అన్వేషించండి
Advertisement
Morning News Today: పెట్రోల్ దాడి విద్యార్థిని మృతి, గ్రూప్-1 పరీక్షలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు వంటి మార్నింగ్ న్యూస్
Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.
Top 10 News Today:
1. ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ విద్యార్థిని మృతి
కడప జిల్లాలో ప్రేమోన్మాది చేతిలో గాయపడిన ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిన విఘ్నేష్ అనే యువకుడు శనివారం విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. కాగా ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
2. కొడాలి నాని అడ్డాలో పవన్ మార్క్
గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తన నియోజకవర్గంలోని మూడు మండలాలకు చెందిన 43 గ్రామాల్లో తాగునీటి కలుషిత సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తెచ్చారు. సమస్య తీవ్రతను గుర్తించి శాశ్వత పరిష్కారం చూపుతామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో తాగు నీటి ప్లాంట్ల మరమ్మతులపై దృష్టిపెట్టి వాటికి సంబంధించిన అంచనాలను సత్వరమే రూపొందించాలని పనన్ అధికారులకు స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
3. విశాఖ శారదా పీఠానికి షాకిచ్చిన సర్కార్
విశాఖ శారదా పీఠానికి ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన స్థలం అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా శారదా పీఠం చేపట్టిన నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది. విశాఖలో 15 ఎకరాల స్థలం విలువ రూ.220 కోట్లు అయితే కేవలం రూ.15 లక్షల నామమాత్రపు ధరకు శారదా పీఠానికి గత ప్రభుత్వం ఇచ్చిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
4. జనసేనలోకి ముద్రగడ కూతురు
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి శనివారం జనసేన పార్టీలో చేరారు. సాయంత్రం 4 గంటలకు పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారురు. క్రాంతితో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు నుంచి పలువురు నేతలు జనసేనలో చేరారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
5. గ్రూప్-1 పరీక్షలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో గ్రూప్-1 పరీక్షల విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పరీక్షల నిర్వహణపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరగనున్నాయని, జీవో మీద అభ్యంతరాలు ఉంటే మొదట్లో చెబితే మార్చేవాళ్లమని వెల్లడించారు. కాబట్టి ఈ చివరి దశలో అర్ధాంతరంగా పరీక్షలను ఆపడం కుదరదని తేల్చి చెప్పారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
6. డబల్ బెడ్రూం ఇళ్లు అప్పుడే
తెలంగాణ ప్రభుత్వం ఇళ్లు లేని పేదలకు శుభవార్త చెప్పింది. తొలివిడతలో ప్రతి నియోజకవర్గానికి 4 వేల ఇళ్లు ఇస్తామని ఇటీవల తెలంగాణ గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల చెప్పారు. ఈ నెలాఖరుకే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేపడతామని శుభవార్త అందించారు. ఈ దీపావళి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 3,500-4,000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అర్హులైన పేదలకు పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
7. బండి సంజయ్- కేటీఆర్ మాటల యుద్ధం
కేంద్రమంత్రి బండి సంజయ్.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బండి సంజయ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఫైరయ్యారు. ‘‘బీజేపీ కేంద్ర మంత్రి, సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కుర్చీ కాపాడడానికి పడే తాపత్రయం ఏందో? ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా లేక బీజేపీ అనుబంధ ప్రభుత్వమా? . Ajab Prem Ki Ghajab Kahani’’ అని ట్వీట్ చేశారు. దీనికి బండి సంజయ్ కూడా అంతే ఘాటుగా రిప్లై ఇచ్చారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
8. వృద్ధ దంపతుల దారుణ హత్య.. నిందితుల అరెస్టు
రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యవసాయ క్షేత్రంలో వృద్ధ దంపతుల హత్య కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. మంగళవారం రాత్రి మామిడి తోటలో వృద్ధ దంపతులను దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
9. ముత్యాలమ్మ గుడి వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత
ముత్యాలమ్మ దేవాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. శనివాలం దేవాలయం వద్ద నిరసన తెలియజేసిన కొందరు ఆ పక్కనే ఉన్న మసీద్ వైపు దూసుకుపోయేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, భక్తులకు మద్య తోపులాట నెలకొంది. మరోవైపు హిందూ భక్తులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పక తప్పలేదు. మరోవైపు నేడు కూడా హిందూ సంఘాలు ఆందోళన చేసే అవకాశం ఉండడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
10. వరుణుడు కరుణిస్తాడా
గత కొంత కాలంగా స్వదేశంలో ఆధిపత్యం ప్రదర్శిస్తోన్న టీమ్‌ఇండియా ఈ సారి ఇబ్బందులు పడుతోంది. తొలి ఇన్నింగ్స్ లో దారుణంగా విఫలమైన టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో మంచి కమ్ బ్యాక్ ఇచ్చినట్లు కనిపించినా అది సరిపోలేదు. ప్రత్యర్థి న్యూజిలాండ్ ముందు కేవలం 107 పరుగుల లక్ష్యం ఉంచగలిగింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్ జట్టుకు విజయం పెద్ద కష్టమేం కాదు. కానీ, వరుణుడు వచ్చి, పోయేలా ఉంటే పరిస్థితి కాస్త కష్టంగానే ఉండచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement