ఇద్దరు పిల్లలు వద్దు....గంపెడు పిల్లలే ముద్దు. తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపు.
Stalin: ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపు ఇవ్వడానికి కారణం డీలిమిటేషన్ ఎఫెక్ట్.

Population Policy: ఇద్దరు పిల్లలు ఇంటికి ముద్దు అనేవారు. ఇప్పుడు గంపెడు పిల్లలు రాష్ట్రానికి ముద్దు అని తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపునిస్తున్నారు. ఇందుకు కారణం డీలిమిటేషన్ ఎఫెక్ట్. నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కేంద్రం యోచిస్తోంది. అయితే ప్రస్తుతం కేంద్రం జనాభా ప్రాతిపదికన పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఉత్తరాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లు పెరుగుతుంటే, దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లు పెరిగేది స్వల్పం. ఇందుకు కారణం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లు పెంచడమే ఇందుకు కారణం.
ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. స్టాలిన్
ఇటీవలే తమిళనాడులోని నాగపట్నం లో ఓ పెళ్లికి హాజరయిన తమిళనాడు సీఎం వారిని ఆశీర్వదిస్తూ అక్కడ మాట్లాడిన మాటలు సంచలనం రేపాయి. ఇక ఒకరు లేక ఇద్దరు కాదు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని ఈ పెళ్లి వేదికగా రాష్ట్ర ప్రజలకు స్టాలిన్ సందేశం ఇచ్చారు. ఎంపీ సీట్లు పెరగాలంటే జనాభానే ప్రామాణికం అని తెలుస్తోందన్నారు. గతంలోపెళ్లి చేసుకున్న వెంటనే పిల్లల్ని కనవద్దని చెప్పేవాళ్లం. కాని ఇప్పుడు పెళ్లి కాగానే వెంటనే పిల్లల్ని కనే పనిలో ఉండండటూనే, వారికి మంచి తమిళ పేర్లు పెట్టాలని ఆ కొత్త దంపతులకు సూచించారు స్టాలిన్. లోక్ సభ సీట్ల పునర్విభజన అనేది తమిళ ప్రజల హక్కులకు, ప్రయోజనాలకు సంబంధించిందని తన మాటలను ఎవరూ రాజకీయం చేయవద్దని స్టాలిన్ అన్నారు. జనాభా ప్రాతిపదికన రాష్ట్రాల ఎంపీ సీట్లను కేటాయిస్తే 8 స్టానాలు తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను బట్టే మనకు దక్షిణాది రాష్ట్రాల ఆందోళన ఏంటో మనకు అర్థం అవుతుంది.
గతంలో జరిగి డీలిమిటేషన్స్ ఇలా ఉన్నాయి
1951 లో తొలి సారి నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పటి జనాభా లెక్కలకు అనుగుణంగా పార్లమెంట్ లో ఎంపీ సీట్లు ఏర్పాటు చేయడం జరిగింది. 1951లో జనాభా 36.1 కోట్లు. ఇందుకు అనుగుణంగా 495 సీట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆతర్వాత 1961 జనాభా లెక్క ప్రకరాం నాటి జనాభా 43.9 కోట్లు నాడు పార్లమెంట్ లో 522 సీట్లు ఏర్పాటు చేయడం జరిగింది. 1971 జనాభా లెక్కలు చూస్తే అప్పటి జనాభా 54.8 కోట్లు 543 సీట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 1951 లో 7.3 లక్షల మందికి ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తే, 1961 జనాభా ప్రకారం 8,4 లక్షల మందికి ఒక ఎంపీ, 1971 జనాభా లెక్కల ప్రకారం 10 లక్షల మందికి ఒక ఎంపీ లోక్ సభలో ప్రాతనిధ్యం వహించారు.
ప్రస్తుత డీలిమిటేషన్ వల్ల జరిగే నష్టం ఇలా..
ప్రస్తుత జనాభా ప్రకారం లోక్ సభ సీట్లు 543 నుండి 753కు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రనను బాగా అమలు చేశాయి. ఉత్తరాదిలో అనుకున్నట్లుగా జరలేదు. తత్ఫిలితంగా ఆ రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ పెరిగింది. ఈ లెక్కన ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు దక్కే అవకాశం ఉందన్నది. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం లోక్ సభలో చూస్తే ప్రస్తుతం 24 శాతం. జనాభా ప్రాతిపదికన చూస్తే 753 సీట్లకు పెరుగుతాయి. ఇందులో యూపీ కి ప్రస్తుతం 80 లోక్ సభ సీట్లు ఉంటే అది 128 వరకు పెరిగే అవకాశం ఉంది. బీహార్ కు 40 నుండి 80 సీట్లకు, రాజస్థాన్ 2 5 నుంచి 44 సీట్లకు, మధ్యప్రదేశ్ 29 నుండి 47 సీట్లకు, మహారాష్ట్ర 48 నుండి 68 కు పెరగనున్నాయి. దక్షిణాది రాష్ట్రాల నేతల ఆందోళన. ప్రస్తుతం లోక్ సభ లో ఉన్న 543 సీట్లలో తమిళనాడుకు 39 సీట్లు ఉంటే పునర్విభనజ తర్వాత 41 సీట్లకు, కర్ణాటకకు 28 సీట్లు 36 , తెలంగాణకు 17 ఎంపీ స్థానాలు ఉంటే అవి 20 కు, ఏపీకి 25 సీట్లు ఉంటే అవి 28 కి పెరగనున్నాయి. కాని కేరళకు 20 ఎంపీ సీట్లు ఉంటే అవి 19కు తగ్గుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పార్లమెంట్ లో ఉత్తరాది మాటే చెల్లుతుంది. దక్షిణాది రాష్ట్రాల ఎంపీల సంఖ్య పెద్దగా పెరిగే అవకాశం లేదు. సంకీర్ణ రాజకీయాల్లో ఒక్క యూపీ లో స్థానాలు ఎక్కువ గెల్చుకున్న పార్టీనే ప్రధాని పదవి దక్కించుకోగలరు. ఇలా రాజకీయాలు మారిపోనున్నాయి. దీనిపైనే దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
కేంద్ర పన్నుల విషయంలోను దక్షిణాదికి మొండి చేయ్యే...
ఇప్పటికే నిధుల విషయంలోను దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల నుండి అత్యధిక స్థాయిలో పన్నులు కేంద్రానికి వెళుతుంటే, ఉత్తరాది రాష్ట్రాల నుండి మాత్రం ఆ మొత్తం తక్కువగా ఉంటోది. ఇక కేంద్రం రాష్ట్రాలు ఆ ఆదాయం పంచే విషయంలోను ఉత్తరాధి రాష్ట్రాలకు అధిక నిధులు వెళ్తుంటే, దక్షిణాది రాష్ట్రాలకు తక్కవు ఆదాయం కేంద్రం నుంచి వస్తోందని ఇప్పటే దక్షిణాది రాష్ట్రాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఇక కేంద్ర పన్నుల విషయానికి వస్తే అత్యధికంగా యూపీ కి 17.93 శాతం కేంద్ర పన్నుల్లో దక్కుతుంది. ఆ తర్వాత బీహార్ కు 10 శాతం దక్కుతోంది. మన రాష్ట్రం విషయం వస్తే కేంద్ర పన్నుల్లో మనకు దక్కేది కేవలం 2.1 శాతం మాత్రమే.
వివక్ష ఎందుకు.. ?
ఇలా నిధుల్లోను, ఎంపీ సీట్ల పెంపులోను వివక్ష ఎందుకంటే కుటుంబ నియంత్రణకు ప్రోత్సహాకాలు గత కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేవి. కేంద్రం ఆదేశాల మేరకు దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేసి మన దేశంలో జనాభా విస్ఫోటనాన్ని అరికట్టాయి. ఉత్తరాది రాష్ట్రాలు సరిగా అమలు చేయలేదు. దీంతో ఆ రాష్ట్రాల్లో జనాభా పెరిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గింది. ఇప్పుడు నిధుల కేటాయింపు, ఎంపీ సీట్ల పెంపు వంటి అంశాల్లో జనాభా ప్రాతిపదికగా తీసుకుని నిర్ణయాలు కేంద్రం తీసుకుంటోంది. దీని వల్ల దక్షణ రాష్ట్రాలు నష్టపోతున్నాయి. దీన్నే సౌత్ నేతలు తప్పుబడుతున్నారు.






















