యలపై..

తెలంగాణలో పోలీస్ ఆత్మహత్యలపై డీజీపీ జితేందర్ స్పందించారు. 'ఈ ఏడాది కాదు, ప్రతి ఏడాది ఏదో ఒక కారణంతో సూసైడ్ చేసుకుంటున్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు, వ్యక్తిగత ఇబ్బందులు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌తో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పోలీస్ శాఖ పరంగా ఎలాంటి సమస్యలు లేవు. చాలా చోట్ల వ్యక్తిగత కారణాలతోనే బలవన్మరణాలు జరుగుతున్నాయి. పోలీసులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాం. సంధ్య థియేటర్ ఘటన కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్‌పైనా విచారణ సాగుతోంది. ఈ కేసులో సీబీఐకి లేఖ రాశాం. ప్రభాకరరావును అమెరికా నుంచి ఇండియాకు రప్పించేందుకు ఇప్పటికే  ఇంటర్ పోల్ సాయం తీసుకుంటున్నాం. హైదరాబాద్ తీసుకొచ్చేందకు టైం పడుతుంది.' అని పేర్కొన్నారు.

సోషల్ మీడియాపై స్పెషల్ మానిటరింగ్..

సోషల్ మీడియాపై ప్రత్యేక మోనిటరింగ్ ఏర్పాటు చేశామని.. అనధికార ప్రైవేటు ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు. 'సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పేరుతో సోసల్ మీడియా ప్రచారాలపై దర్యాప్తు చేస్తాం. కేసులు పోలీసులు మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సైబర్ క్రైమ్ కేసులు ఏమున్నా 1930కి కాల్ చేసి ఫిర్యాదు చెయ్యండి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 43.33 శాతం సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయి. 25,184 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా.. రూ.247 కోట్లు ఫ్రీజ్ చేశాం.' అని వివరించారు.

తగ్గిన రోడ్డు ప్రమాదాలు

ఈ ఏడాది ముగ్గురికి న్యాయస్థానాలు మరణ శిక్ష విధించాయని.. హైదరాబాద్ ఇద్దరు, సంగారెడ్డి ఒక కేసులో మరణ శిక్ష విధించినట్లు డీజీపీ చెప్పారు. 'ఈ ఏడాది  రౌడీ షీటర్లకు 18 కేసుల్లో 35 మందికి జీవిత ఖైదు విధించారు. అత్యాచారం కేసుల్లో ఈ ఏడాది 3 కేసుల్లో నలుగురికి జీవిత ఖైదీ విధింపు. మహిళలపై దాడులకు సంబంధించి 51 కేసుల్లో 70 మందికి జీవిత ఖైదు విధించారు. పొక్సో కేసులు 77 నమోదు కాగా 82 మందికి శిక్ష ఖరారైంది. ఫింగర్ ప్రింట్స్ టీమ్ 507 కేసులు ఛేదించారు. 71 గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించారు. షీ టీమ్స్ 10,862 పబ్లిక్ ప్రదేశాల్లో వేదింపులు ఫిర్యాదులు, అందులో 830 FIRలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 27 భరోసా సెంటర్లు ఏర్పాటు చేశాం. గతేడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. ఈ ఏడాది 20,702 రోడ్డు ప్రమాదాలు, కొత్తగా 11,64,645 సీసీ కెమెరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశాం.' అని వివరించారు.

Also Read: New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP: 'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
Fake Court Order Scam: మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
Anantapur News: అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP: 'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
Fake Court Order Scam: మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
Anantapur News: అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
China Bullet Train: ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Embed widget