మేం సపోర్ట్ ఆపేస్తే రెండు వారాల్లో నువ్వు ఫినిష్- అయినా సంతకం పెట్టను..
మేం సపోర్ట్ ఆపేస్తే రెండు వారాల్లో నువ్వు ఫినిష్- అయినా సంతకం పెట్టను..
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని వైట్ హౌస్‌కు రప్పించి బెదిరించినంత పని చేశారు. ఓవల్ ఆఫీస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్ నేరుగా బెదిరించడం ప్రపంచమంతా చూసింది. ఉక్రెయిన్‌కు అమెరికా పెద్ద మొత్తంలో మిలిటరీ సాయం అందిస్తోందని, దీన్ని ఆపాలి లేదా ప్రతిఫలంగా ఏదైనా తీసుకోవాలని ట్రంప్ ప్రెసిడెంట్ కావడానికి ముందే అనుకుంటున్నారు. అనుకున్నట్లుగానే జెలెన్ స్కీని పిలిచి, శాంతి ఒప్పందం చేసుకోవాలని ఒత్తిడి చేశారు.
మేం సాయం చేస్తున్నా థాంక్స్ చెప్పడం లేదు. మా దగ్గర నుంచి మిలిటరీ ఎయిడ్ తీసుకుంటున్నావ్.. నువ్వు మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆహ్వానిస్తున్నావ్.. మేం లేకపోతే 15 రోజుల్లో రష్యా నిన్ను ఫినిష్ చేస్తుంది” అని బెదిరించారు. జెలెన్ స్కీ స్పందనపై ఇంకా స్పష్టత రాలేదని సమాచారం. అయితే, ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.





















