Ind Vs Aus Semis Updates: టీమిండియా ఫైనల్ లెవన్ పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ కూర్బుతో ఆడాలని టెంప్టింగ్ ఉందని వెల్లడి
మూడేళ్ల కిందట టీ20 ప్రపంచకప్ లో ఆడినప్పటితో పోలిస్తే, వరుణ్ లో చాలా మెచ్యురిటీ కనిపిస్తోందని, ఈ మూడేళ్లలో చాలా దేశవాళీ మ్యాచ్ లు, టీ20, వన్డే మ్యాచ్ లు ఆడాడని రోహిత్ శర్మ గుర్తు చేశాడు.

ICC Champions Trophy 2025 Live Updates: టీమిండియా ఫైనల్ లెవన్ విషయంలో కొంచె తలనొప్పి ఉన్నప్పటికీ, ఇది చాలా మంచి పరిణామామని భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్ తో నలుగురు స్పిన్నర్లతో ఆడటంతో భారత్ 44 పరుగులతో ఘన విజయం సాధించింది. అయితే సెమీస్ లోనూ నలుగురు స్పిన్నర్లతో ఆడాలని టెంప్ట్ అవుతున్నట్లు పేర్కొన్నాడు. ముఖ్యంగా కివీస్ పై వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణించాడని, ఐదు వికెట్లతో సత్తా చాటాడని ప్రశంసించాడు. మూడేళ్ల కిందట టీ20 ప్రపంచకప్ లో ఆడినప్పటితో పోలిస్తే, తనలో చాలా మెచ్యురిటీ కనిపిస్తోందని, ఈ మూడేళ్లలో చాలా దేశవాళీ మ్యాచ్ లు, టీ20, వన్డే మ్యాచ్ లు ఆడాడని గుర్తు చేశాడు. ఆ ప్రభావం అతని బౌలింగ్ పై కనిపిస్తోందని, చాలా అక్యురేట్ గా బౌలింగ్ చేస్తున్నాడని ప్రశంసించాడు. ఇక మంగళవారం దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో భారత్ ఎలాంటి ఫైనల్ లెవన్ తో దిగుతుందనో ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది.
అందరూ ప్రశ్నించారు..
నిజానికి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఐదుగురు స్పిన్నర్లతో స్వ్కాడ్ ను ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూశారని చెప్పుకొచ్చాడు. ఒక బ్యాటర్ స్థానంలో అదనంగా స్పిన్నర్ వరుణ్ ను తీసుకోవడం ఏంటని అనుమానించారని, తమ ప్రణాళికల ప్రకారమే ముందుకు వెళ్లామని తెలిపాడు. గాయం కాకుంటే మాత్రం మొత్తం మ్యాచ్ లు ఆడే అవకాశాలు బ్యాటర్లకు ఉంటాయని, కానీ బౌలర్ల విషయం అలా కాదని వ్యాఖ్యానించాడు. కొన్నిసార్ల తగిన విశ్రాంతినివ్వాల్సిన అవసరం ఉంటుందని, రొటేషన్ చేయాల్సి ఉంటుందని తెలిపాడు.
ముందునుంచి చెబుతున్నాం..
ఇక ఈ టోర్నీలో నెం.5లో ఆడుతున్న అక్షర్ పటేల్ ను ప్రశంసలతో రోహిత్ ముంచెత్తాడు. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ప్రారంభం నుంచే నెం.5లో తనను ఆడిస్తున్నామని పేర్కొన్నాడు. ఏది ఏమైనా నెం.5లో బ్యాటింగ్ చేయనున్నట్లు తనకు భరోసా ఇచ్చినట్లు తెలిపాడు. ఈ క్రమంలోనే తనను అదే స్థానంలో ఆడిస్తున్నట్లు తెలిపాడు. ఇక కివీస్ తో మ్యాచ్ లో టాప్ త్రీ రోహిత్, విరాట్ కోహ్లీ, శుభమాన్ గిల్ విఫలమైనా, మిడిలార్డర్ రాణించింది. అనుభవజ్క్షులైన మిడిలార్డర్ భారత్ సొంతమని, కివీస్ తో మ్యాచ్ లో వాళ్లు విలువ తెలిసిందన్నాడు. ముఖ్యంగా అక్షర్, హార్దిక్, శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడటంతో భారత్ సవాలు విసరగలిగే స్కోరును సాధించింది. ఇక మంగళవారం జరిగే ఆసీస్ మ్యాచ్ లోనూ భారత్ సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక మూడు వారాలుగా జరుగుతున్న మెగా టోర్నీ తుది దశకు చేరుకుంది. తొలి సెమీస్ లో ఆసీస్ తో ఇండియా, రెండో సెమీస్ జరుగుతున్న లాహోర్ లో బుధవారం దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడనున్నాయి. సెమీస్ లో గెలిచిన ఇరుజట్లు ఈనెల 9 న జరిగే ఫైనల్లో ఆడతాయి. ఇప్పటికీ ఫైనల్ వేదిక ఖరారు కాలేదు. సెమీస్ లో ఇండియా గెలిస్తే దుబాయ్ లో ఫైనల్ లేకపోతే పాక్ లోని లాహోర్ లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.




















