అన్వేషించండి

KTR : అది బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ ప్రాజెక్ట్ - రేవంత్‌ కు కేటీఆర్ కౌంటర్ ప్రజెంటేషన్ !

Telangana : మూసి ప్రాజెక్టు పేరుతో లూటిఫికేషన్ చేస్తున్నారని రేవంత్‌పై కేటీఆర్ విరుచుకుపడ్డారు. మూసీ ప్రక్షాళన కేసీఆర్ ప్రారంభించారన్నారు. తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

KTR On Revanth :    మూసీని మురికి కూపంగా మార్చింది గత ప్రభుత్వాలేనని అవి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలేనని కేటీఆర్ అన్నారు.  సింహ‌భాగం కాంగ్రెస్ ప్ర‌భుత్వానిది అయితే..   కొద్దిభాగం టీడీపీ ప్ర‌భుత్వానికి కూడా ద‌క్కుతుంద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మూసీపై కేటీఆర్ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. 1908లో వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు మోక్ష‌గుండం విశ్వేశ్వ‌ర‌య్య‌ డిజైన్ చేసిన రిజ‌ర్వాయ‌ర్లు, పార్కులు త‌ప్ప కేసీఆర్ వ‌చ్చేదాకా ఏ ప్ర‌భుత్వం కూడా మూసీ ప్రక్షాళన ప్రయత్నాలు చేయలేదన్నారు. 

మూసీ ప్రక్షాళన కేసీఆర్ ప్రణాళిక 

కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చాక సెంట్ర‌ల్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు రిపోర్టు తెప్పించుకున్నామని.. బీవోడీ, సీవోడీ ఈ రెండింటిలో కూడా మూసీ ప్ర‌మాద‌భ‌రిత‌మైన స్థాయిలో ఉంద‌ని రిపోర్టు వచ్చిందని కేటీఆర్ చెప్పారు.  కేసీఆర్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో అక్క‌డ ఉండే ప‌రిస్థితుల‌ను అధ్య‌య‌నం చేసి పున‌రుజ్జీవం, సుంద‌రీక‌ర‌ణ చేసే విధంగా సంక‌ల్పించామన్నారు.  సీఎం రేవంత్ రెడ్డి దాదాపు రెండున్న‌ర గంట‌ల పాటు తాను ఏదో విజ్ఞాన ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నాన‌ని అనుకుని  తన పరువు తీసుకున్నారని కేటీఆర్ సెటైర్ వేశారు. ఆయన చెప్పినవన్నీ అవాస్తవాలేనన్నారు.   

మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్

మూసి లూటిఫికేషన్ ప్రాజెక్ట్                                

రేవంత్ ప్రభుత్వం  మూసీ లూటిఫికేష‌న్ అని ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైపోయిందన్నారు.  పాపం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని చెప్పి రేవంత్ రెడ్డి త‌న త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు ప‌డుతున్నార‌ని  మూసీ ప‌రివాహ‌క ప్రాంతంలో ఎలాంటి స‌ర్వే జ‌ర‌గ‌లేదని స్పష్టం చేశారు.   స‌ర్వే జ‌ర‌గ‌లేద‌ని ప్ర‌జ‌లే చెబుతున్నారని కానీ రేవంత్ మాత్రం మూడు నెలల పాటు  స‌ర్వే చేస్తున్నామ‌ని అబ‌ద్ధాలు ఆడుతున్నారన్నారు. ఒక్క మట్టి పెళ్ల కూలగొట్టలేదని రేవంత్ అంటున్నారని కానీ   జేసీబీల‌తో, కూలీల‌ను పెట్టి ఇండ్లు కూల‌గొడుతున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో కూడా వచ్చాయన్నారు.  మూసీ ప‌రివాహ‌క ప్రాంతంలో ఇండ్ల‌ను కూలగొట్టేందుకు వ‌చ్చిన ఓ కూలీ కూడా  బాధపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వచ్చాయన్నారు. 

షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు

గ్రాఫిక్స్‌తో మాయ చేసే ప్రయత్నం                        

కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక‌త వ‌స్తున్న క్ర‌మంలో గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారని ఆరోపించారు.   ల‌క్ష‌న్న‌ర కోట్ల కుంభ‌ణానికి కాంగ్రెస్ నేత‌లు ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు.  ఆరు గ్యారెంటీల‌ను అట‌కెక్కించారు. 420 హామీల‌తో ప్ర‌జ‌ల గొంతు కోశారన్నారు.  ముఖ్య‌మంత్రి మూసీ ప్రేమంతా.. ఢిల్లీకి పంపే మూట‌ల కోస‌మే అని తేలిపోయిందన్నారు. నోట్ల ర‌ద్దు చేసిన‌ప్పుడు మోదీ చెప్పిన మాట‌ల మాదిరిగా చోటే భాయ్ రేవంత్ మూసీపై రోజుకో మాట మాట్లాడుతున్నార‌ని కేటీఆర్ విమ‌ర్శించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS: 'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
R Krishnaiah News: బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Kakinada News: కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియోబంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS: 'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
R Krishnaiah News: బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Kakinada News: కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
Amazon: ఏడాదికి రూ.2 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో కొలువు - వికారాబాద్ జిల్లా యువకుడి ఘనత
ఏడాదికి రూ.2 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో కొలువు - వికారాబాద్ జిల్లా యువకుడి ఘనత
BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Telangana Group 2 Hall Tickets 2024: తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్‌ అప్ డేట్ - హాల్‌ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్‌ అప్ డేట్ - హాల్‌ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Chennemaneni Ramesh: మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు బిగ్ షాక్ - జర్మనీ పౌరుడేనని తేల్చిచెప్పిన హైకోర్టు, రూ.30 లక్షల జరిమానా
మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు బిగ్ షాక్ - జర్మనీ పౌరుడేనని తేల్చిచెప్పిన హైకోర్టు, రూ.30 లక్షల జరిమానా
Embed widget