IPPB: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వివరాలు ఇలా
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(IPPB) ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

India Post Payments Bank Limited Recruitment: న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(IPPB) కాంట్రాక్ట్ ప్రాతిపదికన సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 51 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ కలిగిన అభ్యర్థులు దరఖాప్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు స్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.150. ఇతర అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. సరైన అర్హతలున్నవారు మార్చి 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగ ఎంపికచేస్తారు.
వివరాలు..
* ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 51
రిజర్వేషన్: యూఆర్- 13, ఈడబ్ల్యూఎస్- 03, ఓబీసీ- 19, ఎస్సీ- 12, ఎస్టీ- 04.
సర్కిల్/రాష్ట్రాల వారీగా ఖాళీలు..
⏩ ఛత్తీస్‌గఢ్ సర్కిల్
➥ ఛత్తీస్‌గఢ్: 03 పోస్టులు
⏩ అస్సాం సర్కిల్
➥ అస్సాం: 03 పోస్టులు
⏩ బీహార్ సర్కిల్
➥ బీహార్: 03 పోస్టులు
⏩ గుజరాత్ సర్కిల్
➥ గుజరాత్: 06 పోస్టులు
⏩ హర్యానా సర్కిల్
➥ హర్యానా: 01 పోస్టు
⏩ జమ్మూ & కాశ్మీర్ సర్కిల్
➥ జమ్మూ & కాశ్మీర్: 02 పోస్టులు
⏩ కేరళ సర్కిల్
➥ లక్షద్వీప్: 01 పోస్టు
⏩ మహారాష్ట్ర సర్కిల్
➥ మహారాష్ట్ర: 03 పోస్టులు
➥ గోవా: 01 పోస్టు
⏩ నార్త్ ఈస్ట్ సర్కిల్
➥ అరుణాచల్ ప్రదేశ్: 03 పోస్టులు
➥ మణిపూర్: 02 పోస్టులు
➥ మేఘాలయ: 04 పోస్టులు
➥ మిజోరం: 03 పోస్టులు
➥ నాగాలాండ్: 05 పోస్టులు
➥ త్రిపుర: 03 పోస్టులు
⏩ పంజాబ్ సర్కిల్
➥ పంజాబ్: 01 పోస్టు
⏩ రాజస్థాన్ సర్కిల్
➥ రాజస్థాన్: 01 పోస్టు
⏩ తమిళనాడు సర్కిల్
➥ తమిళనాడు: 02 పోస్టులు
➥ పుదుచ్చేరి: 01 పోస్టు
⏩ ఉత్తర ప్రదేశ్ సర్కిల్
➥ ఉత్తరప్రదేశ్: 01 పోస్టు
⏩ ఉత్తరాఖండ్ సర్కిల్
➥ ఉత్తరాఖండ్: 02 పోస్టులు
అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ ఉండాలి. దరఖాస్తు చేసుకున్న రాష్ట్రంలో నివాసం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
వయోపరిమితి: 1.03.2025 నాటికి 21 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులు-జనరల్-10 సంవత్సరాలు, దివ్యాంగులు-జనరల్-13 సంవత్సరాలు, దివ్యాంగులు-జనరల్-15 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు కేంద్రప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు రూ.150. ఇతరులకు రూ.750.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
జీతం: నెలకు రూ.30,000.
ఒప్పంద వ్యవధి: 01 సంవత్సరం ఉంటుంది. ఉద్యోగుల సంతృప్తికరమైన పనితీరును బట్టి 2 నుంచి 3 సంవత్సరాలు పొడిగించవచ్చు.
ముఖ్యమైన తేదీలు..
✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.03.2025
✦ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 21.03.2025.
✦ దరఖాస్తు సవరించడానికి చివరి తేదీ: 21.03.2025.
✦ ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు తేదీలు: 01.03.2025 నుంచి 21.03.2025.
✦ దరఖాస్తును ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ: 05.04.2025..





















