అన్వేషించండి

Kadapa Crime News: కడప జిల్లాలో పెట్రోల్‌ దాడికి గురైన విద్యార్థిని మృతి, గంటల వ్యవధిలో నిందితుడి అరెస్ట్

Kadapa Petrol Attack | కడప జిల్లాలో ప్రేమ పేరుతో వేధించి ఓ యువకుడు చేతిలో పెట్రోల్‌ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతిచెందింది. అయితే పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడు అరెస్టయ్యాడు.

Petrol Attack in Kadapa District | కడప: కడప జిల్లా బద్వేల్‌లో పెట్రోల్‌ దాడికి గురైన విద్యార్థిని మృతి చెందింది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తోందన్న కోపంతో ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది విఘ్నేశ్‌ శనివారం పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. అనంతరం బాధితురాలిని కడప రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడు విఘ్నేశ్‌ ను పోలీసులు గంటల వ్యవధిలో శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. 

కడప జిల్లా బద్వేలులో గోపవరం మండలంలోని సెంచరీ ప్లైవుడ్ సమీపంలో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి విఘ్నేశ్‌ అనే యువకుడు నిప్పంటించాడు. విద్యార్థినికి 80 శాతం కాలిన గాయాలు కాగా, తనకు సాయం చేయాలని ఆర్తనాదాలు చేసింది. అది గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలికి చికిత్స అందించేందుకు శనివారం నాడు కడప రిమ్స్ కు తరలించారు. మరోవైపు ఘటనపై సీఎం చంద్రబాబాబు సీరియస్ అయ్యారు. నిందితుడ్ని సాధ్యమైనంత త్వరగా అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో 4 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టి నిందితుడు విఘ్నేశ్‌ను అరెస్ట్ చేశారు. ప్రేమ వేధింపులే ఈ ఘటనకు కారణమని పోలీసులు చెబుతున్నారు.

అసలేం జరిగింది..
కడప జిల్లా బద్వేల్‌ సమీపంలోని రామాంజనేయనగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని స్థానిక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. అదే ఏరియాకు చెందిన వాడు కావడంతో విఘ్నేశ్‌తో పరిచయం ఉంది. తనను ప్రేమించాలని కొన్నేళ్ల నుంచి నిందితుడు విఘ్నేశ్ యువతి వెంట పడి వేధింపులకు గురిచేస్తున్నాడు. కొన్ని నెలల కిందట యువకుడికి వివాహం అయినట్లు సమాచారం. అయినా యువతిని ప్రేమ పేరుతో వేధిస్తూ, తనను పెళ్లి చేసుకోవాలని టార్చర్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెతో మాట్లాడాలని, రాకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేశాడు. అతడికి మరోసారి సర్దిచెబుతామని ఇంటర్ విద్యార్థిని ఆటోలో వెళ్లింది.

పై విఘ్నేశ్ అనే యువకుడు శనివారం మధ్యాహ్నం పెట్రోల్ దాడికి పాల్పడ్డాడు. విద్యార్థిని  ఆమెను సెంచరీ ఫ్లైఉడ్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి మాట్లాడదామని పిలిపించి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. హైవేపై తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని గుర్తించిన స్థానికులు కడప రిమ్స్‌కు తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బద్వేల్ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అటు, ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులతో మాట్లాడి విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. గోపవరం మండలంలోని సెంచరీ ప్లైవుడ్ సమీపంలో పొదలచాటుకు తీసుకెళ్లిన విఘ్వేశ్ మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, అందుకు విద్యార్థిని నిరాకరించింది. ఆవేశానికి లోనైన నిందితుడు విఘ్నేశ్ ప్లాన్ ప్రకారం తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ విద్యార్థినిపై పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడి నుంచి ప్రేమోన్మాది పరారయ్యాడు.

Also Read: Hyderabad Crime: వివాహిత మీద కన్నేసి చివరికి దారుణం, బాలిక హత్య కేసు ఛేదించిన సూరారం పోలీసులు

బాధితురాలి తల్లిదండ్రుల ఆవేదన
8వ తరగతి నుంచే తమ కుమార్తెను ప్రేమ పేరుతో నిందితుడు విఘ్నేశ్  వేధిస్తున్నాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. కొన్ని నెలల కిందట అతడికి వివాహమైనా కూడా వేధింపులు ఆపలేదన్నారు. చనిపోతానంటూ బ్లాక్ మెయిల్ చేసి రప్పించి తన కుమార్తెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న సమయంలో జిల్లా జడ్జి శనివారం నాడు బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. భార్య వద్దు, నువ్వే కావాలంటూ వేధించాడని.. బ్లాక్ మెయిల్ చేసి రప్పించుకుని తనను పెళ్లి చేసుకోవాలని వేధించినట్లు బాధితురాలు తెలిపింది. పెళ్లికి నిరాకరించడంతో పెట్రోల్ పోసి లైటర్‌తో నిప్పంటినట్లు విద్యార్థిని స్టేట్మెంట్ ఇచ్చింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Rohit Sharma: రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
NITW: వరంగల్ నిట్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా
NITW: వరంగల్ నిట్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Embed widget