KTR Vs Bandi : కేటీఆర్ ఒకటంటే బండి సంజయ్ పది అన్నారు - పొట్టు పొట్టున తిట్టేసుకున్నారు !
Telangana : కేటీఆర్ పై బండి సంజయ్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆయనకు చదువు లేదని కేటీఆర్ అనడమే సంజయ్ ఆగ్రహానికి కారణం.
Personal criticism is increasing in Telangana politics : తెలంగాణ రాజకీయాల్లో పార్టీల మధ్య పోరాటంలో రాజకీయ విమర్శలు గీత దాటిపోతున్నాయి. శనివారం హైదరాబాద్‌లో జరిగిన రాజకీయ సంఘటనల్లో కేటీఆర్, బండి సంజయ్ మధ్య వ్యక్తిగత దూషణలు చోటు చేసుకున్నాయి. ఈ విషయంలో ముందుగా కేటీఆర్ విమర్శలు వివాదాస్పదం అయ్యాయి.
కేటీఆర్‌కు చదువు లేదు, పేపర్ లీక్ చేశారన్న కేటీఆర్
బండి సంజయ్ గ్రూప్ వన్ విద్యార్థులకు మద్దతుగా అశోక్ నగర్‌లో ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు పెద్ద ఎత్తున అభ్యర్థులు హాజరయ్యారు. పోలీసులు ఆయనను బలవంతంగా అక్కడి నుంచి తరలించారారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ను ప్రభుత్వం జీవో 29 మీద చర్చలకు పిలుస్తుందన్న ప్రచారం జరిగింది. దీనిపై కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్‌కు చదువు లేదని . . ఆయనకు గ్రూప్ వన్ అభ్యర్థుల సమస్యల గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కలిసి నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. బండి సంజయ్ చదువుకోలేదు..పేపర్ లీక్ చేసిన చరిత్ర ఉందన్నారు.
రేవంత్ సవాల్‌పై స్పష్టత ఇవ్వని బీఆర్ఎస్ - మూసీపై అసెంబ్లీ చర్చకు సిద్ధం కాదా ?
తీవ్రంగా విరుచుకుపడిన బండి సంజయ్
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు. తాను సమస్యలపై పోరాడుతూంటే తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తరవాత తాను కూడా వ్యక్తిగత విమర్శలు చేశారు. కేటీఆర్ వల్లనే కేసీఆర్ బయటకు రావడం లేదన్నారు. థూ..నీది ఓ బతుకేనా అని కూడా ప్రశ్నించారు. నీళ్లు లేని బావిలో దూకాలని సలహా ఇచ్చారు. బండి సంజయ్ పేపర్ లీక్ చేసిండు అని ప్రమాణం చేస్తారా అని సవాల్ చేశారు. కేటీఆర్ పిచ్చి వాగుడు వాగుతున్నాడని.. కేటీఆర్-రేవంత్ రెడ్డి ఒకటే అన్నారు. నువ్వు రేవంత్ రెడ్డి ఒక్కటి కాకుంటే.. ఫామ్ హౌస్ ఎందుకు కూలగొట్టలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేటీఆర్ చీకటి బ్రతుకు నాకు తెలియదా కేటీఆర్ డ్రగ్స్ కేసు ఏమైంది అని ప్రశ్నించారు.
అది బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ ప్రాజెక్ట్ - రేవంత్ కు కేటీఆర్ కౌంటర్ ప్రజెంటేషన్ !
హరీష్ రావు - రేవంత్ మధ్య మాటల యుద్ధం
మరోవైపు హరీష్ రావు, రేవంత్ మధ్య కూడా మాటల యుద్ధం నడిచింది. నేను మంత్రి అయితే నా కారు ముందు రేవంత్ డాన్స్ చేసిండు, నా వెనుక నిలబడి టీవీల్లో కనబడేందుకు నక్కి నక్కి చూసిండని రేవంత్ శుక్రవారం నిర్వహించిన ప్రెస్మీట్ లో విమర్శలు గుప్పించారు.దానికి రేవంత్ శనివారం కౌంటర్ ఇచ్చారు. నేను చూసి ఉండొచ్చు. కానీ నీలాగా దొంగతనంగా చేయలే. నా ఇంటి ముందు చేతులు కట్టుకుని నిలబడి బిచ్చమెత్తుకున్న రోజులు మర్చిపోతవా అని ప్రశ్నించారు.
మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో ఇక ముందు కూడా వ్యక్తిగత విమర్శలు జోరందుకునే అవకాశం ఉంది.