Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Melbourne Test: బాక్సింగ్ డే టెస్టులో ఇప్పటికే భారత్‌పై భారీ ఆధిక్యాన్ని ఆసీస్ సాధించింది. మ్యాచ్‌లో ఒక్కరోజు మిగిలి ఉన్న నేపథ్యంలో ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
BGT 2024 Updates: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (బీజీటీ) ఆసక్తికరంగా సాగుతోంది. టెయిలెండర్ల పోరాటంలో ఆదివారం నాలుగోరోజు ఆసీస్ మంచి పొజిషనలో నిలిచింది. ఆట ముగిసే సమయానికి 228/9 చేసిన ఆసీస్.. ప్రస్తుతం 333 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే ఇప్పటివరకు మెల్బోర్న్ క్రికెట్ మైదానం (ఎంసీజీ)లో నమోదైన అత్యధిక పరుగుల ఛేదన కేవలం 332 పరుగులే కావడం విశేషం. 1928లో ఆసీస్ పై ఇంగ్లాండ్ ఈ ఘనత సాధించింది. ఇప్పటికే లీడ్ చాలా రావడంతోపాటు మరో వికెట్ కూడా ఉండటంతో నాలుగో టెస్టులో ఆసీస్ భారీ టార్గెట్ ను భారత్ ముందుంచే అవకాశముంది.
That's Stumps on Day 4
— BCCI (@BCCI) December 29, 2024
Australia reach 228/9 and lead by 333 runs
Updates ▶️ https://t.co/njfhCncRdL#TeamIndia | #AUSvIND pic.twitter.com/Gw8NbCljL7
2020లో టార్గెట్ ఛేజ్ చేసిన టీమిండియా..
ఇక ఈ వేదికపై భారత్ ఛేదించిన అత్యధిక టార్గెట్ ఏమిటంటే 70 పరుగులే కావడం విశేషం.2020లో భారత్ ఈ టార్గెట్ ను ఛేదించి, సిరీస్ లో ఆధిక్యాన్ని సాధించింది. అల్టిమేట్ గా సిరీస్ దక్కించుకోవడంతో కీలకపాత్ర ఈ విజయం పోషించింది. అయితే ఈసారి మాత్రం భారీ టార్గెట్ కళ్ల ముందు ఉండటంతో భారత బ్యాటర్లు ఛేదిస్తారా...? లేక మరోసారి షరామాములుగానే బ్యాట్లు ఎత్తేస్తారా...? అన్నది చూడాలి. ఇక ఈ మ్యాచ్ లో ఆసీస్ చివర్లో ఎందుకు డిక్లేర్ చేయలనేదన్నది అసక్తి కరంగా మారింది.
ఒకరోజు సరిపోతుందనుకున్నారా..?
నిజానికి నిర్ణీత సమయానికి ముందే నాలుగో రోజు ఆటను ముగించారు. గణాంకాల ప్రకారం ఇంకా పది ఓవర్ల ఆటమిగిలి ఉంది. అయితే అంచనాలకు భిన్నంగా చివర్లో 10-15 ఓవర్ల ముంగిట ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తారని విశ్లేషకులు భావించారు. అయితే అలా కాకుండా నాలుగోరోజు మొత్తం ఆడించడంలో మతలబు ఏంటన్నది అర్థం కావడం లేదు. నిజానికి ఆటకు సోమవారం ఆఖరు రోజు. ఒక్కరోజులోనే భారత జట్టును ఆలౌట్ చేస్తామని ఆసీస్ ధీమాగా ఉందా..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇక, భారత జట్టులో నెం.8 వరకు అంటే వాషింగ్టన్ సుందర్ వరకు బ్యాటింగ్ చేయగల సమర్థులున్నారు. ఆల్రెడీ తొలి ఇన్నింగ్స్ లో ఈ దెబ్బను ఆీసస్ చవిచూసింది. అలాగే నెం.9 ఆకాశ్ దీప్ కూడా ఓ చేయి వేయగలడు. దీంతో 300 పరుగుల లోపల డిక్లేర్ చేసే సాహసానికి ఆసీస్ కెప్టెన్ కమిన్స్ పూనుకోలేదని తెలుస్తోంది. ఇక, టీమ్ లో మిషెల్ స్టార్క్ ఇప్పటికే వెన్నునొప్పితో బాధ పడుతుతున్నాడు. అందువల్ల కూడా కమిన్స్ కాస్త వెనుకడగు వేసాడేమో అని తెలుస్తోంది. ఏదేమైనా చివరిరోజు వీలైనంత ఎక్కువ పరుగులు సాధించి, భారత జట్టును ఆలౌట్ చేయాలని ఆసీస్ ఐడియాగా తెలుస్తోంది. మరి ఏం జరగుతుందన్నది రేపు తెలుస్తుంది.