Tamannaah Vijay Varma Breakup: విజయ్ వర్మతో తమన్నా బ్రేకప్... ఆ ఒక్క పనితో అసలు విషయం వెలుగులోకి
Tamannaah Break Up With Vijay Varma: మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ మధ్య గొడవలు వచ్చాయా? ఇప్పుడు ఇద్దరూ వేర్వేరు దారులు చూసుకున్నారా? అంటే 'అవును' అంటోంది బాలీవుడ్.

'లవ్ బర్డ్స్' అని బాలీవుడ్ కొంత మందిని మాత్రమే అంటుంది. ఆ ట్యాగ్ సొంతం చేసుకున్న కపుల్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ. అయితే ఎప్పుడు వాళ్ళిద్దరిని లవ్ బర్డ్స్ అనలేం. ఏమైందో ఏమో... తమన్నాకు విజయ్ వర్మకు మధ్య దూరం పెరిగింది. బాలీవుడ్ వర్గాలు చెబుతున్న ప్రకారం బ్రేకప్ అయ్యింది.
విజయ్ వర్మ ఫోటోలు డిలీట్ చేసిన తమన్నా!
Tamannaah deleted Vijay Varma photos: సోషల్ మీడియాలో తమన్నా చాలా యాక్టివ్. అయితే... తన పర్సనల్ ఫోటోలు షేర్ చేయడం మాత్రం చాలా తక్కువ. అందువల్లే విజయ్ వర్మతో ప్రేమలో పడినప్పుడు, కలిసి డేటింగ్ చేసినప్పుడు... వాళ్ల రిలేషన్షిప్ గురించి చాలా తక్కువ మందికి తెలిసింది.
'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్ చేసేటప్పుడు విజయ్ వర్మ, తమన్నా భాటియా ప్రేమలో పడ్డారు. అందులో ఘాటు సన్నివేశాలు కూడా చేశారు. విజయ్ వర్మ కోసం ఆన్ స్క్రీన్ లిప్ లాక్ చేయకూడదని పెట్టుకున్న రూల్ తీసి పక్కన పెట్టారు తమన్నా. రొమాంటిక్ సీన్స్ కూడా ఘాటుగా చేశారు.
'లస్ట్ స్టోరీస్ 2' సిరీస్ రిలీజ్ కావడానికి ముందు గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ వీడియో తమన్నా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో వాళ్ళు ఇద్దరు లిప్ లాక్ పెట్టుకోవడంతో ప్రేమ విషయం బయటకు వచ్చింది. ఆ తర్వాత ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపించారు. బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన ప్రేమ విషయాన్ని తమన్నా కన్ఫర్మ్ చేశారు.
ఆల్మోస్ట్ రెండేళ్లు... విజయ్ వర్మతో తమన్నా డేటింగ్ చేసిన టైం పీరియడ్. త్వరలో వీళ్ళిద్దరూ పెళ్లి పీటలు ఎక్కుతారని కూడా బాలీవుడ్ వర్గాల నుంచి వినిపించింది. ఏమైందో ఏమో... ఇప్పుడు ఇద్దరి మధ్య దూరం పెరిగింది. బ్రేకప్ జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ వర్మ ఫోటోలను తమన్నా డిలీట్ చేయడంతో ఆ సంగతి బయట పడింది. మరోవైపు అతను కూడా తమన్నా ఫోటోలు డిలీట్ చేశారు.
బ్రేకప్ అయినా మంచి స్నేహితులుగా...
తమన్నా, విజయ్ వర్మ మధ్య బ్రేకప్ జరిగే కొన్ని వారాలే అయ్యిందట. ఆ విషయాన్ని వాళ్ళిద్దరి సన్నిహితులు బాలీవుడ్ మీడియాకు స్పష్టం చేశారు. విడిపోయిన సరే మంచి స్నేహితులుగా కంటిన్యూ అవ్వాలని నిర్ణయం తీసుకున్నారట. అయితే ఇద్దరి మధ్య దూరం పెరగడానికి కారణం ఏమిటి? బ్రేకప్ ఎందుకు జరిగింది? అనే కారణాలు తెలియాల్సి ఉంది.
Also Read: నిర్మాతగా దానయ్య కుమార్తె... బాలీవుడ్ హీరోతో సైకలాజికల్ హారర్ ఫిల్మ్... బడ్జెట్ ఎంతో తెలుసా?
'ఓదెల 2'తో పాటు తమన్నా బిజీ
ప్రస్తుతం తమన్నా సినిమాలతో బిజీగా ఉన్నారు. సంపత్ నంది క్రియేట్ చేసిన 'ఓదెల' ఫ్రాంచైజీలో ఆవిడ నటిస్తున్నారు. 'ఓదెల 2' సినిమాలో నాగ సాధువు పాత్ర పోషించారు. ఇటీవల మహా కుంభమేళాలో ఆ సినిమా టీజర్ విడుదల చేశారు. దీనికి ముందు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా 'స్త్రీ 2'లో తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయట.
Also Read: నాని, దేవరకొండ మధ్యలోకి అనసూయ... బూతు మాట్లాడితే బయటకు రాలేదే?





















