అన్వేషించండి

Revanth Reddy: ఫాక్స్‌కాన్ పనులను పర్యవేక్షించిన రేవంత్ రెడ్డి, మరిన్ని పెట్టుబుడులకు కంపెనీ ఛైర్మన్‌‌తో చర్చలు

Foxconn In Telangana | రాష్ట్రానికి వచ్చిన ప్రముఖ ప్రాజెక్టులలో ఫాక్స్ కాన్ ఒకటి. కొంగరకలాన్ లోని ఫాక్స్ కాన్ కంపెనీకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు వెళ్లి పరిశీలించారు.

Foxconn project In Kongara Kalan | హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే కంపెనీలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో సంస్థలకు ఎలాంటి అనుమానాలు అక్కరలేవన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో  కలిసి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ శివారు కొంగరకలాన్‌లోని ఫాక్స్ కాన్ కంపెనీని సోమవారం సాయంత్రం సందర్శించారు. తెలంగాణలో మరిన్ని విభాగాల్లో పెట్టబడులకు ఫాక్స్ కాన్ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

కొంగరకలాన్ లో ఫాక్స్‌కాన్ ప్రతినిధులతో సమావేశమై (Foxconn Kongara Kalan Park) కంపెనీ పురోగతి, ఇతర అంశాలను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్ లియూతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రాష్ట్రంలో ఫాక్స్ కాన్ కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో అన్ని విధాలుగా సహకరిస్తామని స్పష్టం చేశారు. 

Revanth Reddy: ఫాక్స్‌కాన్ పనులను పర్యవేక్షించిన రేవంత్ రెడ్డి, మరిన్ని పెట్టుబుడులకు కంపెనీ ఛైర్మన్‌‌తో చర్చలు

ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీలలో పెట్టుబడులకు ఆహ్వానం

ఫాక్స్ కాన్ కంపెనీ విస్తరణలో భాగంగా తెలంగాణలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని వారిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణలో పెట్టుబడులకు అవకాశం ఉన్న ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఫాక్స్ కాన్ ప్రతినిధులను కోరారు. కొంగరకలాన్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఆయన వెంట మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ ఐటీ విభాగం ఉన్నతాధికారులు, ఫాక్స్‌కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. 

కాగా, ఫాక్స్‌కాన్ కంపెనీ 2023లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. కొంగర్‌కలాన్‌లో 250 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ కంపెనీని ఏర్పాటు చేయడానికి ఫాక్స్‌కాన్ గతంలోనే నిర్ణయం తీసుకుంది. తద్వారా వేల నుంచి దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు రానున్నాయని స్వయంగా ఫాక్స్ కాన్ సీఈఓ యంగ్ లియు ఓ సందర్భంలో వెల్లడించారు.

Also Read: Telangana News: దసరా పండుగకు ఆర్టీసీ టికెట్ చార్జీలు పెంచలేదు - ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన 

యాపిల్ ఐఫోన్లు తయారుచేసే సంస్థ ఫాక్స్ కాన్

2023 మార్చిలో తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లుగా  ఫాక్స్ కాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎలక్ట్రానిక్ డివైజ్‌లు, ఉపకరణాలు తయారు చేసే సంస్థ సంబంధిత  కర్మాగారాలను ఏర్పాటు చేసి, ఒక లక్ష ఉద్యోగాలను కల్పిస్తామనే హామీతో రాష్ట్ర ప్రభుత్వంతో అప్పట్లోనే అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దశలవారీగా ఉద్యోగాలు కల్పించనుంది. యాపిల్ ఐ ఫోన్లను ఫాక్స్‌కాన్ సంస్థ తయారు చేస్తుంది. వీరి ప్రధాన క్లైంట్స్ లో గూగుల్,  అమెజాన్, అలీబాబా గ్రూప్, షియోమి, సీస్కో, మైక్రోసాఫ్ట్, నోకియా డెల్, ఫేస్‌బుక్‌, సోని వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. అమెరికా, యూరప్, చైనా, వియత్నాం, థాయ్‌లాండ్, మలేషియా, భారత్ సహా 24 దేశాలలో ఫాక్సాకాన్ సంస్థలున్నాయి. భారత్ విషయానికి వస్తే తెలంగాణ (కొంగర కలాన్), ఏపీ (శ్రీ సిటి), కర్ణాటకలో (బెంగళూరు), తమిళనాడు (శ్రీ పెరంబుదూర్)లో ఫాక్స్‌కాన్  సంస్థకు కర్మాగారాలు ఉన్నాయి.

Also Read: Mogilaiah Land Issue: పద్మశ్రీ మొగులయ్యకి అండగా నిలిచిన రాచకొండ కమిషనర్, సమస్య పరిష్కరిస్తానని హామీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: ఫాక్స్‌కాన్ పనులను పర్యవేక్షించిన రేవంత్ రెడ్డి, మరిన్ని పెట్టుబుడులకు కంపెనీ ఛైర్మన్‌‌తో చర్చలు
ఫాక్స్‌కాన్ పనులను పర్యవేక్షించిన రేవంత్ రెడ్డి, మరిన్ని పెట్టుబుడులకు కంపెనీ ఛైర్మన్‌‌తో చర్చలు
YS Jagan: లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు అడ్డాగా ఏపీ! చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ 6 ప్రశ్నలు
లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు అడ్డాగా ఏపీ! చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ 6 ప్రశ్నలు
Jani Master News: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన పోక్సో కోర్టు, కారణం ఏంటంటే!
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన పోక్సో కోర్టు, కారణం ఏంటంటే!
Pushpa 2 First Review: ‘పుష్ఫ 2’ ఫస్టాఫ్ ఆ రేంజ్‌లో - మైండ్ బ్లోయింగ్ రివ్యూ ఇచ్చిన దేవిశ్రీ!
‘పుష్ఫ 2’ ఫస్టాఫ్ ఆ రేంజ్‌లో - మైండ్ బ్లోయింగ్ రివ్యూ ఇచ్చిన దేవిశ్రీ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వీడియో: నేను టెర్రరిస్టునా? నన్నెందుకు రానివ్వరు? రాజాసింగ్ ఆగ్రహంవీడియో: నా శవం మీద సెటిల్ చేసుకోండి, సికింద్రాబాద్‌లో మాధవీలత అరెస్ట్Vivek Venkata Swamy: వివేక్‌కు కేబినెట్ బెర్త్ ఖాయమా? చెన్నూర్ ఎమ్మెల్యేతో ఫేస్ 2 ఫేస్సల్మాన్‌ను చంపితే లారెన్స్ బిష్ణోయ్‌కు వచ్చే ప్రయోజనం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: ఫాక్స్‌కాన్ పనులను పర్యవేక్షించిన రేవంత్ రెడ్డి, మరిన్ని పెట్టుబుడులకు కంపెనీ ఛైర్మన్‌‌తో చర్చలు
ఫాక్స్‌కాన్ పనులను పర్యవేక్షించిన రేవంత్ రెడ్డి, మరిన్ని పెట్టుబుడులకు కంపెనీ ఛైర్మన్‌‌తో చర్చలు
YS Jagan: లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు అడ్డాగా ఏపీ! చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ 6 ప్రశ్నలు
లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు అడ్డాగా ఏపీ! చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ 6 ప్రశ్నలు
Jani Master News: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన పోక్సో కోర్టు, కారణం ఏంటంటే!
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన పోక్సో కోర్టు, కారణం ఏంటంటే!
Pushpa 2 First Review: ‘పుష్ఫ 2’ ఫస్టాఫ్ ఆ రేంజ్‌లో - మైండ్ బ్లోయింగ్ రివ్యూ ఇచ్చిన దేవిశ్రీ!
‘పుష్ఫ 2’ ఫస్టాఫ్ ఆ రేంజ్‌లో - మైండ్ బ్లోయింగ్ రివ్యూ ఇచ్చిన దేవిశ్రీ!
Tata Punch EV Offers: టాటా బెస్ట్ బడ్జెట్ ఈవీ కారు - రూ.2 లక్షలు కట్టి తీసుకెళ్లపోవచ్చు!
టాటా బెస్ట్ బడ్జెట్ ఈవీ కారు - రూ.2 లక్షలు కట్టి తీసుకెళ్లపోవచ్చు!
Best Budget Compact Cars: రూ.10 లక్షల్లోపు చిన్న కార్లలో బెస్ట్ ఇవే - సిటీ డ్రైవ్‌కు కరెక్ట్ ఆప్షన్స్!
రూ.10 లక్షల్లోపు చిన్న కార్లలో బెస్ట్ ఇవే - సిటీ డ్రైవ్‌కు కరెక్ట్ ఆప్షన్స్!
AP Sand Policy : ఉచిత ఇసుక ఇస్తున్నా విమర్శలు - శాండ్ పాలసీ విషయంలో ఏపీ ప్రభుత్వం తేలిపోయిందా ?
ఉచిత ఇసుక ఇస్తున్నా విమర్శలు - శాండ్ పాలసీ విషయంలో ఏపీ ప్రభుత్వం తేలిపోయిందా ?
BSNL Best Prepaid Plan: 210 జీబీ డేటా, 105 డేస్ వ్యాలిడిటీ - తక్కువ ధరకే బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్!
210 జీబీ డేటా, 105 డేస్ వ్యాలిడిటీ - తక్కువ ధరకే బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్!
Embed widget