అన్వేషించండి

Ind Vs Aus Semis Rohit Comments: టాస్ ఓడ‌ట‌మే మంచిదైంది..!  బ్యాటింగ్, బౌలింగ్ లో ఏం చేయాలో అర్థం కాలేదు..:!! రోహిత్ వ్యాఖ్య‌

8 జ‌ట్లు ఆడుతున్న టోర్నీలో ఒక్క భార‌త్ మాత్ర‌మే ఇప్ప‌టివ‌ర‌కు అజేయంగా నిలిచింది. గ్రూపు ద‌శ‌లో బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ పై విక్ట‌రీ సాధించింది. ఇక హైబ్రీడ్ మోడ‌ల్లో ఈ టోర్నీ జ‌రుగుతోంది. 

ICC Champions Trophy 2025 Latest Updates: ఆస్ట్రేలియాతో సెమీస్ సంద‌ర్భంగా భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. టాస్ ఓడిపోవ‌డ‌మే మంచిదైంద‌ని వ్యాఖ్యానించాడు. దుబాయ్ లో మంగళవారం జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో మ‌ళ్లీ టాస్ ఓడిపోయాడు. అత‌నిలా టాస్ ఓడిపోవ‌డం వ‌రుస‌గా 14వ సారి కావ‌డం విశేషం. ఇక దుబాయ్ స్టేడియంలోని ర‌క‌ర‌కాల పిచ్ ల‌పై ఇప్ప‌టివ‌ర‌కు 3 లీగ్ మ్యాచ్ ల‌ను నిర్వ‌హించారు. సెమీస్ కు కూడా కొత్త ర‌కం పిచ్ ను రూపొందించారు. దీంతో సెమీస్ లో ముందు బ్యాటింగ్ చేయాలా..? ల‌క బౌలింగ్ చేయాలా... అనేది నిర్ణ‌యించుకోలేక‌పోయాయ‌ని, టాస్ ఓడిపోవ‌డ‌మే మంచిదైంద‌ని తెలిపాడు. ఇక ఈ స్టేడియంలో పిచ్ లు స్లో బౌల‌ర్ల‌ను అనుకూలంగా ఉంటున్నాయి. ముఖ్యంగా స్పిన్న‌ర్ల‌కు అనుకూలిస్తున్నాయి. న్యూజిలాండ్ తో జ‌రిగిన మ్యాచ్ లో తొమ్మిది వికెట్ల‌ను భార‌త స్పిన్న‌ర్లే తీయ‌డం విశేషం. ఇక ఈ మ్యాచ్ లోనూ పిచ్ స్పిన్న‌ర్ల‌కు అనుకూలిస్తాయ‌న్న అంచనాలు ఉన్నాయి. 

భార‌త్ గెలుస్తుంది.. 
సెమీస్ లో ఆసీస్ పై భార‌త్ గెలుస్తుంద‌ని బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా ఆశాభావం వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుత టీమ్ లో ఆట‌గాళ్లంతా మంచి ఫామ్ లో ఉన్నార‌ని, త‌ప్ప‌కుండా ఆసీస్ పై విజ‌యం సాధించాల‌ని కోరుకున్నారు. ఇప్ప‌టికే దుబాయ్ లో వ‌రుస‌గా మూడు మ్యాచ్ లు విజ‌య సాధించిన ఉత్సాహంలో ఉంద‌ని, అదే జోరులో కంగారూల‌పై కూడా గెలుస్తార‌ని పేర్కొన్నారు. ఎనిమిది జ‌ట్లు ఆడుతున్న ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీలో ఒక్క భార‌త్ మాత్ర‌మే ఇప్ప‌టివ‌ర‌కు అజేయంగా నిలిచింది. గ్రూపు ద‌శ‌లో ఆడిన బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ పై విక్ట‌రీ సాధించింది. ఇక హైబ్రీడ్ మోడ‌ల్లో ఈ టోర్నీ జ‌రుగుతుండ‌టంతో భార‌త్ ఆడే మ్యాచ్ లు ఇక్క‌డ జ‌రుగుతుండ‌గా, మిగ‌తా జ‌ట్ల మ్యాచ్ ల‌న్నీ ఆతిథ్య పాక్ లో జ‌రుగుతున్నాయి. 

నలుగురు స్పిన్న‌ర్ల‌తో..
మ్యాచ్ ముందుగా వ్యాఖ్యానించిన‌ట్లుగానే భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఈ మ్యాచ్ లో టీమిండియాను న‌లుగురు స్పిన్న‌ర్ల‌తో బ‌రిలోకి దించాడు. గత మ్యాచ్ లో ఐదు వికెట్ల‌తో స‌త్తా చాటిన వ‌రుణ్ చక్ర‌వ‌ర్తిని ఈ మ్యాచ్ లోనూ ఆడిస్తుండ‌టంతో మ‌రో పేస‌ర్ హ‌ర్షిత్ రాణాను రిజ‌ర్వ్ కే ప‌రిమితం చేసింది. ఇక ఆసీస్ జ‌ట్టులోనూ రెండు మార్ప‌లు జ‌రిగాయి. గాయం కార‌ణంగా ఓపెన‌ర్ మ‌థ్యూ షార్ట్, పేస‌ర్ స్పెన్స‌ర్ జాన్స‌న్లు ఈ మ్యాచ్ లో ఆడ‌టం లేదు. వారి స్థానంలో కూప‌ర్ క‌న్నోలీ, జాస‌న్ సంగాను తుదిజ‌ట్టులోకి తీసుకుంది. ఇక టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ టోర్నీలో అనుభవం లేని పేస‌ర్ల‌తో ఆసీస్ ఆడుతోంది. రెగ్యుల‌ర్ కెప్టెన్ పాట్ క‌మిన్స్, జోష్ హేజిల్ వుడ్, మిషెల్ స్టార్క్ గాయాల‌తో టోర్నీకి దూర‌మ‌య్యారు. 

Read Also: Ind Vs Aus Semis Updates: టీమిండియా ఫైన‌ల్ లెవ‌న్ పై రోహిత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. ఆ కూర్పుతో ఆడాల‌ని టెంప్టింగ్ ఉంద‌ని వెల్ల‌డి

 

టాప్ హెడ్ లైన్స్

IND vs BAN Tour: బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Gambhir Coach Tenure: గంభీర్ హెడ్ కోచ్ పదవికి బిగ్ ప్రొటెక్షన్.. సాకింగ్ రూమర్స్ పై బిసిసిఐ క్లారిటీ!
గంభీర్ హెడ్ కోచ్ పదవికి బిగ్ ప్రొటెక్షన్.. సాకింగ్ రూమర్స్ పై బిసిసిఐ క్లారిటీ!

వీడియోలు

Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Embed widget