అన్వేషించండి
Advertisement
Morning News: డీఎస్సీ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా, రెండు రాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా- మార్నింగ్ టాప్ న్యూస్
Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.
Top 10 News today :
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల నగారా
మరో రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంంబంధించిన షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం ఈ మధ్యాహ్నం ప్రకటించనుంది. అప్పటి నుంచి ఆ రెండు రాష్ట్రాల్లో కోడ్ అమలులోకి వస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
డీఎస్సీ అభ్యర్థులకు షాక్
డీఎస్సీ 2024లో నియామకపత్రాలు తీసుకున్న అభ్యర్థులకు విద్యాశాఖాధికారులు షాక్ ఇచ్చారు. పోస్టింగ్ ఇచ్చేందుకు నిర్వహించే కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కొత్త తేదీలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఫ్లెక్లీలపై ఫొటోలు ఉండాల్సిందే
ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండగ కార్యక్రమం గ్రామాల్లో ఉన్న మౌలిక వసతుల కొరత తీర్చే పనిలో పడింది. ఈ నేపధ్యంలో అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఇప్పటి వరకు తన దృష్టికి వచ్చిన చిన్న చిన్న వివాదాలను పరిష్కరించాలని సూచించారు. పల్లె పండుగ వారోత్సవాలకు సంబంధించిన ప్రతి ఫ్లెక్సీ, వాల్ పెయింట్, సిటిజన్ నాలెడ్జ్ బోర్డులపైన కచ్చితంగా మోడీ ఫొటోతోపాటు సీఎం చంద్రబాబు ఫొటో కూడా ఉండాల్సిందేనంటూ ఆదేశించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

ఫాక్స్‌కాన్ కంపెనీ ఛైర్మన్‌తో సీఎం రేవంత్ రెడ్డి, చర్చలు
హైదరాబాద్ శివారు కొంగరకలాన్‌లోని ఫాక్స్ కాన్ కంపెనీని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం సందర్శించారు. తెలంగాణలో మరిన్ని విభాగాల్లో పెట్టబడులకు ఫాక్స్ కాన్ ప్రతినిధులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియూతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రాష్ట్రంలో ఫాక్స్ కాన్ కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో అన్ని విధాలుగా సహకరిస్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి
ఏపీలో లిక్కర్ షాపుల కేటాయింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారులు లాటరీ ప్రక్రియ నిర్వహించి షాపులను కేటాయించారు. మొత్తం 3,396 షాపులకు 89,882 దరఖాస్తులు రాగా డ్రా ద్వారా దుకాణాల కేటాయింపు సాగింది. ఈ నెల 16 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ.1797.64 కోట్ల ఆదాయం వచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ప్రజా పోరాటలకు బీఆర్‌ఎస్ సిద్ధం
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాపోరాటాలు ప్రారంభించాలని బీఆర్ఎస్ ప్రణాళిక రచిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చడం లేదని. ఆరు గ్యారంటీలను అరకొరగా అమలు చేస్తున్నారని గులాబీ పార్టీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. రుణమాఫీపై కూడా విమర్శలు చేస్తోంది. అన్నింటినీ కలిపి ఒకే సారి భారీ పోరాటం చేయాలని భావిస్తోంది. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటి ఎదుట ధర్నా చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
అత్తాకోడళ్లపై అత్యాచారంపై చంద్రబాబు కీలక నిర్ణయం
ఏపీలో మహిళలపై నేరాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. నిందితులకు తక్షణం శిక్షలు పడేలా చేయాల్సిన అవసరం ఉందని భావించిన చంద్రబాబు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి కేసును విచారించాలని సూచించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
రాడార్ కేంద్రంపై అసత్య ప్రచారాలు
భారత నావికా దళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంపిక చేసుకుంది. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ను వికారాబాద్ మండలం పూడూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పుడీ నిర్మాణంపై కొంత మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ స్టేషన్ ఏర్పాటుకు ఫారెస్ట్‌లోని 12 లక్షల మెుక్కలు నరికివేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అటవీ సంపద, వన్యప్రాణులకు ముప్పు పొంచి ఉందని.. రేడియేషన్ ఉంటుందని కూడా చెబుతున్నారు. కానీ 12 లక్షల చెట్లను తొలగిస్తారనే వార్తలను పూర్తి అవాస్తమని అటవీ శాఖ స్పష్టం చేస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఏపీలో 3 జిల్లాల్లో అలర్ట్ , తెలంగాణలో అక్కడక్కడా వానలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దశగా కదులుతూ.. మఅలాగే కదులుతూ దక్షిణ బంగాళాఖాతము మరికొన్ని గంటల్లో చేరనుంది. దీంతో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్‌లో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈరోజు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
నోరు పారేసుకున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో
దౌత్య వేత్తల ఉపసంహరణాలతో భారత్, కెనడా మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి.. సోమవారం ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించింది. ఇది కాకుండా, కెనడా నుంచి హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలు, అధికారులను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనీపై స్పందించిన ట్రూడో కెనడా ప్రధానమంత్రిగా తన దేశ పౌరుల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడను స్పష్టం చేశారు. భారత్ చేసిన తప్పులు కారణంగానే ఈ ఉద్రిక్తతలు ఏర్పడ్డాయన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

కెనడా ఇక ఖలిస్థాన్ సపోర్టర్లదేనా ?
ఓ ఖలీస్థానీ సపోర్టర్ హత్యను భారత్‌కు ముడిపెడుతూ కెనడా ప్రధాని చేస్తున్న రాజకీయం ఉద్రిక్త పరిస్థితుల్ని పెంచుతోంది. ఇప్పటివరకు పాకిస్తాన్ తో తప్ప వేరే ఏ దేశం తోనూ వైరం లేని భారత్ ను వివాదానికి రమ్మని కాలు దువ్వుతోంది కెనడా. ఇందుకు కారణం కెనడాలో లో అత్యంత ప్రభావశీలంగా అభివృద్ధి చెందుతున్న సిక్కు ఓటర్లే. ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
ల్యాప్‌టాప్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement