Canada Issue : కెనడా ఇక ఖలిస్థాన్ సపోర్టర్లకు మాత్రమేనా ? ఇతర భారతీయులు వెనక్కి రావాల్సిందేనా ?
Canada And india : కెనడా ఇక ఖలిస్తాన్ సపోర్టర్లకు కేంద్రంగా మారుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఓ ఖలీస్థానీ సపోర్టర్ హత్యను భారత్‌కు ముడిపెడుతూ కెనడా ప్రధాని చేస్తున్న రాజకీయం హాట్ టాపిక్ అవుతోంది.
Will Canada become a hub for Khalistan supporters : ప్రపంచ దేశాల్లో భారత్ పాకిస్తాన్‌తో తప్ప ఏ దేశంతోనూ ఉద్రిక్త పరిస్థితుల్ని ఏర్పరుచుకోలేదు. దౌత్యవేత్తలపై కేసులు పెట్టేంత వరకూ వెళ్లలేదు. కానీ భారత్ సన్నిహిత మిత్రదేశంగా ఉన్న కెనడా ఇప్పుడు హద్దులు దాటిపోతోంది. భారత్ పై విషం చిమ్మడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. కెనడాలో ఉంటూ భారత్ ను విభజించేలా ఖలిస్తాన్ వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించే వారిని కెనాడ వెనకేసుకు వస్తోంది. కెనడాలో హర్దిప్ సింగ్ నిజ్జర్ అనే ఖలీస్థానీ ఉగ్రవాది హత్యకు గురైతే.. ఆ నెపాన్ని భారత్‌పైకి నెట్టేస్తోంది కెనడా. తాజాగా భారత హైకమినషనర్‌ను అందులో అనుమానితుడిగా చేర్చడంతో సమస్య జఠిలం అయింది. కెనడా ప్రధాని ఇలా ఎందుకు చేస్తున్నారంటే అక్కడ ఉన్న సిక్కు ఓటర్ల కోసమే.
రెండు దశాబ్దాల్లో పెరిగిన సిక్కుల ప్రాబల్యం
కెనడాలో అత్యంత ప్రభావశీలంగా అభివృద్ధి చెందుతున్న జాబితాలో సిక్కులు మొదటి స్థానంలో ఉంటారు. కెనడా పౌరుల్లో నాలుగు శాతం సిక్కులు ఉంటారు. పంజాబీ భాష కెనడాలో మూడో పాపులర్ భాష. అక్కడ వీరు అంతా కొన్ని ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంటారు. అదే వీరి బలంగా మారింది. ఒంటారియో, బ్రిటీష్ కొలంబియా, అల్బెర్టా నగరాల్లో వీరే మెజార్టీ. కేవలం ఉపాధి కోసం వెళ్లడం కాదు .. వ్యాపారాల్లో స్థిరపడిపోయారు. కెనడా ఆర్థిక వ్యవస్థలో వీరి ప్రాధాన్యత కాదనలేనిది. 20 ఏళ్ల నుంచి కెనడాలో సిక్కు జనాభా ఊహించనంతగా పెరిగింది.
ట్రంప్‌పై మూడోసారి హత్యాయత్నం- ఫేక్ ప్రెస్ కార్డుతో తుపాకీ నిండా బుల్లెట్లుతో వచ్చిన వ్యక్తి అరెస్టు
కెనడా అధ్యక్ష పీఠాన్ని నిర్ణయించే స్థాయికి సిక్కు ఎంపీలు
కెనడా పార్లమెంట్‌లో మొత్తం 388 ఎంపీలు ఉన్నారు. వీరిలో 18 మంది ఎంపీలు పూర్తిగా సిక్కు వర్గానికి చెందినవారు ఉన్నారు. అందులో ఎనిమిది సీట్లలో పూర్తిగా సిక్కులే పోటీ చేస్తూంటారు. మరో 15 సీట్లలో తమ ప్రభావం చూపుతున్నారు. ఈ కారణంగానే ఏ రాజకీయ పార్టీలు సిక్కులకు ఇంతటి ప్రాధాన్యత ఇస్తూంటాయి. ఇంకా చెప్పాలంటే ప్రస్తుత ప్రధాని ట్రూడో సిక్కు ఎంపీల మద్దతుతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.
ఖలిస్తాన్‌ను సమర్థించే పార్టీ మద్దతుతోనే ట్రూడో ప్రభుత్వం
కెనడాలో సిక్కులకు ప్రత్యేకంగా పార్టీ ఉంది. దాని పేరు న్యూ డెమెక్రాటిక్ పార్టీ . జగ్మత్ సింగ్ అనే నాయకుడి నేతృత్వంలో ఉన్న న్యూ డమెక్రాటిక్ పార్టీ ఖలిస్థాన్ వేర్పాటువాదానికి అండదండలు అందిస్తోంది. జస్టిన్ ట్రూడో భారత వ్యతిరేక ప్రకటనలు చేయడం వెనక ఆయనకు మద్ధతు తెలుపుతున్నఈ పార్టీ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ట్రూడో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మరోసారి ఎన్నికల్లో ఆయన గెలవడం అసాధ్యమన్న రిపోర్టులు వస్తున్నాయి. దీంతో సిక్కుల్ని .. ముఖ్యంగా ఖలీస్థానీ ఉగ్రవాదానికి మద్దతుగా ఉంటున్న న్యూ డెమెక్రాటిక్ పార్టీ మద్దతు ఉంటేనే మరోసారి ట్రూడో ప్రధాని ఆశలు ఉంటాయి. అందుకే ఆయన నిస్సంకోచంగా భారత్ పై బురద చల్లేస్తున్నారు.
హుదూద్ కంటే వంద రెట్ల విధ్వంసం సృష్టించిన మిల్టన్ - ఫ్లోరిడా పరిస్థితి ఎలా ఉందో చూశారా ?
సిక్కులు కాకుండా ఇతర భారతీయులపై ప్రభావం
కెనడాకు ఇటీవలి కాలంలో భారతీయులు పెద్ద సంఖ్యలో వెళ్లారు. ఖలీస్థానీ వేర్పాటువాదానికి కెనడా నుంచి మద్దతు పలుకుతున్న చర్యలు, అక్కడి ప్రభుత్వ తీరు వల్ల భారతీయుల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. గత ఏడాది ఏకంగా వీసాలను నిలిపివేసే పరిస్థితి వచ్చింది. ఈ సారి ఎక్కడి వరకూ సమస్య వెళ్తుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతోంది.