Singer Kalpana Sucide Attempt: బ్రేకింగ్ న్యూస్... సూసైడ్ అటెంప్ట్ చేసిన సింగర్ కల్పన
Singer Kalpana Health Update: సింగర్ కల్పన సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడాల్సిన అవసరం ఆవిడకు ఏమి వచ్చింది? ఎందుకు ఈ పని చేశారు? అనే కారణాలు తెలియాల్సి ఉంది.

టాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీ ఒక్కసారి షాక్‌కి గురయింది. ప్రముఖ గాయని కల్పన (Singer Kalpana) ఆత్మహత్యకు పాల్పడటం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. బలవన్మరణానికి పాలు పడాల్సిన అవసరం ఆమెకు ఏం వచ్చింది? ఎందుకు ఈ పని చేశారు? అనే కారణాలు తెలియాల్సి ఉంది.
నిద్ర మాత్రలు మింగిన కల్పన
నిజాంపేటలో కల్పన నివాసం ఉంటున్నారు. ఒక గేటెడ్ కమ్యూనిటీలోని విల్లా తీసుకుని జీవిస్తున్నారు. ఆ విల్లాలో నిద్ర మాత్రలు మింగి ఆవిడ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కల్పన అపస్మారక స్థితిలో ఉన్నారని తెలిసింది. ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
చెన్నై నుంచి బయలుదేరిన భర్త... అది నిజమేనా?
కల్పన ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఆమె భర్త చెన్నైలో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. రెండు రోజలుగా విల్లా గేట్లు ఓపెన్ చేయకపోవడంతో అసోసియేషన్ సభ్యులకు సందేహం కలిగి ఆవిడకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదట. దాంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చి గేట్లు ఓపెన్ చేయగా... కల్పన అపస్మారక స్థితిలో ఉన్నారట.
వెంటిలేటర్ మీద కల్పనకు చికిత్స... పరిస్థితి విషమం!?
ప్రస్తుతం కల్పనకు వెంటిలేటర్ మీద వైద్యులు చికిత్స అందిస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆవిడ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందట. కొన్ని గంటలు గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేమని చెప్పారట.
Also Read: విజయ్ వర్మతో తమన్నా బ్రేకప్... ఆ ఒక్క పనితో అసలు విషయం వెలుగులోకి
హైదరాబాద్ సిటీలో సెటిలైన తమిళ అమ్మాయ్ కల్పన
Singer Kalpana Raghavendar Family Details: కల్పనా రాఘవేందర్ హైదరాబాద్ సిటీలో సెటిల్ అయినప్పటికీ ఆమె స్వస్థలం తమిళనాడు రాజధాని చెన్నై. చిన్నతనం నుంచి సంగీతం మీద ఆసక్తి ఉండేది. కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నారు. మలయాళ ఛానల్ ఏషియానెట్ నిర్వహించిన 'స్టార్ సింగర్' సీజన్ 5 విజేతగా నిలిచారు. ఆ షో 2010లో జరిగింది. దానికి 20 ఏళ్ళ ముందు నుంచి ఆవిడ పాటలు పాడుతున్నారు. తెలుగు 'బిగ్ బాస్' సీజన్ 1లో కూడా పార్టిసిపేట్ చేశారు. పలు సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు.
కల్పనను ఆస్పత్రికి తరలిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఆవిడ ఫేస్ చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. కల్పన ముఖం అంతలా మారిందేమిటి? అని ఆశ్చర్యపోతున్నారు. ఆవిడ త్వరగా కోలుకోవాలని పరిశ్రమ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. కల్పన ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో విల్లాలో ఇతరులు ఎవరైనా ఉన్నారా? ఆవిడ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు? పోలీసులకు కల్పన ఆత్మహత్యకు పాల్పడిన సమాచారం ఎవరు అందించారు? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు జరుగుతోందని సమాచారం అందుతుంది. ఏది ఏమైనా ప్రజెంట్ ఆవిడ సూసైట్ అటెంప్ట్ న్యూస్ అందరికీ షాక్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
Also Read: నిర్మాతగా దానయ్య కుమార్తె... బాలీవుడ్ హీరోతో సైకలాజికల్ హారర్ ఫిల్మ్... బడ్జెట్ ఎంతో తెలుసా?





















